అనిల్ మోదుగ ఫిలిమ్స్ బ్యానర్ పై దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం గారి తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ నిర్మిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్ ‘ బ్రేక్ అవుట్’. బాల కృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల సహా నిర్మాతలు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. వైవిధ్యమైన కథాంశం రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు.
రెండు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ లో ఈ చిత్ర కథాంశాన్ని చాలా ఇంటరెస్టింగా రివిల్ చేశాడు దర్శకుడు. హీరో అనుకోని పరిస్థితిలో వంటరిగా ఒక గ్యారేజ్ లో చిక్కుకుపోతాడు. అతనికి మోనో ఫోబియా అనే మానసిక రుగ్మత వుంటుంది. ఈ ఫోబియా వున్న వారికి వంటరిగా గడపడం అంటే తీవ్ర ఆందోళనకరంగా వుంటుంది. గ్యారేజ్ లో వంటరిగా చిక్కుకున్న హీరో అక్కడి నుండి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? మోనో ఫోబియాతో హీరో ఎలాంటి సవాళ్ళని ఎదురుకున్నాడనేది ట్రైలర్ లో బ్రిలియంట్ గా ప్రజంట్ చేశారు .
ట్రైలర్ లో రాజా గౌతమ్ ఫెర్ఫామెన్స్ టెర్రిఫిక్ గా వుంది. అతని లుక్, మేకోవర్ ఆకట్టుకున్నాయి. సాంకేతికంగా ట్రైలర్ ఉన్నతంగా వుంది. జోన్స్ రూపర్ట్ అందించిన నేపధ్య సంగీతం ట్రైలర్ మరో ఆకర్షణగా నిలిచింది. మోహన్ చారీ కెమరాపనితనం ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది.
చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రలు పోహిస్తున్నారు.
నటీనటులు ; రాజా గౌతమ్, చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి
టెక్నికల్ టీమ్ :
రచన, దర్శకత్వం : సుబ్బు చెరుకూరి
బ్యానర్ : అనిల్ మోదుగ ఫిలిమ్స్
నిర్మాత : అనిల్ మోదుగ
సహా నిర్మాతలు : బాల కృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల
సినిమాటోగ్రఫీ : మోహన్ చారీ
సంగీతం : జోన్స్ రూపర్ట్
పీఆర్వో : తేజస్వీ సజ్జ
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…