Featured

జూన్13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు సీజన్2’ స్ట్రీమింగ్‌

‘ది ఫిక్సర్ ఈజ్ బ్యాక్’… జూన్13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు సీజన్2’ స్ట్రీమింగ్‌

హైద‌రాబాద్‌, మే21, 2025: హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖమైన ప్ర‌సాద్ సినిమాస్ ద‌గ్గ‌ర అభిమానులు, ప్రేక్ష‌కులు భారీగా హాజ‌ర‌య్యారు. అంద‌రిలో ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది. ఈ ప్ర‌త్యేక‌మైన వేడుక‌ల‌కు విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. వెర్సటైల్, డైన‌మిక్ యాక్ట‌ర్ అర్జున్ రాంపాల్ కూడా ఈ వేడుక‌ల్లో భాగ‌మ‌య్యారు. నెట్‌ఫిక్స్‌లో సూప‌ర్ హిట్ అయిన సిరీస్ రానా నాయుడు సీజ‌న్‌2 కోసం ఈ ఇద్ద‌రు స్టార్స్ త‌మదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చేసి రానా నాయుడు సీజ‌న్‌2 భారీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

రానా నాయుడు సీజ‌న్‌2 కోసం ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మ‌రింత పెంచుతూ స‌రికొత్త ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌టం విశేషం. జూన్‌13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న రానానాయుడు సీజ‌న్‌2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ‘సీజ‌న్ వ‌న్ కంటే సీజ‌న్‌2 మరింత వైల్డ్‌గా ఉంటుంది’ అని పేర్కొన్నారు రానా. ‘ఈ సీజ‌న్ మ‌రింత పెద్ద‌దిగా, వ్య‌క్తిగ‌తంగా ఉంటుంది. రానానాయుడు సీజ‌న్‌2 కోసం మ‌రోసారి టీమ్‌ను క‌ల‌వ‌టం చాలా ఆనందంగా ఉంది. పాత్ర‌లు మ‌రింత లోతుగా ఉంటాయి. అవ‌న్నీ గంద‌ర‌గోళంగా అనిపిస్తాయి. అన్నీ విష‌యాల్లో హ‌ద్దుల‌ను మ‌రింత‌గా పెంచాం. మీరు ఇష్ట‌ప‌డిన విష‌యాల‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లాం. మొద‌టి సీజ‌న్‌కు అభిమానుల నుంచి గొప్ప స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు సీజ‌న్‌2కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను అభిమానుల స‌మ‌క్షంలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుద‌ల చేయ‌టం ఆనందంగా ఉంది. నేను నేను రానా నాయుడుగా న‌టిస్తే, ర‌వుఫ్ పాత్ర‌లో అర్జున్ రాంపాల్ న‌టించారు. ఇద్ద‌రం ఢీ అంటే ఢీ అనేలా న‌టించాం. కానీ హైద‌రాబాద్‌లో నేను హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాను’ అని రానా తెలిపారు.

అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ ‘‘రవుఫ్ పాత్రకు జీవం పోయటం చాలా కష్టమైంది. అయితే కరణ్ అన్షుమన్ పట్టుదల, అంకితభావంతో అది సాధ్యమైంది. ఆయ‌న పాత్ర‌ల్లో అనేక వేరియేషన్స్ చూపిస్తూ చ‌క్క‌గా రాశారు. దీని వ‌ల్ల నా పాత్రను నేను చేయ‌టం చాలా సుల‌భ‌మైంది. చాలా ఎంజాయ్ చేశాను. ఎలాంటి భ‌యం లేని రానా నాయుడుకి ఈ సీజ‌న్‌లో చాలా క‌ష్టాలుంటాయి. పాత్ర ప‌రంగా నేను చాలా క‌ఠినంగా న‌టించిన‌ప్పటికీ షూటింగ్ స‌మ‌యంలో నేను రానాతో చ‌క్క‌గా క‌లిసిపోయాను. తను చాలా మంచి కోస్టార్. తనతో వర్క్ చేయటం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక వెంక‌టేష్ కూడా అలాంటి స‌రదా వ్య‌క్తే. సూప‌ర్ టాలెంటెడ్ టీమ్‌తో క‌లిసి ప‌నిచేశాను. నెట్‌ఫ్లిక్స్‌లో నేను చేసిన మొద‌టి సిరీస్ కావ‌టంతో చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సీజ‌న్ గొప్ప‌గా రావ‌టానికి మేక‌ర్స్ ఎంత‌గానో ఇన్‌వాల్వ్ అయ్యారు. మంచి ఔట్‌పుట్ రావ‌టం కోసం దోహ‌ద‌ప‌డ్డారు. క‌ర‌ణ్‌, సుప‌ర్ణ్‌, అభ‌య్.. ఇలా ముగ్గురు ద‌ర్శ‌కుల‌తో ఒకేసారి ప‌ని చేయ‌టం నాకు కూడా మొద‌టిసారే. ముగ్గురు వేర్వేరు వ్య‌క్తులైన‌ప్ప‌టికీ వారి ఆలోచ‌న‌లు, మేకింగ్ స‌రిగ్గా ఒక‌టే అన్న‌ట్లున్నాయి. ఇప్పుడు రానా నాయుడు సీజ‌న్‌2 ఫ‌స్ట్ లుక్‌తో అభిమానులు సంతోష‌ప‌డుంటారు. జూన్‌13కి ఎంతో స‌మ‌యం లేదు. నెట్‌ఫ్లిక్స్‌ను ట్యూన్ చేసుకోండి’’ అన్నారు.

రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి క‌ర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా వంటి తారాగణంతో, రానా నాయుడు సీజన్ 2 ప్రేక్ష‌కులు కోరుకునే డ్రామా, సంఘర్షణ, భావోద్వేగాలతో తుఫాను సంద‌డిని సృష్టించ‌టానికి సిద్ధంగా ఉంది. సుందర్ ఆరోన్ మరియు లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేయ‌గా.. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ, మరియు అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు. కుటుంబ సమీకరణాలు మరింత సంక్లిష్టంగా మారడం, వ్య‌క్తుల్లోని విధేయతలు మ‌రింత‌గా ప‌రీక్షింప‌బ‌డ‌తాయి.జూన్‌13న నెట్‌ఫ్లిక్స్‌లో నాయుడు కుటుంబం ఓ తుపాను సంద‌డి అందించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది.

క్రియేట‌ర్‌: క‌ర‌ణ్ అన్షుమ‌న్‌
ద‌ర్శ‌కత్వం: క‌ర‌ణ్ అన్షుమ‌న్‌, సుప‌ర్ణ్ వ‌ర్మ‌, అభ‌య్ చోప్రా
ర‌చ‌యిత‌లు: క‌ర‌ణ్ అన్షుమ‌న్‌, రాయ‌న్ సోరెస్‌, క‌ర్మ‌ణ్య అహుజ‌, అన‌న్య మౌడి, క‌ర‌ణ్ గౌర్‌, వైభ‌వ్ విశాల్‌
నిర్మాత‌: సుంద‌ర్ అరోన్‌
నిర్మాణ సంస్థ‌: లోకో మోటివ్ గ్లోబ‌ల్ మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విశాల్ బ‌జాజ్‌, నిశాంత్ పాండే, ఆరిఫ్ మిర్‌

ప్ర‌ధాన తారాగ‌ణం: రానా ద‌గ్గుబాటి, వెంక‌టేష్ ద‌గ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్విన్ చావ్లా, కృతి క‌ర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెన‌ర్జీ, డినో మారియో

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

3 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago