English

ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ “క” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిస్తున్నారు. “క” సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

కో ప్రొడ్యూసర్ వినీషా రెడ్డి మాట్లాడుతూ – “క” మా అందరికీ ఎంతో స్పెషల్ ఫిల్మ్. డైరెక్టర్స్ సుజీత్, సందీప్ కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా కోసం కిరణ్ అబ్బవరం చాలా హార్డ్ వర్క్, డెడికేషన్ తో పనిచేశారు. ఆయన కష్టం రేపు సినిమాలో చూస్తారు. నయన్, తన్వీ తమ పాత్రల్లో మెరిశారు. సామ్ సీఎస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు టీమ్ అంతా కష్టపడి పనిచేశారు. ఇంత మంచి మూవీని చేసినందుకు టీమ్ “క”కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాట్లాడుతూ – హీరో కిరణ్ అన్న, నిర్మాత గోపాలకృష్ణ గారు, డైరెక్టర్స్ సుజీత్, సందీప్ గారు లేకుంటే “క” సినిమా ఉండేది కాదు. వీరు ఈ సినిమాకు ఫిల్లర్స్ గా పనిచేశారు. ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా తర్వాత మా టీమ్ అంతా మళ్లీ “క” మూవీకి వర్క్ చేస్తున్నాం. మీరు టీజర్ లో చూసిన ప్రతి విజువల్ వెనక ఎంతో కష్టం ఉంది. కిరణ్ అన్నకు సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. ఈ బలమైన కోరికే ఆయనను పెద్ద స్టార్ ను చేస్తుందని చెప్పగలను. అన్నారు.

ఎడిటర్ శ్రీ వరప్రసాద్ మాట్లాడుతూ – “క” సినిమా హీరో కిరణ్ అన్న కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది. సౌండ్, విజువల్స్, ఇతర ప్రొడక్షన్ వ్యాల్యూస్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేసిన సినిమా ఇది. ఫుటేజ్ చూసి నేను సర్ ప్రైజ్ అయ్యా. మా డైరెక్టర్స్ కు ఉన్న క్లారిటీకి ఆకట్టుకుంది. “క” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అన్నారు.

డీవోపీ విశ్వాస్ డేనియల్ మాట్లాడుతూ – ఈ మూవీకి వర్క్ చేసేందుకు మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ గారు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత మెస్మరైజ్ అయ్యాను. “క” కంటెంట్, స్క్రిప్ట్ పరంగా ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసే సినిమా అవుతుంది. ప్రేక్షకులకు ఎలాంటి సినిమా ఇవ్వాలి అనే బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది. కిరణ్ అబ్బవరం లేకుంటే ఈ సినిమా అయ్యేది కాదు. ఆయన ప్యాషన్ ఈ సినిమాలో కనిపిస్తుంది. అన్నారు.

డీవోపీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ – “క” సినిమా కథ విన్న తర్వాత మా టీమ్ అందరికీ ఇది జీవితంలో ఒకసారి దొరికే సినిమా అనిపించింది. దర్శకులు సుజీత్, సందీప్ కథను అంత బాగా రాయడమే కాదు అంతే బాగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. దానికి కారణం మా కిరణ్ అన్న, ప్రొడ్యూసర్ గారు. కిరణ్ అన్న ఆయన ఎదుగుతూ ఆయనతో పాటు మమ్మల్నీ ముందుకు తీసుకెళ్తున్నాడు. “క” అనే పేరుకు సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. నా మాటల్లో చెప్పాలంటే కావాల్సినంత కంటెంట్ ఉన్న సినిమా ఇది. అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ మాట్లాడుతూ – మా ప్రొడ్యూసర్ గారి నమ్మకం, డైరెక్టర్స్ విజన్, కిరణ్ గారి కష్టం కలిస్తే మా “క” సినిమా. ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చుకుంది. మా టీమ్ కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చవన్ మాట్లాడుతూ – డబ్బుతో పాటు గుండె ఉన్న ప్రొడ్యూసర్ మా గోపాలకృష్ణ గారు అందుకే “క” లాంటి సినిమా చేయగలిగారు. మన హైదరాబాద్ నుంచి వస్తున్న ఇంటర్నేషనల్ మూవీ “క” . కిరణ్ అన్న కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. కానీ సినిమా మీద ఆయనకున్న ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంది. రూల్స్ రంజన్ సినిమా టైమ్ లో కిరణ్ అన్న ఒక మాటిచ్చాడు. ఏడాది తర్వాత ఒక సినిమాతో వస్తున్నాను చూడండి అని. ఆ మాట ఎక్కడా తగ్గదు. మీరు ఇచ్చే సజెషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రతి విషయాన్ని ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని “క” సినిమా అనౌన్స్ చేశాం. టీజర్ లాగే సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ – మూడు క లను నమ్ముకుని “క” సినిమా నిర్మించాను. అందులో మొదటి క కథ. చాలా కథలు విన్న తర్వాత “క” సినిమా కథలో డిఫరెన్స్, కంటెంట్ ఉన్నాయని బలంగా అనిపించింది. రెండో క కథానాయకుడు. కిరణ్ గారి సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒక నటుడిని సరిగ్గా ఉపయోగించుకుంటే సక్సెస్ లేకుంటే ఫ్లాప్ అని నాకు అర్థమైంది. మూడో క కల. ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా నిర్మించి పది మందికి తోడుగా ఉండాలని, సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడాలని మొదటనుంచి సంకల్పించుకున్నాను. నిర్మాతగా ఇది నా కల. ఆ కల “క” సినిమాతో నెరవేరుతోంది. ఈ సినిమాతో పరిచయం అవుతున్న దర్శకులు సందీప్, సుజీత్ మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంటారు. మీడియా వారంతా మా మూవీకి తమ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ – మాకు “క” సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం రావడానికి మొదటి కారణం శ్రీధర్. ఆయన ఎస్ ఆర్ కళ్యాణమండపం డైరెక్టర్. మేము చెప్పిన కథ విని కిరణ్ గారి దగ్గరకు తీసుకెళ్లాడు. ఈ మూవీ ఇంత బాగా రావడానికి మా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఎంతో ఉంది. ఏ కథనైనా తెరపైకి తీసుకొచ్చేందుకు ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చింది కిరణ్ గారు. ఆయన మాకు మంచి రిసోర్సెస్, యంగ్ టాలెంటెడ్ టీమ్ ఇచ్చారు. మాలాంటి కొత్త డైరెక్టర్స్ కు ఇలాంటి టీమ్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. మా ఆలోచనలన్నీ తన కెమెరా ద్వారా విజువలైజ్ చేశారు సతీష్, విశ్వాస్ గారు. “క” పీరియాడిక్ మూవీ కాబట్టి మా ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ ఆ కాలంలోని గాడ్జెట్స్ అన్నీ సమకూర్చారు. మా ఇతర టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

దర్శకుడు సందీప్ మాట్లాడుతూ – “క” టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మమ్మల్ని నమ్మి ఈ సినిమా చేసేందుకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ గారికి థ్యాంక్స్. ఈ కథను ముందుకు తీసుకెళ్లేందుకు దారి చూపించిన ఎస్ఆర్ కళ్యాణమండపం డైరెక్టర్ శ్రీధర్, మా వెల్ విషర్ రాజుకు థ్యాంక్యూ. ఈ కథను యాక్సెప్ట్ చేసేందుకు గట్స్ కావాలి. పీరియాడిక్ డ్రామా, నాన్ లీనియర్ లో స్క్రీన్ ప్లే వెళ్తుంది. ఈ కథను నమ్మి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన హీరో కిరణ్ గారికి థ్యాంక్స్. చాలా ఎఫర్ట్స్ తో కూడుకున్న సినిమా ఇది. రీసెర్చ్ చేసి, 80ల నాటి వస్తువులు సేకరించి, క్రియేట్ చేసే హై స్టాండర్డ్స్ లో “క” సినిమాను రూపొందించాం. మా టీమ్ అందరి వల్లే “క” సినిమా ఇంత ఎగ్జైటింగ్ గా వచ్చింది. సెట్ కు వెల్లేప్పుడు కొత్త డైరెక్టర్స్ భయపడతారు. కానీ మేము ఒక ఫ్యామిలీలోకి వెళ్లినట్లు వెళ్లాం. అలాంటి అట్మాస్పియర్ మా కిరణ్ గారు సెట్ చేశారు. ఒక ఫ్యామిలీగా మేమంతా కష్టపడ్డాం. మీరు రేపు స్క్రీన్స్ మీద మా ఎఫర్ట్స్ చూస్తారు. “క” అంటే కిరణ్ అబ్బవరం అని అంతా అనుకుంటున్నారు కానీ “క” అంటే సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అది థియేటర్స్ లో చూస్తారు. అన్నారు.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ – కిరణ్ అబ్బవరం గారికి ఇది ఎంతో స్పెషల్ బర్త్ డే కావాలని కోరుకుంటున్నా. “క” సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ టీమ్ ఎనర్జీ చూస్తుంటే మాకూ ఎనర్జీ వస్తోంది. ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారు నాకు రెండేళ్ల క్రితం పరిచయం అయ్యారు. ఆయన మా యశోద సినిమాలో కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత ఆయన. చిత్ర పరిశ్రమకు గోపాలకృష్ణ రెడ్డి గారి లాంటి ప్రొడ్యూసర్స్ అవసరం. ఆయనకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో ఒడిదొడుకులు తెలిసి కూడా బాగా అవగాహన చేసుకుని వచ్చారు. “క” సినిమాకు ఈ టీమ్ అందరికీ ఆయనే సపోర్ట్ ఇచ్చారని అనుకోవచ్చు. “క” సినిమా ఆయనకు హీరో కిరణ్ కు మిగతా టీమ్ కు మంచి సక్సెస్ ఇవ్వాలి. అన్నారు.

డైరెక్టర్ సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ – కిరణ్ అబ్బవరం గారి పుట్టిరోజు ఇవాళ. ఆయనకు శతమానం భవతి. ఈ సినిమా ఫంక్షన్ చూస్తుంటే కాలేజ్ లో యానివర్సరీ ప్రోగ్రాంలా ఎనర్జిటిక్ గా ఉంది. ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారికి ఎంతో ప్యాషన్ ఉంది. ఆయన మరిన్ని మంచి మూవీస్ చేయాలి. “క” సినిమాతో ఆయనకు, హీరో కిరణ్ గారికి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. “క” అంటే నా దృష్టిలో ఈ టీమ్ అంతా పడిన కష్టం అనుకుంటున్నా. వారి కష్టానికి ఫలితం దక్కాలి. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా “క” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు సతీష్ వేగేశ్న గారికి థ్యాంక్స్. మీ అందరినీ కలిసి ఏడాది అవుతోంది. మిగతా వారికి వన్ ఇయర్ అంటే ఎమో గానీ మనకు మాత్రం చాలా దూరం వచ్చిన ఫీల్ కలుగుతోంది. నేను ఈ గ్యాప్ తీసుకోవడానికి కారణం ఉంది. ఎస్ఆర్ కల్యాణమండపం, రాజా వారు రాణిగారు సినిమాలు హిట్ అయ్యాయి. నన్ను మీరంతా ఆదరించారు ప్రేమించారు. మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది. ఇంత ప్రేమ నాకు ఇచ్చారు. అలాంటి టైమ్ లో ఆగస్టులో అనుకుంటా ఐదు సినిమాలు సైన్ చేశా. అవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఆ సినిమాల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ బాగా సపోర్ట్ చేశారు. అయితే ఆ తర్వాత నేను ఇంకా మంచి మూవీస్ బాగా సెలెక్ట్ చేసుకుని చేయాల్సింది కదా అనిపించింది. ఎందుకంటే మీరు నన్ను ఎంతో ప్రేమించారు. థియేటర్స్ కు వచ్చి సినిమాలు చూశారు. అలాంటప్పుడు మీకు ఇంకా మంచి మూవీ ఇవ్వాల్సింది అనే ఆలోచన కలిగింది. ఇంకా బెటర్ మూవీస్ చేయాలని నిర్ణయించుకున్నా. బీటెక్ చదివి సినిమాల మీద ఇష్టంతో వచ్చాను. నాపై మీరు చూపించిన నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. రేపు మరో హీరో నాలాగే ప్యాషన్ తో ఇండస్ట్రీకి వస్తే అతని మీద కూడా మీకు నమ్మకం కలగాలి. నా మొదటి సినిమాల్లో బాగా నచించానని అన్నారు. ఆ తర్వాత సినిమాల్లో ఏంటి ఇలా చేశాడు అన్నారు. కానీ సెట్ లో ఏదైనా సీన్ బాగా రాకుంటే కరెక్ట్ ఎక్స్ ప్రెషన్ రాదు. నేను ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంటా. వీడి పని అయిపోయింది అని ఎవరైనా అంటే నమ్మకండి. ఎందుకంటే మన పని అయిందా కాదా అనేది మనకు మాత్రమే తెలుసు. నా పని అయిపోయిందా లేదా అనేది నాకు మాత్రమే తెలుసు. నా పని అయిపోయింది అనిపించినప్పుడు సినిమాలు చేయను. నేను చాలా మంచి సినిమాలు చేస్తాను. నన్ను ప్రేమించిన మీ అందరి కోసం చేస్తాను. ఏ యంగ్ యాక్టర్ కు ఇవ్వనంత లవ్ నాకు మీరంతా ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడతాను. మా టీమ్ అంతా “క” సినిమాకు నేను పడిన కష్టాన్ని చెప్పారు. “క” సినిమా తెలుగు నుంచి వచ్చిన ఒక మంచి సినిమా అని మీరంతా చెప్పుకుంటారు. “క” అంటే కంటెంట్. ఆ కంటెంట్ ను మా డైరెక్టర్స్ డిజైన్ చేశారు. ఈ కథ విన్నప్పుడు వారు నాకొక మంచి ఆడియెన్స్ లా కనిపించారు. ఆడియెన్స్ దృష్టితోనే వారు కథను రాసినట్లు అనిపించింది. ఇప్పుడున్న టికెట్ రేట్స్, కాంపిటేషన్ లో ఎంతమంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తారు అనేది మా డైరెక్టర్స్ ఆలోచించారు. మా డీవోపీలు సతీష్, విశ్వాస్, మా ఎడిటర్ ప్రసాద్, మా ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్, మా కో ప్రొడ్యూసర్స్..ఇలా టీమ్ అంతా ఎంతో ప్యాషనేట్ గా వర్క్ చేశారు. మా మూవీ సెట్ లోకి వెళ్తే పాజిటివ్ ఫీల్ కలిగేది. హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్ సపోర్టివ్ గా ఉన్నారు. ఇవాళ మా టీమ్ అంతా హ్యాపీగా మాట్లాడుతున్నాం అంటే కారణం మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాం. మమ్మల్ని మా ప్రాజెక్ట్ ను నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన పుల్ సపోర్ట్ అందించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ ఏడాది మొదలై ఏడాదిన్నర అయ్యింది. ఇప్పుడు “క” ఫుటేజ్ చూసి బాగుంది అంటున్నాం గానీ మా ప్రొడ్యూసర్ గారు కథ విన్నప్పుడే సినిమా మీద నమ్మకం ఉంచారు. “క” తో ఒక మంచి మూవీ మీకు ఇవ్వబోతున్నా. మళ్లీ మీ ప్రేమ పొందేందుకు వేచి చూస్తున్నా. “క” ప్రొడక్షన్ వర్క్ అంతా రహస్య చూసుకుంది. సినిమా రీచ్ అయ్యాక మాట్లాడుతా అని చెప్పింది. అందుకే ఇక్కడికి రాలేదు. అన్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – శ్రీ వరప్రసాద్
డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల
మేకప్ – కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ – పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన దర్శకత్వం – సుజీత్, సందీప్

Tfja Team

Recent Posts

Actor Yogesh Kalle in the Pan India Film Trimukha

Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in…

7 hours ago

” త్రిముఖ” జనవరి లో విడుదలకు సన్నాహాలు – హీరో యోగేష్ కల్లె

నటుడు యోగేష్ పాన్ ఇండియన్ ఫిల్మ్ "త్రిముఖ"తో తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడు, ఇందులో నాజర్, సిఐడి ఆదిత్య…

7 hours ago

‘వికటకవి’ ట్రైల‌ర్‌ విడుద‌ల చేసిన యంగ్ హీరో విశ్వ‌క్ సేన్‌..

ZEE5 లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘వికటకవి’ ట్రైల‌ర్‌ విడుద‌ల చేసిన యంగ్ హీరో విశ్వ‌క్ సేన్‌.. నరేష్ అగస్త్య, మేఘా…

7 hours ago

Mass Ka Das Vishwak Sen unveiled the trailer of Vikkatakavi

~ Telangana's first detective series, ‘Vikkatakavi’ premieres on November 28 on ZEE5 ~ ~ Produced…

7 hours ago

Dhoom Dhaam is pure entertainment Chetan Krishna

The movie Dhoom Dhaam stars Chetan Krishna and Hebah Patel in the lead roles. Sai…

8 hours ago

“ధూం ధాం” సినిమాలో ఉండేదంతా ప్యూర్ ఎంటర్ టైన్ మెంట్చే తన్ కృష్ణ

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్,…

8 hours ago