సెలక్షన్ అయిన “మా ఊరి పొలిమేర 2”

Must Read

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ఫిలిం సిరీస్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మా ఊరి పొలిమేర. ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 2023 నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన మా ఊరి పొలిమేర 2 సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడీ సినిమా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024లో మా ఊరి పొలిమేర 2 అఫీషియల్ సెలక్షన్ అయ్యింది. రేపు ఢిల్లీలో ఈ ఈవెంట్ ఘనంగా జరగనుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమాను గౌరు గ‌ణ‌బాబు సమర్పణలో శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. ఈ సినిమాకు డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించడమే కాదు ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది.

Latest News

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార...

More News