ఇంటర్వ్యూలు

‘పొట్టేల్’ మ్యూజికల్ న్యూ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది శేఖర్ చంద్ర

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్  పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ‘పొట్టేల్’ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. 

‘పొట్టేల్’ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ? 

– డైరెక్టర్ సాహిత్ తో ఇంతకుముందు సవారి అనే సినిమా చేశాను. అందులో పాటలు మంచి హిట్ అయ్యాయి. సినిమా కూడా బాగానే రీచ్ అయింది. సాహిత్ చాలా కొత్త థాట్స్ తో వస్తాడు. పొట్టేల్ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. కళ్లెంబట నీళ్లు వచ్చాయి. పిల్లల చదువు కోసం పేరెంట్స్  ఎంత స్ట్రగుల్ అయినా పడాలి అనే మంచి  పర్పస్ ఈ సినిమాలో ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఈ కథ ప్రేక్షకులు మనసుల్ని హత్తుకునేలా ఉంటుంది.

ఇందులో మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఎంతలా ఉంటుంది? 

-రూరల్ బ్యాక్ డ్రాప్ లో అంబాజీపేట లాంటి సినిమాలు చేశాను. కానీ ‘పొట్టేల్’ డిఫరెంట్. ఏదో సినిమాకి రీ రికార్డింగ్ చేసినట్లు ఉండదు. సిచువేషన్ నుంచి మ్యూజిక్ క్రియేట్ అవుతున్నట్లుగా ఉంటుంది, ఈ సినిమాని చాలా నేచురల్ గా తీశారు. ఆ నేచురల్ ప్రాసెస్ ని పట్టుకుని మ్యూజిక్ చేయడానికి నాకు కూడా కొంత సమయం పట్టింది. డీఫాల్ట్ టెంప్లెట్ ఉండే మ్యూజిక్ ని ఇందులో చేయలేదు. నిజానికి ఎలాంటి సౌండింగ్ చేయాలా అనేది కొంచెం వెతుక్కోవాల్సి వచ్చింది.  ఒకసారి సెట్ అయిన తర్వాత ఆర్ఆర్, సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి. 

– ఇప్పటికే సాంగ్స్ కి చాలా సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని పాటలు మూవీ తో పాటు ఇంకా రీచ్ అవుతాయి. ఇందులో లిరిక్స్ సింగిల్ కార్డ్ కాసర్ల శ్యామ్ గారు రాశారు. ప్రతి లిరిక్ కథకు చాలా ఇంపార్టెంట్. మంచి లవ్ సాంగ్ కూడా ఉంది.  డైరెక్టర్ చాలా జెన్యూన్ గా ఈ సినిమాను తీశారు. ఇందులో ఒక విలేజ్ సాంగ్ ఉంది. దాన్ని రూరల్ గా కాకుండా కొంచెం వెస్ట్రన్ స్టైల్ లో చేయడం జరిగింది. అలాంటి ప్రయోగం చేసే అవకాశం కూడా డైరెక్టర్ గారు ఇచ్చారు. చాలా సపోర్ట్ చేశారు. 

మీ సినిమాల్లో ఎక్కువ లిరికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా?  

-నా సాంగ్స్ లో లిరిక్స్ బాగా వినపడతాయని దాదాపు లిరిక్ రైటర్స్ అందరూ నాతో ఈ మాట చెప్పారు. ట్యూన్స్ లో కూడా లిరిక్స్ చాలా చక్కగా కూర్చుంటాయి. నేనొక డమ్మి లిరిక్ అనుకునే ట్యూన్ చేసుకుంటాను. నేను ఎలాంటి హుక్ లైన్స్ అనుకుంటున్నానో రైటర్స్ కి ఈజీగా తెలుస్తుంది. దీంతో రైటర్ కి కూడా వర్క్ ఈజీ అవుతుంది. నా సాంగ్స్ లో ఎక్కువగా లిరికల్ స్కోప్ ఉంటుంది. లిరిక్ రైటర్స్ కూడా అంత అద్భుతంగా రాయడం, సింగర్స్ అద్భుతంగా పాడడం వలన పాటలు ఇంత చక్కగా రీచ్ అవుతున్నాయని భావిస్తాను.  

ఈ సినిమా వరకు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమిటి?  

-ఇందులో నాలుగు సాంగ్స్ ఉన్నాయి. ఈ నాలుగు పాటలు ఛాలెంజే. పల్లవిలో ఒక స్టోరీ ఉంటుంది. చరణంలో మరో ఎమోషన్ చెప్పాలి. బీజీయంలో కూడా ఆయన ఒక పర్టికులర్ ఎమోషన్ ని డీల్ చేస్తుంటారు. అవన్నీ మైండ్లో పెట్టుకుని కంపోజ్ చేయడం జరిగింది. ఇందులో ఒక చదువు పాట ఉంది.  దాన్ని కూడా చాలా ప్లే ఫుల్ గా చేయడం జరిగింది. ఆ పాటకి చాలా కంటెంట్ ఉండే లిరిక్స్ రాశారు శ్యామ్ గారు. ఆ పాట కూడా మూవీ రిలీజ్ తర్వాత చాలా అద్భుతంగా రీచ్ అవుతుంది. 

ఆర్టిస్టుల పర్ఫామెన్స్ గురించి? 

-యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్ .. వీళ్లంతా సినిమాకి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేశారు. ఎవరు కూడా ఇందులో మేకప్ వేసుకోలేదు. నేచురల్ లైటింగ్ లో చేయడం జరిగింది. అజయ్ గారు ఈ సినిమాలో ఇరగదీశారు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్. ఆయన గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.  

– ‘పొట్టేల్’ సినిమా మొత్తం రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. చాలా ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. విలన్, హీరో ఎపిసోడ్స్ లో హై మ్యూజిక్ ఉంటుంది. అజయ్ గారి క్యారెక్టర్ కి మ్యూజికల్ గా చాలా మంచి ఎలివేషన్ ఉంటుంది. ఆ సిచువేషన్ కూడా చాలా డామినేటింగ్ గా ఉంటుంది. సినిమాకి చాలా రెస్పాన్స్ వస్తుందని నమ్మకం ఉంది

నిర్మాతల గురించి ?

ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేశారు. మేము అనుకున్న సింగర్స్ తో పాడించాం. అనురాగ్ కులకర్ణి, పెంచల్ దాస్ గారు ఇలా మంచి మంచి వాయిస్ లు ఉన్నాయి. నిర్మాతలు సినిమాని బలంగా నమ్మారు. సినిమాని చాలా ప్రేమించి చేశారు. మ్యూజిక్ సైడ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. 

రీసెంట్ టైమ్స్ లో మీ ఆల్బమ్స్ మిలియన్స్ వ్యూస్ కి రీచ్ అయ్యాయి ఎలా అనిపిస్తుంది? 

-చాలా హ్యాపీగా ఉంది, రీసెంట్ టైమ్స్ లో ఊరు పేరు భైరవకోన లోని నిజమైన చెబుతున్నా, అంతకుముందు బావుంటుంది నువ్వు నవ్వితే, ఇవన్నీ కూడా ఆడియన్స్ విని వాటిని ఓన్ చేసుకొని హిట్ చేశారు. అది నాకు డ్రైవింగ్ ఎనర్జీ. 

మీరు చార్ట్  బస్టర్ ఆల్బమ్స్ ఇస్తున్నారు కదా ఇంకా బిగ్ లీగ్ మూవీస్ రాలేదని ఫీలింగ్ ఉందా? 

-ఖచ్చితంగా ఉంటుంది. సాంగ్స్ హిట్ అయితే ఆనందంగా ఉంటుంది. అయితే ఇంకా హిట్స్ కొట్టాలి, బిగ్ లీగ్ మూవీస్ రావాలి అనే ఫీలింగ్ ఉంటుంది. కొన్ని సినిమాలు థియేటర్లో చూసినప్పుడు ఇలాంటి సినిమా మనం చేస్తే బాగుండేది అనిపిస్తుంది.

మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా అప్డేట్ అవుతుంటారు? 

-నా వరకైతే చాలా బాగా వింటాను. ఎలాంటి పాటలు వస్తున్నాయి, ఏ ట్రెండ్ నడుస్తుందో గమనిస్తుంటాను. అలాగే వరల్డ్ మూవీస్ కూడా చూస్తుంటాను. 

మీ నాన్నగారు సినిమాటోగ్రాఫర్ కదా మరి మీరు మ్యూజిక్ వైపు ఎలా వచ్చారు? 

-అది నిజంగా నాకు తెలియదండి. అది గాడ్ గ్రేస్ అనుకుంటాను. మా ఫాదర్ కూడా షాక్ అయ్యారు. అది మనకు తెలియని  ఫీల్డ్ కదా అన్నారు. కానీ ఎదో ఎనర్జీ మ్యూజిక్ వైపు నన్ను డ్రైవ్ చేసింది.  

– నేను మ్యూజిక్ నేర్చుకున్నాను. పియానో లో గ్రేడ్స్  చేశాను.  తర్వాత కర్ణాటక క్లాసిక్ వోకల్ క్లాసెస్ కి వెళ్లాను. వైలెన్ నేర్చుకున్నాను. అన్ని రకాలుగా సిద్ధమైన తర్వాతే కంపోసింగ్ జర్నీ మొదలైయింది.  

అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి? 

-రాజ్ తరుణ్ తో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే నవీన్ చంద్ర గారితో ఒక సినిమా చేస్తున్నాను. వరలక్ష్మీ శరత్ కుమార్ గారి కుర్మనాయికి మూవీకి చేస్తున్నాను. తెలుగు-కన్నడ మూవీ ఒకటి జరుగుతోంది. 

ఆల్ ది బెస్ట్ 

-థాంక్యూ

Tfja Team

Recent Posts

#NaniOdela2కి మ్యూజిక్ డైరెక్టర్ గా సెన్సేషనల్ కంపోజర్ అనిరుధ్

నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ 'దసరా' తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల,…

1 hour ago

Anirudh Comes On Board For #NaniOdela2

Natural Star Nani is set to team up once again with director Srikanth Odela and…

1 hour ago

Die-Hard Fan Travels 1600km to Meet Icon Star Allu Arjun

Icon Star Allu Arjun enjoys the support of a massive fan base. He always values…

4 hours ago

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం

సినీ తారలకు అభిమానులు వుండటం అనేది సర్వసాధారణం. అయితే కొంత మంది అభిమానించడంతో పాటు తమకు మనసుకు నచ్చిన తారలను…

4 hours ago

విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ అక్టోబర్ 20న ట్రైలర్ లాంచ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ 'మెకానిక్ రాకీ'తో అలరించడానికి రెడీగా…

4 hours ago

NBK,Boyapati Sreenu, Akhanda 2 Thaandavam Launched

God Of Masses Nandamuri Balakrishna and Blockbuster maker Boyapati Sreenu’s fourth collaboration #BB4 is titled…

5 hours ago