విజయ నిర్మల గారి మనవుడు శరణ్ కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ పతాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్నారు.
మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుండి ‘నేనెరగని దారెదో’ పాటని చిత్ర యూనిట్ విడుదల చేసింది. యూత్ ఫుల్ మెలోడీ నెంబర్ గా ఈ పాటని అద్భతంగా స్వరపరిచారు మణిశర్మ. హారిక నారాయణ్ పాటని పాడిన విధానం లవ్లీగా వుంది.
♫ నేనెరగని దారెదో నన్నే చేరి
నా నడకని మార్చేసిందా ?
నేతలవని మాయేదో నీలా సోకి
నా బ్రతుకును అల్లేసిందా..?
నువ్వు పిలిచినా.. పేరు నాదని అననా..
నువ్వు నడిచినా దారే.. నడకవానా..♫
ఈ పాటకు కడలి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. లవ్లీ మెలోడీగా ఆకట్టుకున్న ఈ పాట ఇన్స్ టెంట్ హిట్ గా నిలిచింది.
యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది.
నటీనటులు:
శరణ్ కుమార్, నిష్కల, ఊర్వీ సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్,ఎఎస్ కంచి, శ్వేత ప్రగటూర్, ఐడ్రీమ్ అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్‌కుమార్ సమర్థి, శ్రీనిధి గూడూరు
సాంకేతిక విభాగం:
నిర్మాణం: హన్విక క్రియేషన్స్, ప్రెజెంట్స్: బేబీ హన్విక ప్రెజెంట్స్,
నిర్మాత: బి.ఎన్.రావు
కథ, దర్శకత్వం: శశిధర్ చావలి
సంగీత దర్శకుడు: మణిశర్మ
సినిమాటోగ్రాఫర్: తన్వీర్ అంజుమ్
సహ నిర్మాత: రవికిరణ్ చావలి
పబ్లిసిటీ డిజైనర్: శివం సి కబిలన్,
కాస్ట్యూమ్ డిజైనర్: కావ్య కాంతామణి, రాజశ్రీ రామినేని
పి.ఆర్.ఓ: వంశీ – శేఖర్
శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేందర్…
Under the banner of Sri Naarasimha Chitralaya, the film "Marrichettu Kinda Manollu" was officially launched…
తన తొలి మూవీ ‘మేం ఫేమస్’తో లీడ్ యాక్టర్, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా తన…
Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline…
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…
Aaron Taylor-Johnson is arguably one of the fittest stars out there and his physical transformation…