“శశివదనే” ఫస్ట్ లుక్ పోస్టర్  విడుదల

గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా మరియు RX 100 రాంకీ,సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె,  కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, ‘ నటీనటులుగా సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం లో అహితేజ బెల్లంకొండ నిర్మాణ సారద్యంలో గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’. ఈ రోజు చిత్ర హీరోయిన్ కోమలి ప్రసాద్ బర్త్ డే ను పురస్కరించు కొని చిత్ర యూనిట్ విడుదల చేసిన “శశివదనే” ఫస్ట్ లుక్ తో అందరినీ కట్టి పడేస్తుంది. ఈ ఫస్ట్ లుక్ విడుదలైన గంటల వ్యవదిలోనే పరిశ్రమ నుండి ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం విశేషం.ఈ సందర్బంగా 

చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ  మాట్లాడుతూ..మా చిత్ర హీరోయిన్ కోమలీ ప్రసాద్ బర్త్ డే సందర్బంగా మా చిత్ర యూనిట్ తరుపున తనకు బర్త్ డే విషెస్ తెలుపు తున్నాము. ‘పలాస 1978’ సినిమాతో చలచిత్ర పరిశ్రమ ప్రముఖులను, ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి చాలా చక్కని నటనను  కనపరచ్చాడు. హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా చాలా చక్కగా నటించింది. ఈ చిత్రంలో పని చేసిన నటీ నటులు  అందరూ పోటీ పడి నటించారు. చిత్ర దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన  గోదావరి నేపథ్యంలో  లవ్ అండ్ యాక్షన్ డ్రామా గా తయారు చేసుకున్న ‘శశివదనే’ చిత్రాన్ని  చాలా చక్కగా  గ్రాండియ‌ర్‌గా, హై స్టాండ‌ర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్ పై సాగే లవ్ సీన్స్ చాలా కొత్తగా యూనిక్‌గా ఉంటాయి.ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి. ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయి. ఇప్పటి వరకు తీసిన సన్నివేశాలు చూసుకున్నాం చాలా బాగా వచ్చాయి. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం.ఇండస్ట్రీ లో ప్రస్తుతం షూటింగ్ నిలిపి వేత కారణంగా ఈ చిత్రం కూడా షూటింగ్  నిలుపుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 నుండి షూటింగ్స్ ప్రారంభం అవుతున్న సందర్బంగా ఈ చిత్రానికి సంబంధించి మిగిలి వున్న 10 రోజుల షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయడానికి సన్నాహాలు  చేస్తున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము అన్నారు.

నటీ నటులు 

 రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్, RX 100 రాంకీ,సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె,  కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, ‘ తదితరులు

సాంకేతిక నిపుణులు 

 పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటర్: గ్యారీ బీహెచ్, కలరిస్ట్: ఎ. అరుణ్ కుమార్ (డెక్కన్ డ్రీమ్స్), సీఈవో: ఆశిష్ పెరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం: సాయికుమార్ దార, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం: శరవణ వాసుదేవన్, కాస్ట్యూమ్స్ – సమర్పణ: గౌరీ నాయుడు, నిర్మాత: అహితేజ బెల్లంకొండ, రచన – దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago