ఇంటర్వ్యూలు

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలో దుర్గ పాత్రలో నటించడం ఎంతో సంతృప్తిని కలిగించింది – యంగ్, టాలెంటెడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఇటీవల గ్రాండ్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించిన “ది గర్ల్ ఫ్రెండ్” సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ మూవీలో దుర్గ క్యారెక్టర్ లో నటించిన ఎక్సిపిరీయన్స్ తెలిపారు యంగ్, టాలెంటెడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.

  • “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కోసం ఫస్ట్ ప్రొడ్యూసర్ ధీరజ్ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత రాహుల్ కలిసి స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్, నా క్యారెక్టర్ గురించి విన్న తర్వాత తప్పకుండా ఈ మూవీలో నటించాలని అనిపించింది. అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే మూవీ ఇది. ఈ చిత్రంలో నటించడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఇది గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ హ్యాపీగా ఉంది. అయితే నేను ఏ సినిమా చేసినా ఆ మూవీకి ఎలాంటి ప్రశంసలు వస్తాయని ఆశించను.
  • నేను తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించాను. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగ చైతన్య, శివకార్తికేయన్, కార్తి, విశాల్..ఇలా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అయితే నా కెరీర్ లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. కొన్ని కమర్షియల్ మూవీస్ లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి లభించదు. నాలుగు డ్యాన్స్ స్టెప్స్ వేసి, ఏవో డైలాగ్స్ చెప్పిస్తారు. ఈ రొటీన్ మూవీస్ చేసేప్పుడు నేను రియలైజ్ కాలేదు గానీ ఇకపై అలాంటి మూవీస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా. “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి మూవీస్ ను మన సంతృప్తి కోసం, ఏదైనా కొత్తగా నేర్చుకునేందుకు చేశాను.
  • ఈ చిత్రంలో దుర్గ క్యారెక్టర్ లో నటించాను. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయంవేసింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ రాహుల్ నా క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానంతో హ్యాపీగా ఫీలయ్యా. రాహుల్ చాలా సెన్సిటివ్ డైరెక్టర్. నా క్యారెక్టర్ ఒక్కటే కాదు, అన్ని పాత్రలను చేయి పట్టి నడిపించారు. కమర్షియల్ మూవీస్ లో మాతో ఓవర్ యాక్షన్ చేయిస్తారు. దుర్గ పాత్రలో నటించేప్పుడు ఫస్ట్ నేను అలాగే ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ నటించా. రాహుల్ వచ్చి, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ టోన్ డౌన్ చేసి యాక్ట్ చేయమని అన్నారు. అలా ఆంథెటిక్ గా, సహజంగా దుర్గ క్యారెక్టర్ లో నటించగలిగాను. నా క్యారెక్టర్ నాతోనే డబ్బింగ్ చెప్పించారు. అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడమన్నారు. దాంతో దుర్గ పాత్ర మరింత నేచురల్ గా స్క్రీన్ మీద కనిపించింది. థియేటర్ లో మూవీ చూశాను. కొన్ని సీన్స్ కైతే అబ్బాయిలు క్లాప్స్ కొడుతున్నారు.
  • ఈ చిత్రంలో నాకు అవకాశం వచ్చేసరికే రశ్మికను భూమా పాత్రకు తీసుకున్నారు. నేను భూమా పాత్రలో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. హాలీవుడ్ లో మూవీస్ చూస్తే హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు. ప్రతి ఒక్కరూ కథకు కాంట్రిబ్యూట్ చేసేలా క్యారెక్టర్స్ చేస్తారు. ఈ చిత్రంలో రాహుల్ అలాంటి ప్రయత్నమే చేశారు. అన్ని పాత్రలను జస్టిఫై చేసేలా మూవీ రూపొందించారు. దుర్గలా ఉండాలంటే ముందు అంతా భూమాలాగే ఉంటారు. దుర్గలా ఉండే ధైర్యం మొదట్లోనే ఎవరికీ ఉండదు. పేరెంట్స్, ఫ్రెండ్స్, సొసైటీ ఎవరైనా మనల్ని అర్థం చేసుకోకుంటే సఫోకేషన్ ఫీల్ కలుగుతుంది. ఈ అనుభవం అబ్బాయిలకైనా ఎదురవుతుంది.
  • నా కెరీర్ పరంగా అసంతృప్తిగానే ఉన్నా, అయితే నటిగా సంతృప్తి ఉంది. పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి నటించాను. అయితే నాది అవకాశాల కోసం ఆరాటపడే తత్వం కాదు. నాకు వచ్చే సినిమా తప్పకుండా దక్కుతుందని నమ్ముతా. యూఎస్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు నా నేటివ్ ప్లేస్ కేరళకు వెళ్లలేదు. డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చా. అప్పటి నుంచి హైదరాబాద్ వీడలేదు. మలయాళంలో పృథ్వీరాజ్ ఆడుజీవితం సినిమాకు ఆడిషన్ చేశా, కానీ ఆ మూవీ చేయలేకపోయా. మంచి అవకాశం వస్తే మలయాళంలో మూవీ చేస్తా. దీక్షిత్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. తను డెడికేషన్ ఉన్న యాక్టర్. మేము కాంబినేషన్ సీన్స్ కోసం ప్రిపేర్ అయి చేశాం.
  • ప్రొడ్యూసర్ ధీరజ్ తో గతంలో ఊర్వశివో రాక్షసివో సినిమా చేశాను. “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి చిత్రాలు వర్కవుట్ కావాలంటే ధీరజ్ లాంటి మంచి ప్రొడ్యూసర్ ఉండాలి. మంచి టీమ్ కుదరకే గతంలో కొన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఆదరణ పొందలేకపోయాయి. మా మూవీలో చూపించినట్లు మహిళకు ఎన్నో కండీషన్స్ ఈ సొసైటీ పెడుతుంటుంది. ఎలా మాట్లాడాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, పిల్లలు ఎప్పుడు కనాలి..ఇలాంటి షరతులెన్నో వుమెన్ పై ఉంటాయి. మగవారికి ఉద్యోగం, సంపాదన తప్ప మిగతా ఇలాంటి కండీషన్స్ ఏవీ ఉండవు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను.
Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

42 minutes ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago