“స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” నుండి రెండు సరికొత్త పోస్టర్లు విడుదల

Must Read

అందరి ఫేవరెట్ సూపర్ హీరో ‘స్పైడర్-మ్యాన్’ కొత్త సినిమా “స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” నుండి రెండు అద్భుతమైన పోస్టర్లను సోనీ పిక్చర్స్ ‘సినిమాకాన్ 2026’లో విడుదల చేసింది. ఈ సినిమా జూలై 31, 2026న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

సోనీ హెడ్ టామ్ రోత్‌మాన్ ఈ పోస్టర్లను ఆవిష్కరిస్తూ… “ఇలాంటి స్పైడర్-మ్యాన్ సినిమాను మేం ముందెన్నడూ తీయలేదు, ఇందులో హీరో టామ్ హాలండ్ నటన అద్భుతంగా ఉంటుంది” అని ప్రశంసించారు. అలాగే టామ్ హాలండ్ మాట్లాడుతూ… “ఇది ఇప్పటివరకు వచ్చిన స్పైడర్-మ్యాన్ చిత్రాలలో అత్యంత ఎమోషనల్, మెచ్యూర్డ్ సినిమా” అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలను పెంచుతూ రికార్డులు సృష్టిస్తోంది.

డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టామ్ హాలండ్, జెండయా, జాకబ్ బాటలన్, సాడీ సింక్, మార్క్ రఫ్ఫలో తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ఈ చిత్రాన్ని అన్ని ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

Latest News

అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం!

పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్‌ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'డ్యూ...

More News