బేబీ సినిమా నా మనసుకు నచ్చింది.. నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారని తెలుసు.. దర్శకుడు సాయి రాజేష్

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించారు. ఈ మూవీ జూలై 14న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోండటంపై మీడియాతో దర్శకుడు సాయి రాజేష్ ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలేంటంటే..

సేలం జిల్లాలో ఓ అమ్మాయి, ఇద్దరబ్బాయిలతో ఉన్న ఫోటోలు వాట్సప్‌లో చక్కర్లు కొట్టాయి. ఆ ఇద్దరబ్బాయిలు కలిసి అమ్మాయి మీద క్రూరంగా దాడి చేసిన ఫోటోలు కనిపించాయి. అసలు ఆ అమ్మాయికి ఏం జరిగి ఉంటుందని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు బేబీ కథ పుట్టింది. కానీ క్లైమాక్స్ అలా ఉంచకూడదని, సమాజం మీద దుష్ప్రభావం చూపిస్తుందని అనుకున్నాను.

ఆనంద్ దేవరకొండ ఫాదర్ నాకు ఫేస్ బుక్ ఫ్రెండ్. ఆనంద్ టెన్త్ క్లాస్ ఫోటోను అందులో చూశాను. అలా ఆనంద్‌ను ఫిక్స్ అయ్యాను. అప్పటికి ఇంకా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రాలేదు. తెలుగమ్మాయే కావాలని హీరోయిన్ విషయంలో ఫిక్స్ అయి ఉన్నాను. ఎక్స్‌ప్రెషన్స్‌తో వెళ్లే సినిమా ఇది. ఇంటర్వెల్ బ్లాక్ విని తెలుగమ్మాయిలు పాత్రని చేయనని చెప్పి వెళ్లిపోతూ వచ్చారు. ఇక వైష్ణవిని ఓ మేనేజర్ ద్వారా కలిశాను. వైష్ణవి, వాళ్ల పేరెంట్స్‌ని ఒప్పించాను.

ఆనంద్ కంటే ముందుగా ఓ ముగ్గురు హీరోలను అనుకున్నాం. ఓ హీరో దగ్గరకు వెళ్లి వద్దని అనుకున్నాను. హృదయ కాలేయం తీసిన డైరెక్టరా? అయితే కథ కూడా వినను అని మరో హీరో అన్నాడు. ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. అప్పుడే ఈ బేబీ సినిమాను మరింత బాగా తీయాలని అనుకున్నాను. ఆ క్షణమే బేబీ రైటింగ్ మొత్తం మారిపోయింది. సౌండింగ్, రైటింగ్, విజువల్స్ ఇలా అన్నీ అద్భుతంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను. మామూలుగా అయితే హృదయ కాలేయం సినిమాను తీయడం, రాయడం చాలా కష్టం. ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధపడ్డాను. నిద్రకూడా పట్టలేదు. ఈ సినిమాతో నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నాను.

కలర్ ఫోటో సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. కలర్ ఫోటోకు స్టోరీ ఇచ్చింది నేనే. సినిమాను నిర్మించింది నేనే. కానీ దర్శకుడికి, హీరోకు పేరు ఎక్కువగా వచ్చింది. కానీ నేను ఇలాంటి ప్రేమ కథను తీయగలనా? లేదా? అని జనాల్లో ఆ అనుమానం ఉండేది.

బేబీ సినిమాకు స్క్రిప్ట్ లేదు. రేపు సీన్ అంటే.. ఈరోజు రాసుకునే వాడ్ని. రాత్రి డ్రాఫ్ట్ రాసి టీంకు పంపించేవాడ్ని. ఉదయం వరకు ప్రాపర్టీస్ వచ్చేవి. లొకేషన్లన్నీ దగ్గరదగ్గరగా ఉండటంతో.. తాపీగా సీన్లు తీశాను. దాని వల్ల ఎడిట్ రూంలో ఇబ్బందులు వచ్చాయి.

బేబీ సినిమా నా మనసుకు నచ్చింది. నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారని నమ్మకం ఉంది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందనే భయం కూడా ఉండేది. నిడివి వల్ల విరాజ్, నాగబాబు పాత్రలు మధ్యలోనే లేపేశాను. ఫ్లాప్ అయినా కూడా సంగీతం, కెమెరా, నటీనటులు ఇలా అందరికీ పేరు వస్తుంది. నా కెరీర్ నాశనం అవుతుందని తెలుసు. అయినా కూడా రిస్క్ చేశాను.

బెడ్రూంలో సీన్లో అమ్మాయి బాధపడుతుందనేందుకే సింబాలిక్‌గా కంట్లోంచి నీరు వచ్చే షాట్ పెట్టాను. కానీ జనాలకు మాత్రం వేరేలా అర్థమైంది. ఆమె దాన్ని ఆస్వాధించడం లేదు.. గుండెలో బాధతో ఏడుస్తుందని చెప్పడమే నా ఉద్దేశం.

సుకుమార్ గారు నిన్న సినిమాను చూశారు. కాసేపటి క్రితమే ఫోన్ చేశారు. ఫోన్ లోనే ముద్దులు పెట్టేస్తున్నారు. అయితే ఇలా సినిమాలు తీస్తే చూస్తారా? లేదా? అని అనుకునేవాడ్ని.. ఇకపై నా రైటింగ్ స్టైల్ కూడా మారుతుంది అంటూ సుకుమార్ చెబుతుంటే.. ఆయనలాంటి జీనియస్ డైరెక్టర్ ప్రశంసిస్తుంటే.. నాకు మాటలు రాలేదు.

బేబీ విషయంలో కొన్ని తప్పులు చేశాను నాకు అర్థం అవుతోంది. అందుకే నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి.

నేను సంగీతం, ఆర్ఆర్ విషయంలో పర్టిక్యులర్‌గా ఉంటాను. నేను ఆర్ఆర్ కోసం కొన్ని సినిమాలను పది, ఇరవై సార్లు చూశాను. బేబీ విషయంలో నేను ముందుగానే ఆర్ఆర్ చేయించుకోవడంతో సెట్‌లోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు అవుట్ పుట్ ఎలా ఉండేదో నాకు తెలిసేది.

హృదయ కాలేయం బౌండ్ స్క్రిప్ట్‌తో వెళ్లాను. ఇది ఎమోషన్స్‌తో నడిచే సినిమా. పైగా ఇది నాకు జీరో రిస్క్ సినిమా. అప్పటికప్పుడు సీన్ రాసి.. ప్రాపర్టీస్ తీసుకురమ్మంటే తప్పు. చాలా కోట్లు పెట్టి తీసే దర్శకులు ఇలా చేయకూడదు. పూర్తి బౌండ్ స్క్రిప్ట్‌తోనే వెళ్లాలి.

విజయ్ బుల్గానిన్ ఇది వరకు తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. విజయ్ టాలెంట్ గురించి అందరికీ చెప్పి అవకాశాలివ్వమని అడిగేవాడిని. కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. బేబీ సినిమాకు ముందుగా రాజ్ కోటిలను తీసుకుందామని అనుకున్నాను. కానీ విజయ్ బుల్గానిన్ ఎలాంటి ఇగోలకు వెళ్లడు. నేనేం చెప్పినా కాదనడు. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ రానుందని నాకు మొదట్లోనే అర్థమైంది.

నేను మంచి ఉద్దేశంతోనే సినిమాను తీశాను. కానీ జనాలు ఎక్కడైతే రియాక్ట్ కాకూడదో అక్కడ రియాక్ట్ అవుతున్నారు. నా సినిమా అప్పలరాజులా మారిపోయింది. తొలిప్రేమకు మరణం లేదు మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అని చెప్పాలని అనుకున్నా.. అందుకే చివరి షాట్ అలా పెట్టాను. హీరో హీరోయిన్లు తొలి ప్రేమను తలుచుకుని బాధపడే షాట్లు పెట్టాను.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

24 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago