ఇంటర్వ్యూలు

హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఇంటర్వ్యూ

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’.  పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు.  భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.  

తెలుగులో ఎక్కువ విరామం తీసుకున్నట్లుగా వున్నారు ?
ఎఫ్3 లో క్యామియో రోల్ చేశాను. ఇక విరామం అంటే.. కోవిడ్ కారణంగా మొత్తం ఇండస్ట్రీనే విరామం తీసుకుంది కదా. హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అయితే తెలుగు నా ఫస్ట్ లవ్.

‘ది ఘోస్ట్’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
యాక్షన్ సినిమాలు చేయాలని వుండేది. ప్రవీణ్ సత్తారు క్రియేటివ్ డైరెక్టర్. ఈ కథ చెప్పినపుడు చాల థ్రిల్ అనిపించింది. నాగార్జున గారు ఈ ప్రాజెక్ట్ వున్నారని తెలిసి చాలా ఎక్సయిట్ అయ్యా. ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తా.

ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించడానికి ఎలాంటి కసరత్తు చేశారు ?
ఇందులో శారీరకంగా, మానసికంగా చాలా సవాల్ తో కూడుకున్న పాత్ర చేశాను. ఇలాంటి పాత్ర చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. యాక్షన్ తో పాటు ఎంఎంఎ శిక్షణ పొందాను. అయితే శిక్షణలో రెండో రోజే నా కాలివేలు ఫ్రాక్చర్ అయ్యింది. చిన్న గాయమే అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్ రే తీయమని చెప్పారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ శిక్షణలోకి వచ్చాను. అలాగే ఆయుధాల శిక్షణ కూడా తీసుకున్నాను.

గన్ పట్టుకోవడం ఇదే తొలిసారా ?
లేదు. మా నాన్న పోలీస్ ఆఫీసర్ కావడం వలన గన్స్ తో నాకు పరిచయం వుంది (నవ్వుతూ). అయితే ఈ సినిమా కోసం ఏకే 47 లాంటి పెద్ద వెపన్స్ ని పట్టుకోవడం, లోడ్ చేయడం, వాటిని హ్యాండిల్ చేయడంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. దాదాపు రెండు నెలలు పైగా శిక్షణ సాగింది. అలాగే డైలాగ్ డిక్షన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధపెట్టాను. ఒక నటిగా చాలా తృప్తిని ఇచ్చిన చిత్రమిది. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఒక డ్రీమ్ టీంతో కలసి పని చేయడం గొప్ప ఆనందం ఇచ్చింది. నిజంగా ఇందులో నా పాత్ర ఒక డ్రీమ్ రోల్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. సినిమా చూసిన తర్వాత  కేవలం గ్లామరస్ పాత్రలోనే కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేయగలనే నమ్మకం కుదురుతుందని భావిస్తున్నాను.  

నాగార్జున గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
నాగార్జున గారితో పని చేయడం ఒక డ్రీమ్. ఆ కల ఈ సినిమాతో తీరింది. నాగార్జున గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన్ని కలసినప్పుడు కాస్త నెర్వస్ గా ఫీలయ్యా. అయితే పది నిమిషాల మాట్లాడిన తర్వాత నా భయం అంతా పోయింది. నాగార్జున గారు చాలా గ్రేట్ పర్శన్. ఆయనతో నటించడం మర్చిపోలేని అనుభూతి. నాగార్జున గారు కింగ్ అఫ్ రోమాన్స్. వేగం పాటలో మా కెమిస్ట్రీ చూసేవుంటారు. అయితే ‘ ది ఘోస్ట్’ యాక్షన్ థ్రిల్లర్. నాగార్జున గారితో మంచి రొమాంటిక్ సినిమా చేయాలని వుంది. (నవ్వుతూ).

ప్రభాస్, నాగార్జున, వెంకటేష్.. ఇలా వరుసగా బిగ్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారా కదా.. తెలుగులో మీ టైం స్టార్ట్ అయ్యిందని అనుకోవచ్చా ?
వరుసగా బిగ్ స్టార్స్ తో పని చేయడం నా అదృష్టంగా భావిస్తా. నేను ఎక్కువగా పాత్రపై ద్రుష్టి పెడతా. మంచి పాత్రలతో పాటు బిగ్ స్టార్స్ వున్న సినిమాలు రావడం ఆనందంగా వుంది.

దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
ప్రవీణ్ సత్తార్ చాలా క్లియర్ విజన్ వున్న దర్శకుడు . ఆయన చాలా నీట్ గా హోమ్ వర్క్ చేసుకుంటారు. దీంతో సెట్స్ లో ఎలాంటి కన్ఫ్యుజన్ వుండదు. మిగతా నటీనటులు పని ఈజీ అవుతుంది. ఆయన చాలా క్లారిటీ వున్న దర్శకుడు.

ఈ చిత్రంలో మీరు ఎన్ని యాక్షన్ బ్లాక్స్ లో కనిపిస్తారు ?
నాకు ఇందులో రెండు మెయిన్ యాక్షన్ బ్లాక్స్ వున్నాయి. ది ఘోస్ట్ కంప్లీట్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్.

జయాపజయాలని ఎలా తీసుకుంటారు ?
నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. చాలా సాంప్రదాయ రాజ్ పుత్ కుటుంబం నుండి వచ్చాను. యాక్టింగ్ మాట పక్కన పెడితే మాకు ఇంటి నుండి బయటికి రావడమే గొప్ప. నాకు ఏమీ తెలియని రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చాను. ప్రతిది ఇక్కడే నేర్చుకున్నాను. జీవితంలో ఎత్తుపల్లాలు వుంటాయి. వాటిని ఎలా తీసుకోవాలో కూడా ఇండస్ట్రీనే నేర్పింది.

కొత్త చేయబోతున్న సినిమాలు ?
రెండు సినిమాలు చర్చల్లో వున్నాయి. త్వరలోనే వివరాలు తెలుస్తాయి

అల్ ది బెస్ట్
థాంక్స్

Tfja Team

Recent Posts

‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’

భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా టాక్సిక్ సినిమాను షూట్ చేస్తున్నారు. ఇలా ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా…

1 week ago

Yash’s ‘Toxic: A Fairy Tale for Grown-Ups

Or Yash's ‘Toxic: A Fairy Tale for Grown-Ups’ Breaks Barriers as the First Indian Film…

1 week ago

Hari Hara Veera Mallu Second Single An Instant Chartbuster

The much awaited second single from Powerstar Pawan Kalyan’s upcoming magnum opus Hari Hara Veera…

1 week ago

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ నుంచి రెండవ గీతం ‘కొల్లగొట్టినాదిరో’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'.…

1 week ago

సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో హీటెక్కిన డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ షో

ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో డ్యాన్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్…

1 week ago

Dance IKON Season 2 turns into revenge-fueled battle as nominations heat up

HYDERABAD – The second episode of Dance IKON Season 2: Wildfire delivered an unexpected twist,…

1 week ago