యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ దేవుడు క్యారెక్టర్‌లో నటిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని మేకర్స్ స్టన్నింగ్ గ్లింప్స్‌తో అధికారికంగా ధృవీకరించారు.
ఈ ప్రకటన అందరిలోనూ ఆసక్తిని మరింతగా పెంచింది. గ్లింప్స్‌ను గమనిస్తే.. వెంకటేష్ కూల్, స్టైలిష్ లుక్ కనపడే దేవుడు క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని అర్థమవుతుంది. చుట్టూ పుస్తకాలు.. సీతాకోక చిలుకలు మధ్య విశ్వక్ సేన్ కనిపించారు. విక్టరీ వెంకటేష్ అంటే ఓ మేనరిజమ్ ఉంటుంది. ఆ మేనరిజమ్‌తో ఆయన ఫ్యాన్స్, ప్రేక్షకులకు గ్లింప్స్ చివరలో సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఓరి దేవుడా’ దేవుడా చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయటం డబుల్ సర్‌ప్రైజ్. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. పివిపి సినిమా బ్యానర్స్‌పై ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఓరి దేవుడా’ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. విజయ్ ఈ చిత్రాన్ని ఎడిటర్‌గా, విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…