“రావణ కళ్యాణం” గ్రాండ్ గా ప్రారంభం

సింహా ప్రధాన పాత్రలో హాల్సియాన్ మూవీస్ , ఎంఎఫ్ఎఫ్  ముద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై  ప్రొడక్షన్ నెం 1 గా జెవి మధు కిరణ్ దర్శకత్వంలో నూతన చిత్రం “రావణ కళ్యాణం” పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. సత్యదేవ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సింహా తనయుడు అర్జున్ సింహా క్లాప్ ఇవ్వగా, వివి వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

పాన్ ఇండియా మూవీగా  తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అరుణ్ కుమార్ సూరపనేని, కె. రేష్మి సింహా నిర్మిస్తున్నారు. ఆలూరి సురేష్,  సింహా సమర్పకులు. సందీప్ మాధవ్ , రాజేంద్ర ప్రసాద్,  దీపికా, శత్రు, మధునందన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అనంతరం సింహా మాట్లాడుతూ.. “రావణ కళ్యాణం” చాలా ఆసక్తికరమైన కథ. వంగవీటి, జార్జ్ రెడ్డి చిత్రాల్లో అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేసిన శాండీ ఈ చిత్రంలో భాగం కావడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. రధన్ సంగీతం ఈ చిత్రానికి మరో పెద్ద అసెట్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. జాతిరత్నాలు చిత్రంలో సిద్దం మనోహర్ విజువల్స్ నాకు చాలా ఇష్టం. ఈ కథకు ఆయన విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. శరత్ రవి, శత్రు, రాజేంద్ర ప్రసాద్ లాంటి అనుభవం గల నటులు కీలక పాత్రలు పోహిస్తున్నారు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, ఈ సినిమా చుస్తునప్పుడు ప్రేక్షకులు కూడా అంతే ఎక్సయిట్ అవుతారు” అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ..  “రావణ కళ్యాణం”  పాన్ ఇండియా స్థాయిలో చేయబోతున్నాం. తెలుగు, తమిళ్. హిందీ, కన్నడలో ఒకేసారి విడుదల చేయబోతున్నాం” అన్నారు.

ఈ చిత్రానికి సిద్దం మనోహర్  సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రధన్ సంగీతం సమకూరుస్తున్నారు. భవానీ ప్రసాద్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి  శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

తారాగణం : సింహా, సందీప్ మాధవ్,  రాజేంద్ర ప్రసాద్,  దీపికా , రీతు గాయత్రి (పరిచయం),  శత్ర,  రాజ్‌కుమార్ కాసి రెడ్డి, మధునందన్, గుండు సుదర్శన్ , అనంత్ తదితరులు

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం- జెవి మధు కిరణ్

సినిమాటోగ్రఫీ – సిద్దం మనోహర్

సంగీతం- రాధన్

ఎడిటర్- శ్రీకాంత్ పట్నాయక్

డైలాగ్స్- భవానీ ప్రసాద్

యాక్షన్ – గణేష్

ఆర్ట్ – దేవా

లిరిక్స్- రెహమాన్, రాంబాబుగోసల, కాసర్ల శ్యామ్

కొరియోగ్రఫీ- జానీ, షరీఫ్

పీఆర్వో – వంశీ శేఖర్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago