‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్ విడుదల

A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, కార్తీక్ జయంత్, ప్రియాంక రెవరి హీరోహీరోయిన్లుగా సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో.. ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్. సిహెచ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేమలో సరికొత్త యాంగిల్‌ని ఈ చిత్రంలో టచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎంటైర్ యూనిట్‌కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు.

చిత్ర నిర్మాతలలో ఒకరైన వేమూరి ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర మోషన్ పోస్టర్‌ని విడుదల చేసిన దర్శకుడు అనిల్ రావిపూడిగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. మోషన్ పోస్టర్ ఆయనకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా మంచి కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నాము. మా దర్శకుడు సాయి సునీల్ ఈ కథ చెప్పిన తీరు నాకెంతో నచ్చింది. అందుకే నా సన్నిహితుడు హరిప్రసాద్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఇందులో 5 పాటలు, 3 ఫైట్స్ ఉంటాయి. మంచి లవ్ స్టోరీ. సినిమా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ రెడీ అవుతోంది. త్వరలోనే విడుదల వివరాలను తెలియజేస్తాము.. ’’ అని తెలిపారు.

దర్శకుడు సాయి సునీల్ నిమ్మల మాట్లాడుతూ.. మా చిత్ర మోషన్ పోస్టర్ ఆవిష్కరించి.. మా టీమ్‌ని బ్లెస్ చేసిన అనిల్ రావిపూడిగారికి థ్యాంక్స్. సినిమా విషయానికి వస్తే.. ‘ప్రేమదేశపు యువరాణి’ టైటిల్ ప్రకటించగానే మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడ్డారు. నాకు సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. నిర్మాతలు అందించిన సహకారం మరువలేనిది. అతి త్వరలో టీజర్‌ని విడుదల చేయనున్నాము. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అలాగే కాసర్ల శ్యామ్ గారి పాటలు, ఆర్పీ పట్నాయక్ సోదరుడు అజయ్ పట్నాయక్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చే చిత్రంగా ఈ సినిమా ఉంటుంది..’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న యామిన్ రాజ్, కార్తీక్ జయంత్ వంటి వారు మాట్లాడుతూ.. వచ్చిన అవకాశానికి సంతోషం వ్యక్తం చేశారు.

నటీనటులు
యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంక రెవరి , సందీప్, రాజారెడ్డి, పవన్, యోగి కత్రి, శ్రవంతి, సునీత, ఇంటింటి గృహలక్ష్మి ఫేమ్ హరికృష్ణ, సాయి, బండ సాయి, భాష, సారిక, గణేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

బ్యానర్స్: A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటర్‌టైన్‌మెంట్స్
సినిమాటోగ్రాఫర్: శివకుమార్ దేవరకొండ
మ్యూజిక్: అజయ్ పట్నాయక్
లిరిక్స్: కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్: నాయుడు రాజు
సౌండ్ ఎఫెక్ట్: పురుషోత్తం రాజు
ఫైట్ మాస్టర్: శివరాజ్ మాస్టర్
డాన్స్ మాస్టర్స్: కపిల్ మాస్టర్, శ్రీవీర్ మాస్టర్
కాస్ట్యూమ్ డిజైనర్: మహి
ఎడిటర్: యంఆర్. వర్మ
పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాతలు : ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్.సిహేచ్
రైటర్ అండ్ డైరెక్టర్ : సాయి సునీల్ నిమ్మల

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago