ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కథానాయకుడిగా ‘యథా రాజా తధా ప్రజా’ సినిమా పూజా కార్యక్రమాలతో పార్రంభం అయ్యింది. ఇందులో ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ మరో హీరో. శ్రష్టి వర్మ కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ విట్టల దర్శకత్వంలో ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మాతలు.
ముహూర్తపు సన్నివేశానికి హీరో శర్వానంద్ క్లాప్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకులు కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శక – నిర్మాత శ్రీనివాస్ విట్టల మాట్లాడుతూ ”హరీష్ పటేల్‌తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాను. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాను. కథ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరికి అయితే బావుంటుందని ఆలోచిస్తున్న క్రమంలో జానీ గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికి ఆయన కథలు వింటున్నారు. నేను 20 నిమిషాల్లో కథ చెప్పగా… కీలక అంశం నచ్చి ఓకే చేశారు. రాజకీయ వార్తలు అంటే గతంలో పది నిముషాలు టీవీల్లో చూపించేవారు. ఇప్పుడు 24/7 రాజకీయ వార్తలు వస్తున్నాయి. రాజకీయాలు అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలిగించే అంశం అయ్యింది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నాం. ఇందులో సందేశంతో పాటి వాణిజ్య హంగులు అన్నీ ఉన్నాయి. సెప్టెంబర్ 15 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. మూడు షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాం. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. రధన్ గారు అద్భుతమైన బాణీలు అందించారు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వస్తుంది” అని అన్నారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ ”చిరంజీవి గారి పుట్టినరోజున మా సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విషయానికి వస్తే… శ్రీనివాస్ గారు చెప్పిన కథ వినగానే నచ్చింది. జానీ మాస్టర్ అంటే డ్యాన్స్, కమర్షియల్ అంశాలు కాకుండా మంచి కథతో వస్తే బావుంటుందని నిర్ణయం తీసుకున్నాను. ‘సినిమా బండి’ చూశా. వికాస్ బాగా చేశారు. ఆయనతో నటించడం సంతోషంగా ఉంది. ‘యథా రాజా తధా ప్రజా’ టైటిల్ ఐడియా మాకు ఇచ్చింది రైటర్ నరేష్ గారు. ఆయనకు థాంక్స్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నాం మా సినిమాకు పని చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా థాంక్స్. నన్ను, మా చిత్ర బృందాన్ని ఆశీర్వదించటానికి వచ్చిన శర్వానంద్ గారు, ఆయుష్ వర్మ గారికి థాంక్స్. నిన్నే ఆయుష్ శర్మతో ఒక సాంగ్ కంప్లీట్ చేశాం” అని అన్నారు.
హీరోయిన్ శ్రష్టి వర్మ మాట్లాడుతూ ”నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి థాంక్స్. నేను హీరోయిన్ పాత్రలో నటించగలనని ఆయన నమ్మకం ఉంచారు. జానీ గారికి కూడా థాంక్స్” అని అన్నారు.
‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ మాట్లాడుతూ ”జానీ గారితో పని చేయడం సంతోషంగా ఉంది. ఇదొక మంచి పొలిటికల్ డ్రామా. ఇందులో కమర్షియల్ అంశాలు ఉన్నాయి. ఇందులో కామెడీ, సెటైర్స్, సందేశం… అన్నీ ఉన్నాయి” అని అన్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ స్నేహితులు గణేష్ మాస్టర్ మాట్లాడుతూ ”ఆల్ ది బెస్ట్ టు ‘యథా రాజా తధా ప్రజా’ టీమ్. సినిమా పెద్ద హిట్ కావాలని దేవుడిని కోరుకుంటున్నాను. మా బ్రదర్ జానీకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శక – నిర్మాతలకు థాంక్స్. మ్యూజిక్ పరంగా దుమ్ము లేచిపోతుంది. అందులో డౌట్ లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. మంచి కథతో సినిమా రూపొందుతోంది” అని అన్నారు.
సంగీత దర్శకుడు రధన్ మాట్లాడుతూ ”సంగీతానికి న్యాయం జరగాలంటే మంచి మాస్టర్ ఉండాలి. మా సినిమాలో మాస్టారే హీరో. మా టీమ్ అంతా నాకు మంచి ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నారు. ఈ సినిమాలో మంచి పాటలు అందించడానికి ఆస్కారం లభించింది” అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ సునోజ్ వేలాయుధన్ మాట్లాడుతూ ”మాది కేరళ. ఏడెనిమిది నెలల క్రితం జానీ గారిని కలిశా. అప్పుడు ఆయన ఈ సినిమా కథ గురించి చెప్పారు. హైదరాబాద్ వచ్చి శ్రీనివాస్ విట్టల గారిని కలిసినప్పుడు కథను పూర్తిగా వివరించారు. బాగా నచ్చింది. మేమంతా టీమ్ గా వర్క్ చేస్తున్నాం” అని అన్నారు.
జానీ మాస్టర్ కథానాయకుడిగా… ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ మరో కథానాయకుడిగా, శ్రష్టి వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ : ఎస్. రంగారావు, పోస్టర్ డిజైనర్ : ధని ఏలే, కళ : బాబా, సంగీతం : రధన్, సినిమాటోగ్రఫీ : సునోజ్ వేలాయుధన్, నిర్మాణ సంస్థలు : ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్, నిర్మాతలు : శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్, కథ – కథనం – మాటలు – దర్శకత్వం : శ్రీనివాస్ విట్టల
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…