టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ఫిలిం సిరీస్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మా ఊరి పొలిమేర. ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 2023 నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన మా ఊరి పొలిమేర 2 సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడీ సినిమా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024లో మా ఊరి పొలిమేర 2 అఫీషియల్ సెలక్షన్ అయ్యింది. రేపు ఢిల్లీలో ఈ ఈవెంట్ ఘనంగా జరగనుంది.
మా ఊరి పొలిమేర 2 సినిమాను గౌరు గణబాబు సమర్పణలో శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. ఈ సినిమాకు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించడమే కాదు ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…