‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్.. ఆద్యంతం ఒక ఫన్ రైడ్ లా వుంటుంది
ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ఎ ఎం బీ మాల్ లో ప్రమోషన్ ప్లాన్ ఎవరిది ?
ఎ ఎం బీలో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని షూట్ చేయడానికి వెళ్లాం. అయితే సినిమా వస్తుందని ఎంతమందికి తెలుసనే ఒక ఆలోచన వచ్చి షూట్ చేయమని చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్టొరీ ఐడియా ఎప్పుడు వచ్చింది ?
లాక్ డౌన్ సమయంలో అందరికీ తీరిక దొరికింది. అప్పుడే చాలా మంచి యూట్యూబ్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఆ సమయంలో ఎలాగూ బయటికి వెళ్ళలేం కాబట్టి కనీసం ట్రావెల్ వీడియోస్ చూస్తే బయటికి వెళ్ళిన ఫీలింగ్ వుంటుందని ఎక్కువగా ట్రావెల్ వ్లాగ్ వీడియోస్ చూశాను. అది చాలా నచ్చింది. ప్రదేశాలు గురించి, వాటి చరిత్ర గురించి చెప్పడం చాలా ఇంట్రస్టింగా అనిపించింది. ఒక యూట్యుబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన మొదలైయింది. ట్రావెల్ వ్లాగర్ కి వున్న కష్టాలు, ప్రమాదాలు, సవాళ్ళు బ్యాక్ డ్రాప్ లో సినిమాని ప్లాన్ చేశాం.
ట్రావెల్ వ్లాగ్, యూట్యుబర్ లైఫ్ తో లిమిటెడ్ ఆడియన్స్ రిలేట్ చేసుకుంటారు కదా ? కామన్ ఆడియన్స్ కి ఈ కథ ఎంత రిలేటెడ్ గా వుంటుంది ?
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ చాలా హిలేరియస్ గా వుంటుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్ . వీరి మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ట్రావెల్ వీడియోలు షూట్ చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదం ఎదురుకున్నారనేది కూడా చాలా ఇంటరెస్టింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకూ ఒక లాఫ్ రైడ్ లా వుంటుంది. అండర్ కరెంట్ గా ఒక సమస్య రన్ అవుతూనే .. ఆ పరిస్థితి నుండి వచ్చే సిట్యువేషనల్ కామెడీ అద్భుతంగా వుంటుంది.
మీ సినిమాల్లో స్క్రీన్ ప్లే స్పెషల్ ఎట్రాక్షన్ కదా.. మరి ఇందులో ఎలా వుంటుంది ?
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా వుంటుంది. ప్రతి పదిహేను నిమిషాలకు కథలో ఒక చేంజ్ ఓవర్, మలుపు వుంటుంది. సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా వుంటుంది.
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో ఎలా చేశారు ?
సంతోష్ శోభన్ తో ఏక్ మినీ కథ చేశాను. అందులో తన నటన బాగా నచ్చింది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో ఒక యూట్యుబర్ గా యంగ్ యాక్టర్ కావాలని సంతోష్ తో కథ చెప్పడం జరిగింది. తనకి చాలా నచ్చింది. అలాగే జాతిరత్నాలు తర్వాత ఫారియా ఈ సినిమా చేసింది. తను సహజంగా ఎలా వుంటుందో సినిమాలో కూడా అలానే కనిపించింది. ఇద్దరూ పర్ఫెక్ట్ గా సరిపోయారు.
సుదర్శన్, బ్రహ్మాజీ పాత్రల గురించి ?
సుదర్శన్ ట్రావెల్ వ్లాగ్ షూట్ చేసే డివోపీ గా దాదాపు సినిమా అంతా ఉంటాడు. ఈ పాత్ర లో చాలా ఫన్నీగా ఉంటాడు. ఇందులో పిపిఎఫ్ అనే గ్యాంగ్ వుంటుంది. దానికి హెడ్ గా కనిపిస్తారు బ్రహ్మాజీ. చాలా రోజుల తర్వాత బ్రహ్మాజీ గారు అద్భుతంగా చేసిన క్యారెక్టర్ అని నాకు అనిపించింది. ఆయన పాత్ర కూడా దాదాపుగా సినిమా అంతా వుంటుంది. చాలా లైట్ హార్టెడ్ గా సరదాగా ఎంజాయ్ చేసే హిలేరియస్ ఎంటర్ టైనర్ ఇది.
ప్రభాస్ గారు ఈ సినిమా కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు వున్నారు ?
యూవీ క్రియేషన్స్, ప్రభాస్ గారు మాకు వెరీ క్లోజ్. వారి బ్యానర్ లో సినిమాలు చేశాం. తర్వాత కూడా చేయబోతున్నాను. నా, సంతోష్ శోభన్ సినిమా అంటే తప్పకుండా యూవీ క్రియేషన్స్ హెల్ప్ చేస్తోంది.
చిన్న సినిమాలకి ప్రేక్షకులు చాలా సెలెక్టెడ్ గా థియేటర్ కి వస్తున్నారు కదా.. ఆ భయం ఏమైనా ఉందా ?
వుందండీ. అందుకే చాలా కొత్తగా వైవిధ్యంగా ప్రమోట్ చేస్తున్నాం. జనాల్ని మార్నింగ్ షోకి తీసుకురావాలనేది మా టార్గెట్. మంచి టాక్ స్ప్రెడ్ అయితే, సినిమా బావుంటే ఖచ్చితంగా చూస్తారు.
మీ మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి స్క్రీన్ ప్లే లో చాలా మంచి పేరు వచ్చింది. అలాంటి రేసీ స్క్రీన్ ప్లేతో కొత్త సినిమాల ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ?
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే కూడా రేసీగా వుంటుంది. ఒక ట్రాక్ నడుస్తోంది. ఆ ట్రాక్ లోకి లీడ్ రోల్స్ ఎప్పుడు వస్తారా అనే ఎక్సయిమెంట్ వుంటుంది. చాలా కొత్తగా వుంటుంది.
మీ కథలు మీ నాన్న చదువుతారా ?
ప్రతి బౌండ్ స్క్రిప్ట్ ని నాన్నకి ఇస్తా. చదివి అభిప్రాయాలు, సూచనలు చెబుతారు. ఆయన కథతో సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుండో వుంది. దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి చేయాలి.
ఈ కథ విన్న తర్వాత వెంకట్ బోయనపల్లి గారు ఎలా స్పందించారు ?
ఆయనకి ఎప్పటి నుండో ఒక సినిమా చేయాలి. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ, టైటిల్ ఆయనకి చాలా నచ్చాయి. నా మీద నమ్మకంతో ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మించారు. ఈ సినిమా కోసం మారేడిమిల్లి అడవి లో షూట్ చేశాం. అదొక మంచి అనుభవం.
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ప్రమోషన్స్ లో చిరంజీవి గారు కూడా కలిసోచ్చారు కదా ?
నిజంగా ఇది అనుకోకుండా జరిగింది. వాల్తేరు వీరయ్య టీజర్ లో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ అనే డైలాగ్ వాడగానే అందరూ మమ్మల్ని ట్యాగ్ చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. ఏదో అద్భుతంగా జరగాలని ఎదురుచూశాం. చిరంజీవి గారి రూపంలో మాకు అద్భుతం జరిగింది.
ప్రవీణ్ లక్క రాజు మ్యూజిక్ గురించి ?
ప్రవీణ్ లక్క రాజుతో ఎక్ మినీ కథ, ఎక్స్ ప్రెస్ రాజా చేశాను. ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చాడు. డివోపీ వసంత్ కొన్ని తమిళ చిత్రాలు చేశారు. చాలా బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. దావూద్ స్క్రీన్ ప్లే కి హెల్ప్ చేశారు. ఇద్దరం కలసి చేశాం.
కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. పెద్ద సినిమా చేయాలనే మూడ్ లో వున్నా. జవాన్ నిర్మాత కృష్ణ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్, అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేయాలి.
ఆల్ ది బెస్ట్
థాంక్స్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…