‘భాగే సాలే’నిర్మాత అర్జున్ దాస్యన్ ఇంటర్వ్యూ

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా.. బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో నిర్మాత అర్జున్ దాస్యన్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

భాగ్‌ సాలే చిత్రాన్ని సురేష్ డిస్టిబ్యూషన్ వాళ్లు విడుదల చేస్తున్నారు. మంచి క్రైమ్ కామెడీ స్టోరీని తీశాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాం. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నా. క్రైమ్ కామెడీ చాలా తక్కువగా టచ్ చేసినట్లు అనిపించింది. ఈ జోనర్‌లో తక్కువ సినిమాలు వచ్చినా.. ఎక్కువ హిట్స్ వచ్చాయి. అలాంటి మూవీ ఎందుకు తీయకూడదనిపించి భాగ్‌ సాలే చిత్రాన్ని తీశాం.

ప్రణీత్ కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. కానీ భయం కూడా వేసింది. ఆయన చెప్పింది తీయగలుగుతాడా లేదా అని భయమేసింది. మొదటి కాపీ చూసిన తరువాత నేను అనుకున్న దానికంటే పది రెట్లు ఎక్కువగా తీశాడు. హీరో శ్రీసింహాకు ఈ జోనర్‌ బాగా సెట్ అవుతుంది. అతని మొదటి సినిమా మత్తువదలరా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుందని భావిస్తున్నాం. డైరెక్టర్ కథ అనుకున్నప్పుడే హీరోగా శ్రీసింహాను అనుకున్నారు. సంగీత దర్శకుడిగా కాల భైరవ ఉండాలని ముందే అనుకున్నాం.

సినిమాలో హీరో పేరు అర్జున్. సులభంగా ఎదగాలనే అనుకునే కుర్రాడు. ఈ క్రమంలో మోసాలు చేయడం.. ఎదురయ్యే సమస్యలపై హీరో పాత్ర ఉంటుంది. ఓ రింగ్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇటీవల ది వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే పేరుతో ఒక యానిమేషన్ వీడియో విడుదల చేశాం. దీనికి సిద్దూ జొన్నలగడ్డ వాయిస్ అందించారు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ కథలా చెప్పాం. మొత్తం సినిమా ఈ రింగ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కల్పితమే.

మొదటి కాపీ చూసిన తరువాత శ్రీసింహా చాలా బాగా చేశాడనిపించింది. కేవలం కామెడీ తీస్తేనే బాగోదని.. క్రైమ్ జోనర్‌ను కూడా ఎంచుకున్నాం. ఇప్పటికే కొన్ని టీవీ షోలలో ప్లాస్టిక్ కామెడీ చేస్తున్నారు. సినిమాలలో కూడా అలాంటి కామెడీనే చూపించడం ఎందుకు అనిపించింది. మేం అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను తీశాం. కీరవాణి గారికి ఇంకా సినిమాను చూపించలేదు. మొదటి రోజు అందరితోపాటు కలిసి చూస్తానని చెప్పారు.

సినిమాలో క్రైమ్, కామెడీ రెండు సమానంగా ఉంటాయి. మంచిగా నవ్వుకుంటూనే సినిమా సాగుతుంది. ప్రేక్షకులు సినిమా అంతా నవ్వుకునే సీన్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే క్రైమ్ కూడా సాగుతుంటుంది. స్వామి రారా సినిమా తరహాలో ఉంటుంది. జాన్ విజయ్ గారు విలన్‌గా నటించారు. మా ప్రొడక్షన్ నుంచి ఇది మూడో సినిమా. డియర్ మేఘా సినిమాను కన్నడ రీమేక్‌గా తీశాం. కానీ సినిమా విడుదల రోజే వాళ్లు యూట్యూబ్‌లో చేశారు. దాని వల్ల మా సినిమాకు నష్టం వచ్చింది. చాలా మంచి సినిమా అది. ఈటీవీలో డియర్ మేఘాకు మంచి రన్ ఉంది. అయితే ఈ సినిమా తరువాత మళ్లీ రీమేక్స్ చేయకూడదని అనుకున్నా. భవిష్యత్‌లో వస్తే చేస్తా. ప్రస్తుతం తెలుగు రచయితలతో చేస్తున్నా. హిందీలో అక్కడి రచయితలతో పనిచేస్తున్నాం.

మత్తు వదలరా సినిమాకు మంచి మ్యూజిక్ కాలా భైరవ అందించారు. కార్తికేయ సినిమాకు చాలా బాగానిపించింది. అలాంటి మ్యూజిక్ ఈ సినిమాకు కావాలని అడిగాం. మంచి సాంగ్స్ అందించారు. మా సినిమాతోపాటు మరికొన్ని చిత్రాలు కూడా జూలై 7న విడుదలవుతున్నాయి. అయితే వేర్వేరు జోన్ సినిమాలు అన్ని. మా జోనర్ ప్రేక్షకులు మాకు ప్రత్యేకంగా ఉన్నారు. సినిమా విడుదలకు థియేటర్ల సమస్య లేదు. తెలుగులో రెస్పాన్స్ బట్టి మిగిలిన భాషల్లో విడుదల చేయడంపై ఆలోచిస్తాం. ప్రియదర్శి హీరోగా మరో సినిమా తీస్తున్నాం

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

17 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

3 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

3 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

3 days ago