VT13 త్వరలో టైటిల్ అనౌన్స్ మెంట్

Must Read

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందుతున్న #VT13 ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

వాస్తవ సంఘటనల స్పూర్తితో ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా తెలుగు-హిందీ ద్విభాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ను IAF అధికారిగా కనిపిస్తారు. ప్రేక్షకులు లార్జర్ దేన్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి మేకర్స్ అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్రీకరించడానికి మేకర్స్ భారీ సెట్‌ను రూపొందించారు. మునుపెన్నడూ చూడని ఈ యాక్షన్ కోసం వరుణ్ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా, మేకర్స్ నుండి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది.

దేశం ఇప్పటివరకు చూడని అతిపెద్ద, భయంకరమైన వైమానిక దాడులలో పోరాడిన మన హీరోల పోరాట స్ఫూర్తికి తగిన పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్ తో కూడిన ఈ చిత్రం టైటిల్‌ను మేకర్స్ త్వలోనే అనౌన్స్ చేయనున్నారు.

మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.



శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్,  రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహా నిర్మాతలు.

Latest News

‘GS (గాడ్స్ అండ్ సోల్జర్స్)’ షూటింగ్ పూర్తి – శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్‌

రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ ప్రధాన చిత్రీకరణ పూర్తైంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్...

More News