గణేష్,వర్ష బొల్లమ్మ’ ల “స్వాతిముత్యం”నుంచి విడుదల అయిన పెళ్లి గీతం

*దసరా శుభాకాంక్షలతో అక్టోబర్ 5 న విడుదల 

‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం

‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

ఈ చిత్రానికి సంబంధించి పెళ్లి నేపధ్యంలోని గీతం ఈరోజు విడుదల అయింది. 

కథానాయకుడు గణేష్, నాయిక వర్ష బొల్లమ్మతో పాటు రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ప్రగతి, సురేఖా వాణి తదితరులు ఈ వీడియో చిత్రం లో కనిపిస్తారు.

ఈ గీతానికి సాహిత్యాన్ని కె కె అందించగా, మహతి స్వర సాగర్ సంగీతంలో హుషారుగా సాగుతుంది ఈ గీతం. ఈశ్వర్  పెంటి మాస్టర్ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది.

“డుం డుం డుం డుం డుం

మోగింది మేళం” ….అంటూ మొదలయ్యే ఈ పాట సందర్భాన్ని దర్శకుడు లక్ష్మణ్ వివరించగానే, మహతి స్వరసాగర్ గారు చాలా అద్భుతమైన మెలోడీ బాణీని స్వర పరిచారు . 

ఇది కథానాయకుడు,నాయికలకి నిశ్చితార్థం జరిగే సందర్భంలో సాగే పాట , నిశ్చితార్థం జరిగిన జంటలు ఈ మధ్య కలిసి షాపింగ్ లనీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్ అనీ చాలా టైం కలిసే గడుపుతున్నారు, ఇక ఫోన్లలో ముచ్చట్లకైతే అంతే ఉండదు, ఇక ఈ మధ్య ప్రీవెడ్ ఫోటో షూట్లు ఒకటి, రకరకాల లొకేషన్లలో సినిమా సెట్టింగులతో హడావిడి చేస్తున్నారు. ఇవన్నీ పల్లవి చరణాల్లో సరదాగా వివరించటానికి ప్రయత్నం చేసాను. దర్శకుడితో పాటు నిర్మాతలకి అందరికీ నచ్చటం తో ఈ పాటని రికార్డ్ చేసారు సాగర్ గారు. చిన్న పిల్లలతో ఈ పాట పల్లవిని పాడించడం తో ఈ పాటకి  మరింత అందం చేకూరింది. ఈ పాట ఇక ముందు అన్ని పెళ్లిళ్లలో , సంగీత్ లలో మారు మోగడం ఖాయం. ఈ అవకాశం ఇచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ వారికి , మహతి స్వర సాగర్ గారికి కృతజ్ఞతలు అంటూ పాట విశేషాలను వివరించారు గీత రచయిత కె కె

 దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ..‘

చిత్ర కథాంశం ప్రకారం నాయక, నాయికల  పెళ్లి గీతం ఇది. వీరి నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకూ జరిగే వివిధ వ్యవహారాలు,సందర్భాలు, సన్నివేశాల సమాహారం ఈ పాట. పట్టణం నేపథ్యంలో చిత్రీకరించిన దీనిని రచయిత కె కె ఎంతో చక్కగా రచించారు. ప్రేక్షకుడు కూడా సహజంగా అనుభూతి చెందేలా  చిత్రీకరించడం జరిగింది అన్నారు. 

దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు “స్వాతిముత్యం” ను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. 

సాంకేతిక వర్గం:

సంగీతం: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: సూర్య

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్: అవినాష్ కొల్ల

పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కె.కృష్ణ

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago