తెలుగు ఇండియన్ ఐడల్ 3 నుంచి ఎలిమెంట్ అయిన రజనీ శ్రీ పూర్ణిమ

హైదరాబాద్, జూలై 29, 2024 –

గత వీకెండ్ లో ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారమైన తాజా ఎపిసోడ్‌లో రజనీ శ్రీ పూర్ణిమ ఎలిమినేట్ కావడంతో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో కాంపిటేషన్ డ్రమటిక్ టర్న్ తీసుకుంది.

జూన్ 14, 2024న ప్రీమియర్‌ ప్రసారం చేసినప్పటినుండి, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 వరుస ఎలిమినేషన్‌లను జరుగుతున్నాయి, షో నుండి ఎలిమెంట్ అయిన మూడవ కంటెస్టెంట్ గా రజనీ శ్రీ పూర్ణిమ నిలిచింది. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకుల ఓట్లు, న్యాయనిర్ణేతల స్కోర్‌ల ద్వారా నిర్ణయించారు. ఈ సీజన్‌లో ముందుగా కంటెస్టెంట్స్ కుశాల్ శర్మ, హరి ప్రియ ఎలిమినేట్ అయ్యారు.

శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేసిన ఇటీవలి ఎలిమినేషన్ రౌండ్‌లో, శ్రీ ధృతి, స్కందతో పాటు రజని శ్రీ పూర్ణిమ, వారి తక్కువ స్కోర్‌ల కారణంగా డేంజర్ జోన్‌లో ఉన్నారు. స్కంద అత్యధిక ఓట్లను సాధించి ఫస్ట్ సేఫ్ అయ్యాడు. ఎలిమినేషన్ వార్ లో రజని శ్రీ పూర్ణిమ, శ్రీ ధృతి నిలిచరు, అంతిమంగా, రజనీ శ్రీ పూర్ణిమ అతి తక్కువ ఓట్లు పొంది ఎలిమెంట్ అయ్యారు.

ఆమె ఎలిమినేషన్ తర్వాత, జుద్జ్ కార్తీక్ ఆమె ఎలిమినేషన్ పై రిగ్రెట్ అయ్యారు, మ్యూజిక్ ని కొనసాగించమని ప్రోత్సహించారు. భవిష్యత్తులో ఆమెను తన స్టూడియోలో చూస్తారని వాగ్దానం చేశారు. జడ్జి గీతా మాధురి ప్రోత్సాహకరమైన మాటలు అందించారు, ఆమె ప్రేరణతో ఉండాలని, ఆమె సంగీత ప్రయాణాన్ని కొనసాగించాలని కోరారు.

జడ్జి ఎస్ థమన్ భవిష్యత్తులో రజనీ శ్రీ పూర్ణిమతో కలిసి పనిచేయాలనే తన కోరికను తెలియజేశారు, ఆమె వాయిస్ సరిపోయే పాట వస్తే ఆమెను దృష్టిలో ఉంచుకుంటానని, అవకాశం ఇస్తానని చెప్పారు “మీరందరూ మా హృదయాలకు, చెవులకు చాలా దగ్గరగా ఉన్నారు. స్ట్రాంగ్ గా వుండండి, కష్టపడండి” చెప్పారు.

ప్రత్యేక అతిథి గా వచ్చిన డ్రమ్స్ శివమణి రజనీ శ్రీ పూర్ణిమ ట్యాలెంట్ ని కొనియాడుతూ.. ‘‘నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది’ అన్నారు

తోటి కంటెస్టెంట్స్ ఎమోషనల్ గా వీడ్కోలు పలికారు. రజనీ శ్రీ పూర్ణిమ ఎలిమినేషన్ తో, పోటీ వేడెక్కింది, మొదటి స్థానం కోసం తొమ్మిది మందికంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. షోలో పబ్లిక్ ఓటింగ్, న్యాయనిర్ణేతల స్కోర్‌ల ఆధారంగా వీక్లీ ఎలిమినేషన్‌లను కొనసాగుతుంది, వైల్డ్ కార్డ్ అదనపు ఉత్సాహాన్ని జోడించే అవకాశం ఉంది.

వీక్షకులు ఆహా యాప్ ద్వారా లేదా ప్రతి కంటెస్టెంట్ కోసం నియమించబడిన నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా ఓటు చేయవచ్చు. ఓటింగ్ లైన్లు శుక్రవారం రాత్రి 7 గంటల నుండి ఆదివారం ఉదయం 7 గంటల వరకు తెరిచి ఉంటాయి.

అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లు, ఎమోషనల్ మూమెంట్స్ కోసం ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి ట్యూన్ అవ్వండి.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago