దర్శకుడు బి.గోపాల్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన సాయి విలా సినిమాస్ ప్రొడక్షన్ నెం 2

ఒక మధ్య తరగతి ప్రేమజంటకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మంచి ప్లాన్ తో చేజిక్కుంచుకొని కోటేశ్వరులు ఎలా అయ్యారు? అనేదే ఈ కథ. రావుల గౌరమ్మ  సమర్పణలో సాయి విలా సినిమాస్  పతాకంపై కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కొడుకు), సుమీత  జంటగా  అంజన్ చెరుకూరి  దర్శకత్వంలో  నిర్మిస్తున్న  ప్రొడక్షన్ నెం 2. కొత్త సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ గారు, రేలంగి నరసింహారావు గారు.గౌతం రాజు, ప్రసన్న కుమార్ గారు, రామ సత్య నారాయణ .డి ఎస్ రావు,ఆర్టిస్ట్ మాదవి గారు. తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం కృష్ణ, సుమీత  హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి  దర్శకుడు బి. గోపాల్ గారు  క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు..దర్శకుడు రేలంగి నరసింహారావు గారు గౌరవ దర్శకత్వం  వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన  పాత్రికేయుల సమావేశంలో 

చిత్ర దర్శకుడు : అశల పల్లకిలో అందరూ ఊగుతూ ఉంటారు.కానీ ఆ ఆశలు తీర్చుకొని ఎలా కోటీశ్వరులు అయ్యారు అనేదే ఈ సినిమా కథ. అయితే రాజమౌళి గారు నిర్మాతలు ఇచ్చిన బడ్జెట్ లో మిగిల్చి ఇవ్వడం అలవాటు. నేను అదే ఫాలో అవుతున్నాను.. నిర్మాతలకు నేను చెప్పిన కథ నచ్చడంతో దర్శకుడిగా ఈ సినిమా చేసే అవకాశం కల్పించారు వారికి.ధన్యవాదాలు. నిర్మాత అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో తెరకేక్కించడానికి ప్రయత్నిస్తాను అన్నారు.

చిత్ర నిర్మాతలు లక్ష్మణ్  రావు., శ్రీనివాస్ లు మాట్లాడుతూ ...మా అభిమాన నటుడు  మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే  రోజు మా సినిమాను ప్రారంభించు కోవాలనుకొని ఈ రోజు సినిమా మొదలు పెట్టాము. మా మొదటి సినిమా రుద్రవీణ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ కథ నచ్చడంతో మా రెండవ  ప్రాజెక్టు గా ప్రొడక్షన్ నెంబర్ 2 లో ఈ సినిమా తీస్తున్నాము. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్నాము మంచి కథతో  వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ మెప్పు పొందేలా ఉంటుంది అన్నారు.

హీరో కృష్ణ మాట్లాడుతూ.. నా ఐదవ సినిమాకు బి. గోపాల్, రేలంగి నరసింహరవు గారి వంటి లెజెండ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది.ఈ చిత్ర నిర్మాతలు నన్ను, దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేయడానికి  ముందుకు వచ్చారు. వారు మా పై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటామని  తెలుపుకుంటున్నాను అన్నారు

కమెడియన్ గౌతం రాజు మాట్లాడుతూ.. ,మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మా అబ్బాయి సినిమా ప్రారంభం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత లక్ష్మణ్ డేరింగ్ పర్సన్. తన మెదటి సినిమా రిలీజ్ కాకముందే రెండవ సినిమా మొదలుపెట్టాడు. దర్శకుడు కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

ప్రముఖ జర్నలిస్ట్ వినాయక్ రావు గారు మాట్లాడుతూ..
గౌతం రాజు గారు తన కొడుకుకు కృష్ణ  అనే  మంచి పేరు పెట్టాడు. హీరో కృష్ణ మంచి సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ కృష్ణ అంతటి స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

నిర్మాత రామ సత్య నారాయణ.గౌతం రాజు కొడుకు కృష్ణ  చేస్తున్న ఈ సినిమా ఐదవ సినిమా.ఇలాగే మంచి సినిమాలు తీస్తూ మంచి నటుడుగా ఎదుగుతూ ఫ్యూచర్ లో కృష్ణ తండ్రి గౌతం రాజు అనే స్థాయికి ఎడుగుతాడనే నమ్మకం ఉందని అన్నారు.చక్కని కథను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు మంచి పేరు వస్తుంది అన్నారు.

నటుడు డి ఎస్ రావు మాట్లాడుతూ ,.. కమెడీయన్ గా మంచి పేరు తెచ్చుకున్న గౌతం రాజు తనయుడు కృష్ణ హీరోగా మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. హీరో హీరోయిన్ ల జోడీ బాగుంది.నిర్మాత అనుకున్న బడ్జెట్ లో దర్శకుడు సినిమా తియలనీ అలాగే  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు

ప్రముఖ జర్నలిస్ట్ వినాయక్ రావు ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటీ నటులు
కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కొడుకు), సుమీత  తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : రావుల గౌరమ్మ
బ్యానర్: సాయి విలా
నిర్మాతలు : రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను
స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అంజన్ చెరుకూరి
DOP: ఎస్. రాజశేఖర్
సంగీతం: త్రినాథ్ మంతెన
ప్రొడక్షన్ మేనేజర్ : శ్రీ రాములు
పి ఆర్. ఓ : టి. యస్. యన్. మూర్తి

Tfja Team

Recent Posts

ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం.. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.. ‘సన్ ఆఫ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత, హీరో సాయి సింహాద్రి

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని…

3 hours ago

‘హేబల్‌వంత్‌’ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది: థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌లో వెల్లడించిన చిత్ర నిర్మాత

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

5 hours ago

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

1 day ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

3 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

3 days ago