కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా శ్రియా శరన్ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ‘కబ్జా’ . ఇందులో మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఇద్దరు స్టార్ హీరోల కాంబోతో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కబ్జా’ తో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మూవీ అనౌన్స్ చేసిన రోజు నుంచి సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టు భారీ స్టార్ క్యాస్ట్ కూడా సినిమాలో నటిస్తుండటంతో ఈ అంచనాలు నెక్స్ రేంజ్‌కు చేరుకుంటూ వచ్చాయి.
పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘కబ్జా’ పలు భాషల్లో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అంత కంటే ముందే మేకర్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేలా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి ఈ టీజర్‌ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు టీజర్ 25 మిలియన్ వ్యూస్‌ను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
టీజర్‌లో ఉపేంద్ర పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. ఆయన్ని అలాంటి పాత్రలో చూసిన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీలో సన్నివేశాలను తెరకెక్కించిన కలర్, బ్యాగ్రౌండ్ స్కోర్, సీన్ టేకింగ్ డిఫరెంట్‌గా ఉంది. 1942 బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా ఇది. పవర్‌పుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. టీజర్ నెక్ట్స్ లెవల్‌లో ఉందని ఫ్యాన్స్, ప్రేక్షకులు అంటున్నారు. ఉపేంద్ర యాక్షన్ సీక్వెన్సెస్, రవి బస్రూర్ అందించిన గ్రిప్పింగ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఇటు ఉపేంద్ర.. అటు సుదీప్ అభిమానులు వారి ఆరాధ్య హీరోలను ఎప్పుడెప్పుడు వెండితెరపై చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.
కన్నడ చిత్ర సీమలోని మరో అగ్ర కథానాయకుడు శివరాజ్ కుమార్ కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వటం కొస మెరుపు. ఈ ముగ్గురి స్టార్స్‌కి చెందిన ఫ్యాన్స్‌కి ఇది ఐ ఫీస్ట్‌గా ఉండబోతుంది. ఈ పీరియాడిక్ డ్రామాలో శ్రియా శరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎ.జె.శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…