ప్రెస్ మీట్లు

లాంఛనంగా బాక్సు బద్దలౌద్ది సినిమా ప్రారంభం…

చందన మూవీస్ బ్యానర్లో సీడీ నాగేంద్ర నిర్మాతగా, తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “బాక్సు బద్దలౌద్ది”. వివేకానంద విక్రాంత్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సుధాన్ కుమార, ప్రవీణ్  ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు.

నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రసన్న కుమార్ క్లాప్ కొట్టగా మరొక ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్ వడ్లపట్ల కెమెరా స్విచాన్ చేయగా, ఎస్ కుమార స్వామి మొదటి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం నిర్విరామంగా 35 రోజుల పాటు కొనసాగనుంది. 

ఈ సందర్భంగా దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.., కరోనా అనంతరం సినిమా పరిశ్రమలో నెలకొన్న సంఘటనలు ప్రధానాంశంగా తీసుకుని, ఒక ఫిల్మ్ మేకర్ కలను సినిమా రూపంలో చూపించబోతున్నాం. అలాగే మూవీ మొఘల్ రామానాయుడు గారి ఆలోచన విధానం లో ఉన్న ఆర్కే నాయుడు అనే పాత్రలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నటించడం మా టీం కి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మా సినిమా ప్రారంభానికి విచ్చేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.., నిజ జీవితంలో నిర్మాతగా ఉన్న నన్ను ఈ సినిమాలో ముఖ్యమైన నిర్మాత పాత్రలో తెరపైకి తీసుకు వస్తున్న సినిమా బృందానికి శుభాభినందనలు తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ, కథనం తో పాటు సినిమా టైటిల్ సైతం నన్నెంతగానో ఆకట్టుకుందని అన్నారు. 

సినిమాలో సినిమా తీయడమే కాన్సెప్ట్ ఇప్పటికీ ఎవర్గ్రీన్, మా సినిమా ప్రారంభానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలని సినిమా హీరో వివేకానంద్ విక్రాంత్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సుధాన్ కుమార్, పెరుమాళ్ళ ప్రవీణ్, సతీష్, చరణ్, శశి తదితరులు పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

7 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago