ఇషా చావ్లా సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది.. హీరో రాజ్ బాల



           లవ్ భూమ్,7 to 4, చిత్రం X, సినిమాలలో హీరోగా నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు రాజ్ బాల. తాజాగా మెగా ఫిలిమ్స్ నిర్మించే ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలో హీరో గా నటిస్తున్నాడు. ఈషా చావ్లా హీరోయిన్. ఈ నెల 17 న రాజ్ బాల పుట్టినరోజు సందర్బంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

మాది ప్రకాశం జిల్లా గిద్దరూరు యడవల్లి  గ్రామం మా నాన్న ఆర్ టి సి కండక్టర్ నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ఎంతో ఇష్టం. నా డిగ్రీ అనంతరం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో థియేటర్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను.ఆ తరువాత సినిమాలలో నటించాలని ప్రయత్నం చేస్తున్న టైమ్ లో డైరెక్టర్ కరుణాకరన్ గారు “ఎందుకంటే ప్రేమంటే” సినిమాలో చిన్న రోల్ ఇచ్చారు.ఆ తరువాత తొంగి తొంగి చూడమాకు చందమామ”, “అంతకుమించి” వంటి  సినిమాలు చేస్తున్న టైమ్ లో డైరెక్టర్ నగేష్ నారాదాసి గారు “లవ్ బూమ్” సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు.
                 ఈ సినిమా తరువాత విజయ్ శేఖర్ సంక్రాంత్రి  దర్శకత్వంలో నేను హీరోగా  చేసిన “7 to 4” సినిమాబిగ్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా అడ్వాన్స్ కథ తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులనుండి, ఇండస్ట్రీ నుండి నాకు మంచి గుర్తింపు లభించింది.ఇప్పట్లో రిలీజ్ అయితే ఇప్పటి ఓటిటి ట్రెండ్ కు  కరెక్ట్ సెట్ అయ్యేది .అలాగే కరోనా టైమ్ లో రిలీజ్ అయిన రమేష్ విభూది డైరెక్షన్ లో వచ్చిన “చిత్రం X” సినిమా కూడా నాకు చాలా మంచి గుర్తింపు లభించింది.


                        ఈ పది సంవత్సరాలు జర్నీ లో నేను ఆర్టిస్ట్ గా, నటుడుగా, హీరోగా ఇలా ఎన్నో ఒడి దుడుకులు ఎదురైనా నేను చేసే ప్రతి  పనికి,సినిమాకు ఫలితం ఎక్స్పెక్ట్ చేయకుండా ముందుకు వెళితే ఫలితం దానంతటదే వస్తుంది అనేదే నా కాన్సెప్ట్. ప్రస్తుతం నేను చాలా హ్యాపీ గా ఉన్నాను. ఎందుకంటే ప్రకాశం జిల్లాలోని ఒక మారు మూల  గ్రామం  నుంచి వచ్చి  ఇన్ని సినిమాలలో హీరోగా చేయగలిగే స్థాయికి వచ్చాను అంటే నాకు దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ అనుకుంటున్నాను.


                               ప్రస్తుతం  నేను మెగా ఫిలిమ్స్ పతాకంపై కమలాకరరావు ,కిషోర్ నిర్మాతలుగా జాక్ దర్శకత్వంలో హీరో చేయడం చాలా ఆనందంగా ఉంది ఇది నాకు మంచి ప్రాజెక్టు అవుతుంది.ఈ సినిమా 40% షూటింగ్ జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ అవుతుంది.ఇందులో కాలకేయ ప్రభాకర్ విలన్ గా,. ఈషా చావ్లా  హీరోయిన్ గా నటిస్తున్నారు. మాస్ క్యారెక్టర్ లో  సినిమా మొత్తం ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ లా సాగుతున్న ఈ సినిమా ఇప్పుడొస్తున్న సినిమాల్లా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కంప్లీట్ గా ఈషా చావ్లా , నామీద, కాలకేయ  ప్రభాకర్ ల మీద ఈ కథ సాగుతుంది. ఇందులో విలన్ గా కాలకేయ ప్రభాకర్ చేస్తున్నాడు. హీరోయిన్ ఈషా చావ్లా గారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటుంది. అందుకే తను చేసిన సినిమాలన్నీ హిట్ సాధించాయి.అలాగే మంచి కథతో  వస్తున్న ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది.
           ప్రస్తుతం సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన గాలోడు రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో కాలేజ్ లో నెగిటివ్ రోల్ చేశాను ఈ సినిమా నాకు మంచి ఐడెంటిటీ వస్తుంది.. కన్నడలో “ననిగే ఎంతి బేకు”,తెలుగులో “నాకు పెళ్ళాం కావాలి” వంటి  బై లింగ్వేల్ సినిమా చేస్తున్నాను.మరో సినిమా “బృహన్నల” .తెలుగు, హిందీ  తమిళ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు “రా” టైటిల్ పెట్టారు. ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అని ముగించారు

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

16 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

16 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

16 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago