Categories: న్యూస్

NC 22 షూటింగ్ రేపటి నుండి ప్రారంభం

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి NC22 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. NC22 నాగచైతన్య తొలి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్‌ ప్రభుకి కూడా ఇది తొలి తెలుగు సినిమా.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇటీవల పూజా కార్యక్రమంతో ప్రారంభమైయింది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరూ కలసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌లో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఖాయమని చెప్పాలి.  

నాగ చైతన్య అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో NC22 చిత్రీకరణ ప్రారంభం కానుంది.

“అక్కినేని నాగేశ్వరరావు గారి దివ్య ఆశీస్సులతో.. నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి అద్భుతమైన అప్‌డేట్‌ను ప్రకటిస్తున్నాం. రేపటి నుండి #NC22 యాక్షన్ బిగిన్స్” అని ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా నాగ చైతన్య సంబధించిన ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇది అందరినీ సర్ ప్రైజ్ చేయడంతో పాటు ఆసక్తిని పెంచింది.

నాగ చైతన్య అప్పిరియన్స్, లుక్ రివీల్ చేయకుండా పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్‌లో నాగ చైతన్యపై కొన్ని టార్గెట్‌ లు వుండటం గమనించవచ్చు. పోస్టర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో పవర్ ఫుల్ వైబ్స్ ని కలిగివుంది.  

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రానికి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు.  ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కనిపించనుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు చిత్రానికి పని చేస్తున్నారు.

స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. రేపటి నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.  

తారాగణం: నాగ చైతన్య, కృతి శెట్టి తదితరులు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
డైలాగ్స్: అబ్బూరి రవి

Tfja Team

Recent Posts

ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం.. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.. ‘సన్ ఆఫ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత, హీరో సాయి సింహాద్రి

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని…

3 hours ago

‘హేబల్‌వంత్‌’ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది: థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌లో వెల్లడించిన చిత్ర నిర్మాత

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

5 hours ago

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

1 day ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

3 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

3 days ago