శింబు-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో
‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ : తెలుగులో ‘ శ్రీ స్రవంతి మూవీస్’ ద్వారా ఈ నెల 15న విడుదల
తమిళ స్టార్ హీరో శింబు, స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలూ మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మూడో సినిమాగా ‘ వెందు తనిందదు కాడు’ రూపొందింది. సిద్దీ ఇధ్నానీ ఇందులో కథానాయక. ఏఆర్ రెహమాన్ స్వరాలందించారు.
రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి.కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది.
ఈ నెల 15న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మాట్లాడుతూ ‘’ ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా పాజిటివ్ గా ఉందనిపించింది. శింబు యాక్టింగ్ గురించి, గౌతమ్ మీనన్ టేకింగ్ గురించి, రెహమాన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శింబూ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే గౌతమ్ మీనన్ కి కూడా. ఇంతకు ముందు మా ‘స్రవంతి’ సంస్థలో ‘నాయకుడు’ , ‘ పుష్పక విమానం’ , ‘ రెండు తోకల పిట్ట’, రఘువరన్ బీటెక్’ చిత్రాలు డబ్ చేశాం.
అవి తెలుగులో సంచలన విజయం సాధించాయి. ఇప్పుడు ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ తో అసోసియేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే కాన్సెప్ట్ ఇది. ఈ నెల 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాo’’ అని తెలిపారు.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్తోపాటు చక్కటి సోషల్ మెసేజ్తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…