నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతుంది. ఉషా పరిణయం అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. కె.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్యతారలు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కె.విజయ్‌భాస్కర్ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలివి.
చాలా విరామం తరువాత ‘ఉషా పరిణయం’తో రాబోతున్నారు ఇది ఎలాంటి కథ?
ఉషా పరిణయం ప్రేమకు నేను ఇచ్చే నిర్వచనం. ఈ మధ్య ప్రేమకు అర్థం మారిపోయింది. ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు జరగడం ఎక్కవైపోయింది.. అసలు అది ప్రేమకాదు. అందరు అలాంటిది జరిగినప్పుడు అందరూ ప్రేమోన్మాదం అని రాస్తున్నారు అలా రాయకండి అంది ఓన్లీ ఉన్మాదం. అలాంటి వాడు శాడిస్ట్. వాడు లవర్ కాదు. లవ్ అనేది ఎప్పుడూ హింసాత్మకంగా వుండదు. హింసాత్మకంగా వుంటే అది ప్రేమే కాదు. అలా నా స్టయిల్‌లో చెప్పాలనుకున్నాను. ప్రేమ అలా మారిపోయింది. అలా కాదు ఇలా వుంటే బాగుంటుందని నా స్టయిల్‌లో చెబుతున్నాను. ఈ పాయింట్‌తో ఓ కథ చెప్పాలనుకున్నా చెబుతున్నాను. ఇట్స్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఇది మేసేజ్‌లా వుండదు. ఎంటర్‌టైనింగ్ వుంటుంది. అండర్ కరెంట్‌తో ట్రూలవ్ ను చూపించానుకున్నాను.
ఈ కథ మీ తనయుడు శ్రీకమల్ కోసమే అనుకున్నారా?
ఈ కథ ఇంతకుముందే చేసుకున్నాను. ఇద్దరి ముగ్గురికి చెప్పాను. జిలేబి తరువాత నాకు సరిపోయే కథతో సినిమా చేయండి అని కమల్ అడిగాడు. ఇది కమల్ వయసుకు మ్యాచ్ అయ్యే కథ అనిపించింది.
కమల్ కెరీర్‌కు ఇది ఎలాంటి సినిమాగా వుండబోతుంది?
కమల్‌కు ఇదొక మంచి అవకాశం. ఇంతకు ముందు కమల్ చేసిన సినిమా ఓన్లీ ఎంటర్‌టైనింగ్ సినిమా. ఇది ఇంటెన్సీటి ప్రేమకథ సినిమా. ఈ సినిమాతో తాన్వీ ఆకాంక్షను అనే తెలుగమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. ఈ అమ్మాయిని జై చిరంజీవి టైమ్‌లో బాలనటిగా రిజెక్ట్ చేశాను. వెరీ గుడ్ గర్ల్ వెల్ బిహేవ్. వాళ్లిద్దరితో పాటు నాకు కూడా ఈ సినిమా మంచి అవకాశం. యూత్‌ఫుల్ కథ. మసాలా తరువాత నువ్వు నాకు నచ్చావ్ జానర్‌లో వున్న సినిమా చేసిన ఫీల్ కలిగింది.
నేటి పరిస్థితు్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ను పండించడం టఫ్‌గా వుందని భావిస్తున్నారా?
కామెడీని రాసుకోవడం ఛాలెంజంగ్‌గా ఏమీ లేదు. కామెడీకి బ్రౌండర్సీ ఏమీ లేవు. కొంత మంది సీరియస్‌గా వుంటూ కూడా నవ్విస్తారు. నా సినిమాలో వుండే కామెడీ అంతా నా స్ట్రిప్ట్‌లోనే వుంటుంది.
వుంటుంది. పాత్రలో వుంటుంది. ఎవరి కోసం కథ చేస్తామో.. వాళ్లను దృష్టిలో పెట్టుకుని కామెడీ రాస్తాం. మన్మథుడు మెగాస్టార్ చిరంజీవికి మ్యాచ్ అవ్వదు. జై చిరంజీవ వెంకటేష్‌కు సరిపోదు.నువ్వు నాకు నచ్చావ్ వెంకటేష్‌ను తప్ప మరెవరినీ ఊహించుకోలేం. ఈ సినిమా కథ ఓ కుర్రాడి కోసం తయారుచేసిన కథ. కేవలం కొడుకు కోసం చేసిన కథ కాదు. వాడికి వయసు తగ్గ కథ ఇది. కానీ సినిమా చేసిన తరువాత కమల్ ఈసినిమా కరెక్ట్ అనిపించింది.
మీ వారసుడు అంటే దర్శకత్వం వైపు వస్తాడని అందరూ అనుకుంటారు? కానీ హీరోగా చేయడానికి రీజన్?
కుర్రాళ్లకు దిగితే తప్ప లోతు తెలియదు. మొదట్లో దర్వకత్వం చేస్తానన్నాడు. లేదు నీకు యాక్టింగ్ కరెక్ట్ అని నేను చెప్పాను. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లోనే దర్శకత్వం అంటే ఎంతో టఫ్ అనేది కమల్‌కు అర్థమైంది. మనకు ఏది తెలియదో.. తెలుసుకోవడమే గొప్ప విజ్క్షానం అని రవీంధ్రనాథ్ ఠాగూర్ చెప్పినట్లు వయసు వచ్చిన తరువాత తండ్రి చెప్పింది కరెక్ట్ అని రియలైజ్ అయ్యే టైమ్‌కు అతనికి నువ్వు చెప్పింది తప్పు అని చెప్పే కొడుకు వుంటాడు,
ప్రేక్షకుల అభిరుచి మారింది? ఇప్పటి ప్రేక్షెకులను ఉషా పరిణయం ఎంతవరకు మెప్పిస్తుందని అనుకుంటున్నారు?
ఆడియన్స్ టేస్ట్ మారింది అనే విషయాన్ని నేను ఒప్పుకోను. 100 ఏళ్లు అయిన ప్రేక్షకుల అభిరుచి మారదు. చక్కగా ఎంటర్‌టైన్ చేయగలిగితే.. ఆడియన్ఫ్ చూస్తారు. ఎన్ని మారిన, ఎన్ని ఫ్లాట్‌ఫామ్ వచ్చిన కథలో అన్ని సమపాళ్లలో జోడిస్తే సినిమాలు తప్పకుండా చూస్తారు. థియేటర్‌కు వస్తారు
ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. ప్రత్యేకంగా పాటలపై శ్రద్ద పెట్టారానిపిస్తుంది?
చాలా రోజుల తరువాత నాకు మనస్పూర్తిగా అన్ని మంచి పాటలు ఆడియన్స్‌కు ఇచ్చామనే ఫీలింగ్ ఈ సినిమాతో కలిగింది. ఆర్.ఆర్ ధ్రువన్. నాకథకు తగ్గట్టుగా చాలా మంచి సంగీతం ఇచ్చాడు. సంగీతం అనేది స్ట్రిప్ట్‌లో వుండాలి. అనేది నా ఫీలింగ్
ఉషా పరిణయంతో యూత్‌ఫుల్ ఆడియన్స్ టార్గెట్ చేస్తున్న సినిమాలా అనిపిస్తుంది? ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో వున్నాయా?
సినిమా యూత్‌ఫుల్‌గా వుంటుంది. కానీ మా టార్గెట్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్. చాలా మంది థియేటర్స్‌కు ఆడియన్స్ రావడం లేదని అంటున్నారు కానీ. . అసలు ఎందుకు రావడం లేదో ఎనలైజ్ చేసుకుంటే సినిమా అంటే అందరూ కలిసి కూర్చొని ఎంజాయ్ చేసేటట్టు వుండాలి. సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ లేకుండా సినిమాలు తీస్తే ప్రేక్షకులు రారు. అందరూ కలిసి బోజనం చేసినట్టుగా అందరూ కలిసి కూర్చొని చూసే సినిమాలు వస్తే బాగుంటుంది. మంచి సినిమాలు చూస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఒక తరగతికి మాత్రమే శాటిస్‌ఫాక్షన్ అయ్యేలా సినిమా తీస్తే ఎలా అనేది నా ఫీలింగ్.. ఈ సినిమా తప్పకుండా అందరూ ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా వుంటుంది.
ఉషా పరిణయం టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి:
ఇదొక క్లాసిక్ టైటిల్.. నాకు ఎప్పట్నుంచో ఈ టైటిల్‌తో సినిమా చేయాలని కోరిక వుండేది. ఇన్నాళ్లకు కుదిరింది. ఇందులో హీరోయిన్ పేరు కూడా ఉషా. సినిమా అంతా ఆమె పెళ్లి గురించే. ఈ సినిమాలో ప్రేమ గురించి చెబుతున్నాను. ఈ సినిమాకు లవ్‌ఈజ్ బ్యూటిఫుల్ అనే క్యాష్పన్ ఎందుకు చెబుతున్నానో సినిమ చూస్తే అర్థమవుతుంది. ఇంతకు ముందు లవ్ ఎమోషన్ష్ ఎంతో సున్నితంగా వుండేవి. ఇప్పుడు ఓటీటీల ప్రభావం ఏంటో కానీ ప్రేమకథలో ఆ సున్నితత్వం పోయింది. ప్రేమ అనేది ఎంతో నోబుల్ ఎమోషన్. ఈ రోజు కథల్లో అది మిస్ అవుతుంది. ఇంటెన్సీటి ఎమోషన్. ఆ అమ్మాయి భావాలను శాసించే హక్కు ఎవరికి వుండదు. ఇలాంటివి అన్ని ఈసినిమాలో ఎంటర్‌టైనింగ్ చెబుతున్నాను. థియేటర్ రావాలనే ఫీలింగ్ ఈసినిమా కలిగిస్తుంది.