OTT లో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ “కిస్మత్” కి అధ్భుత స్పందన

Must Read


థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన కామెడీ థ్రిల్లర్ “కిస్మత్” … ఇప్పుడు OTT లోనూ అధ్భుత ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో న‌రేష్ అగ‌స్త్య‌, అభిన‌వ్ గోమ‌టం, విశ్వ‌దేవ్ హీరోలుగా న‌టించారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకం పై కిస్మత్ మూవీ నీ రాజు, భాను ప్రసాద్ రెడ్డి లు నిర్మించారు.ఇటీవల ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాతో శ్రీనాథ్ బాదినేని ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో అవ‌స‌రాల శ్రీనివాస్ కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఈ వేసవిలో ఓటీటీలో విడుదలయిన మంచి కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 2న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంది. అభిన‌వ్ గోమ‌టం, న‌రేష్ అగ‌స్త్య కామెడీనీ బాగా ఎంజాయ్ చేశారు. కిస్మ‌త్ రిలీజైన రోజు టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎనిమిది సినిమాలు రిలీజ్ అయినా… కిస్మత్ మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు అమెజాన్లో ఇండియా వైడ్ గా నెంబర్ 4గా ట్రెండ్ అవుతుంది. అలాగే అహా ఓ టి టి లో కూడా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తోంది.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News