‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ ఫరియా అబ్దుల్లా

కామెడీ కింగ్ అల్లరి నరేష్  ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా  హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘ఆ ఒక్కటీ అడక్కు’ లో మీ పాత్ర ఎలా వుండబోతుంది? ఈ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
-ఇందులో నా పాత్ర పేరు సిద్ధి. నా పాత్ర చాలా స్వేఛ్చగా వుటుంది. అన్ని ప్లాన్ చేసి, నిబంధనలు పెట్టుకొని అందులోనే బ్రతకడం తనకి ఇష్టం వుండదు. హీరో పాత్ర నా పాత్రకు భిన్నంగా వుంటుంది. తను అన్నీ ప్లాన్ ప్రకారం వుంటారు. ఈ రెండు పాత్రల మధ్య మంచి కాన్ఫ్లిక్ట్ వుంటుంది. అదే సమయంలో మంచి ఎట్రాక్షన్ వుంటుంది. కథ పెళ్లి అనే అంశం చుట్టూ ఉంటూ అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ కథ, కాన్సెప్ట్ బ్యూటీఫుల్ గా వుంటుంది.

ఈ పాత్ర చేయడం సవాల్ గా అనిపించిందా ?
-సవాల్ గా అనిపించలేదు. ఎందుకంటే..నేను కూడా ఫ్రీ ఫ్లో లోనే వుంటాను. నాకు చాలా కనెక్ట్ అయిన పాత్ర ఇది. దర్శకుడు కథ చెప్పినపుడు కంటెంట్ చాలా నచ్చింది. ఈ రోజుల్లో అందరికీ అవసరమయ్యే కంటెంట్ ఇది.  

జాతిరత్నాలులో మంచి హ్యుమర్ వున్న పాత్ర చేశారు కదా.. ఇందులో కామెడీ ఎలా వుంటుంది ?
-ఇందులో కామెడీ చాలా డిఫరెంట్ గా వుంటుంది. పరిస్థితుల నుంచే పుట్టే హాస్యం వుంటుంది. ఇందులో కామెడీ చాలా నేచురల్ గా పుడుతుంది. ఇందులో కంటెంట్ ప్రేక్షకులని సహజంగా నవ్విస్తుంది.

నరేష్ గారు లాంటి అద్భుతమైన కామెడీ టైమింగ్ వున్న హీరోతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-నరేష్ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. షూటింగ్ చాలా సరదాగా జరిగింది. నరేష్ గారి కామెడీ టైమింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంటుంది. ఈ సినిమాతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తారు. ఇందులో చాలా హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ వుంటుంది.  

దర్శకుడు మల్లి అంకంతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-దర్శకుడు మల్లి గారు నాకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. అది నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. అలాగే కథ గురించి చాలా చర్చించేవారు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన అందరి సలహాలు తీసుకుంటారు. ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. సినిమా షూటింగ్ అంతా ఫన్ గా జరిగింది.

ఇందులో పెళ్లి గురించి ఎలాంటి అంశాలు చర్చించారు ?
-పెర్ఫెక్ట్ వైఫ్, పెర్ఫెక్ట్ హుస్బెండ్ ..అంటూ చాలా సెలెక్టివ్ గా అమారిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. ఒకప్పుడు పెళ్లిలకి, ఇప్పటి పెళ్లిలకి చాలా మార్పులు వచ్చేశాయి. మ్యాట్రీమొనీ సైట్స్ లో ఎలా డీల్ చేస్తారనే అంశంతో పాటు పెళ్లికి సంబధించిన అనేక అంశాలు ఇందులో చాలా ఆసక్తికరంగా చూపించాం.

నిర్మాతల గురించి ?
-రాజీవ్ చిలక గారు చాలా పాషన్ వున్న నిర్మాత. సినిమాని ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్ గా నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. వారి నిర్మాణంలో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది.

ఒక పాత్ర ఎంపిక చేసుకున్నపుడు ఏ అంశాలు చూస్తారు ?
-పాత్ర ప్రాధాన్యత, నిడివి అన్నీ చూస్తాను. కొన్ని క్యామియో రోల్స్ కూడా చేశాను. రవితేజ గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. రావణాసురలో అవకాశం వచ్చింది. అది హీరోయిన్ పాత్ర అని చెప్పలేను కానీ ఆ పాత్ర చేయడం చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది.

భవిష్యత్ ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు ?
-టిపికల్ హీరోయిన్ గా మాస్ మసాలా సినిమా చేయాలని వుంది. అలాగే హారర్ థ్రిల్లర్ చేయాలని వుంది. అలాగే కామెడీ సినిమా చేయాలని వుంది. ఇప్పుడు పరిశ్రమలో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా వున్నారు. ఆ ఖాళీని భర్తీ చేయాలని వుంది. యాక్షన్ సినిమాలు నాకు బాగా నప్పుతాయని భావిస్తున్నాను.

జాతిరత్నాలు 2 ఎప్పుడు ?
-ప్రస్తుతం నిర్మాతలు ‘ప్రాజెక్ట్ కె’ లో బిజీగా వున్నారు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్.  కల్కి కోసం నేనూ ఎదురుచూస్తున్నాను. కల్కి విడుదల తర్వాత జాతిరత్నాలు 2 కోసం ఆలోచిస్తారేమో అనుకుంటున్నాను.  

కొత్తగా చేస్తున్న చిత్రాలు ?
-‘మత్తువదలరా 2’ చేస్తున్నాను. గోపి దర్శకత్వంలో భగవంతుడు అనే సినిమా చేస్తున్నాను. అలాగే ఓ తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. కొన్ని తమిళ. మలయాళం కథలు కూడా వింటున్నాను.  

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago