‘లక్కీ లక్ష్మణ్‘ సినిమా నుంచి విడుదల చేసిన “ఓ మేరీ జాన్” సాంగ్

హీరో సోహైల్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తరువాత సోహైల్ చేస్తున్న చిత్రం “లక్కీ లక్ష్మణ్ “. దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో, హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ సినిమాలోని “ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..’ లిరికల్ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్ .

ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..
ఓ మేరీ జాన్ వెనకే నీతో వస్తూ.. ఉన్నదే..
ఓ మేరీ జాన్ నిన్నే.. వదిలి వదిలి ఉండ నన్నదే

అంటూ సాగే లవ్ సాంగ్ చాలా క్లాసీ గా ఇంట్రెస్ట్ గా ఉంది. హీరో సోహైల్ డ్యాన్స్ చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఈ పాటను ప్రముఖ రచయిత భాస్కరపట్ల రాశారు. సింగర్ అనురాగ్ కులకర్ణి చ‌క్క‌గా ఆలపించారు. ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. డి ఓ పి ఆండ్రు చక్కటి విజువల్స్ ఇచ్చారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నుంచి వస్తున్న మరో క్రేజీ సాంగ్ ఈ “ఓ మేరీ జాన్”. ఈ ప్రోమో సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 9:33 గంటలకు విడుదల చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తాయి.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. ఇంతకుముందు మా చిత్రం నుండి విడుదలైన “అదృష్టం హలో అంది రో చందమామ” టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ కు, సాంగ్ ప్రోమో కు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం విషయానికి వస్తే చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’. ఈ చిత్రం నుండి విడుదల చేసిన “ఓ మేరీ జాన్” ప్రోమో సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పూర్తి పాటను సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 9:33 గంటలకు విడుదల చేస్తున్నాం. సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించిన ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో నే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అన్నారు.

లక్కీ లక్ష్మణ్ పాటలు టిప్స్ ఆడియో ద్వారా విడుదలయ్యాయి.

నటీనటులు

సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి , జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ కామెడీ స్టార్స్ ఫేమ్ యాదం రాజు తదితరులు

సాంకేతిక నిపుణులు

బ్యానర్స్ – దత్తాత్రేయ మీడియా, నిర్మాతలు – హరిత గోగినేని, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – ఏఆర్ అభి, సంగీతం – అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ – ఐ. ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, పాటలు – భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ – విశాల్,
ఆర్ట్ డైరెక్టర్ – చరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయానంద్. కీత, పీఆర్వో – నాయుడు-ఫణి, మార్కెటింగ్ పార్ట్ నర్ – టికెట్ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే, కాస్టింగ్ డైరెక్టర్ – ఓవర్ 7 ప్రొడక్షన్స్

Tfja Team

Recent Posts

ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం.. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.. ‘సన్ ఆఫ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత, హీరో సాయి సింహాద్రి

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని…

53 minutes ago

‘హేబల్‌వంత్‌’ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది: థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌లో వెల్లడించిన చిత్ర నిర్మాత

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

3 hours ago

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

1 day ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

3 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

3 days ago