Categories: న్యూస్

25 మిలియన్ వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ఉపేంద్ర ‘కబ్జా’ టీజర్

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా శ్రియా శరన్ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ‘కబ్జా’ . ఇందులో మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఇద్ద‌రు స్టార్ హీరోల కాంబోతో రాబోతున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘కబ్జా’ తో సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. మూవీ అనౌన్స్ చేసిన రోజు నుంచి సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగిపోతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టు భారీ స్టార్ క్యాస్ట్ కూడా సినిమాలో న‌టిస్తుండ‌టంతో ఈ అంచ‌నాలు నెక్స్ రేంజ్‌కు చేరుకుంటూ వ‌చ్చాయి.

పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘కబ్జా’ ప‌లు భాష‌ల్లో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌టన వెలువ‌డ‌నుంది. అంత కంటే ముందే మేక‌ర్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత పెంచేలా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వైర్సటైల్ యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఈ టీజ‌ర్‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు టీజర్ 25 మిలియన్ వ్యూస్‌ను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

టీజ‌ర్‌లో ఉపేంద్ర ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించారు. ఆయ‌న్ని అలాంటి పాత్ర‌లో చూసిన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీలో సన్నివేశాలను తెరకెక్కించిన కలర్, బ్యాగ్రౌండ్ స్కోర్, సీన్ టేకింగ్ డిఫరెంట్‌గా ఉంది. 1942 బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా ఇది. పవర్‌పుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. టీజ‌ర్ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉందని ఫ్యాన్స్, ప్రేక్షకులు అంటున్నారు. ఉపేంద్ర యాక్ష‌న్ సీక్వెన్సెస్‌, ర‌వి బ‌స్రూర్ అందించిన గ్రిప్పింగ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఇటు ఉపేంద్ర‌.. అటు సుదీప్ అభిమానులు వారి ఆరాధ్య హీరోలను ఎప్పుడెప్పుడు వెండితెర‌పై చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.

క‌న్న‌డ చిత్ర సీమ‌లోని మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు శివ‌రాజ్ కుమార్ కూడా స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌టం కొస మెరుపు. ఈ ముగ్గురి స్టార్స్‌కి చెందిన ఫ్యాన్స్‌కి ఇది ఐ ఫీస్ట్‌గా ఉండ‌బోతుంది. ఈ పీరియాడిక్ డ్రామాలో శ్రియా శ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌వి బ‌స్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎ.జె.శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

9 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

9 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

10 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago