నవంబర్ 11 న ఆహాలో ‘ఓరి దేవుడా’

అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిరంతంర ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా  తన ఎంటర్‌టైన్‌మెంట్ కిట్టీలో మరో క్రేజీ ప్రాజెక్టును యాడ్ చేసుకుంది. ఆ సినిమాయే ‘ఓరి దేవుడా’.  విక్టరీ వెంకటేష్, విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని పరల్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. థియేటర్స్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ చిత్రం ఆహాలో నవంబర్ 11న వరల్డ్ డిజిటల్ ప్రీమియగా ఆకట్టుకోనుంది.ఈ రొమ్ కామ్‌న అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేశారు. మైఖేలాంజెలో  ఫ్రెస్కో పెయింటింగ్, ఆడమ్ యొక్క సృష్టిని గుర్తుచేస్తూ, ఓ మిస్టరీయస్ మ్యాన్ (వెంకటేష్ దగ్గుబాటి) మన కథానాయకుడు అర్జున్ (విశ్వక్ సేన్)కి ఓ గోల్డెన్ టికెట్‌ను ఇస్తాడు. దాని ద్వారా అర్జున్ తన సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. జీవితంలో సెకండ్ ఛాన్స్ అనే విషయంపై ఈ రొమ్ కామ్ రూపొందింది. ఇందులో ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఉంటాయి. విభిన్న దృక్కోణాలను సినిమాలో చూస్తున్నప్పుడు అవి మన విషయాలను విభిన్నంగా చూసే విధానం ఫలితాన్ని ఎలా మార్చగలదు.. అదే సంబంధంలో మొత్తం కథనాన్ని ఎలా మార్చగలదు అనేది చిత్రం యొక్క ప్రధాన కథాంశం.

ఈ సందర్భంగా మిథిలా పాల్కర్ మాట్లాడుతూ ‘‘మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండే పాత్రలను చేయటానికి నాకు చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి పాత్రలు, వ్యక్తులు ఇతరులపై ఆధారపడరు. అలాంటి ఓ పాత్రను ఈ సినిమాలో నేను చేయటం చాలా హ్యాపీగా ఉంది. నా పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఆహాలో ప్రీమియర్ కానుంది. ఇంకా తెలుగు ప్రేక్షకులకు మా ఓరి దేవుడా సినిమా మరింత దగ్గర అవుతుందని భావిస్తున్నాను. వారు తమ ప్రేమాభిమానాలను చూపిస్తారని భావిస్తున్నాను.”విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘నేను చేసే ప్రతి సినిమా కొత్తగా ఉండాలని అనుకుంటాను. దాని వల్ల నటుడిగా నా పరిధిని పెంచుకునే అవకాశం ఉంటుంది. నా కెరీర్‌లో ఒక కొన్ని పరిస్థితుల వరకు మాత్రమే నేను ప్రయోగాలు చేయగలను. కాబట్టి నేను ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ తర్వాత మనం ఫలానా పాత్ర చేయలేదే అని బాధపడకూడదు. ఓరిదేవుడా సక్సెస్‌పై చాలా సంతోషంగా ఉన్నాను. ఇదే స్పీడుని మరింతగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇప్పుడు ఆహాలో మన తెలుగు ప్రేక్షకులను మెప్పించనుంది. దీంతో సినిమా మరింత విస్తృతంగా ప్రేక్షకులను రీచ్ అవుతుందని భావిస్తున్నాను.’’

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago