ప్రెస్ మీట్లు

‘కంచర్ల’ షూటింగ్‌ ప్రారంభం!!

ఎస్‌.ఎస్‌.ఎల్‌.ఎస్‌. క్రియేషన్స్‌ బేనర్‌పై కె. అచ్యుతరావు సమర్పణలో ఉపేంద్ర హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘కంచర్ల‌. ఈ చిత్రానికి రెడ్డెం యాద కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి జైస్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్‌ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర, హీరోయిన్లు మీనాక్షి జైస్వాల్‌,  ప్రణీతలపై తొలి షాట్‌ని దర్శకుడు రెడ్డెం యాద కుమార్‌ చిత్రీకరించగా సమర్పకులు కె. అచ్యుతరావు క్లాప్‌ కొట్టి షూటింగ్‌ ప్రారంభించారు.

అనంతరం చిత్ర‌ సమర్పకులు కె. అచ్యుతరావు మీడియాతో మాట్లాడుతూ…‘‘సినీ ప్రేక్షకులకు వినూత్న కథాంశంతో కూడిన చిత్రాన్ని అందించేందుకు ‘కంచర్ల’ చిత్రం రూపొందిస్తున్నామన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల, అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాం. ఉపేంద్ర హీరోగా నటిస్తున్న ‘కంచర్ల’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శకులు రెడ్డెం యాద కుమార్‌ మాట్లాడుతూ .. ‘‘యువకులు రాజకీయాల్లోకి రావాలి. సేవా దృక్పథంతో ఉండాలి అనే కాన్సెప్ట్‌ తో లవ్‌ అండ్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తొలి షెడ్యూల్‌ ప్రారంభించాం. విశాఖ ప్రాంతంలోనే మొద‌టి షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుపుతాము. ఈ  సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ` అన్నారు.


హీరో ఉపేంద్ర, హీరోయిన్‌ మీనాక్షి జైస్వాల్‌ మాట్లాడుతూ…‘‘కంచర్ల చిత్రం తమ నటనా జీవితానికి మలుపు రాయిగా నిలుస్తుంది’ అన్నారు.
 కార్యక్రమంలో సినీ నటుడు బాహుబలి ప్రభాకర్‌, డీఓపీ గుణశేఖర్‌, క్యాలు జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

9 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago