Categories: English

‘కల్కి 2898 AD’లో అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్

– అశ్వత్థామ ఇప్పటికీ నర్మదా ఘాట్ నెమావార్ మైదానంలో నడుస్తాడని నమ్మకం

ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ అప్ కమింగ్ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. ‘కల్కి 2898 AD’లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాత్రను అశ్వత్థామగా మధ్యప్రదేశ్‌లోని పవిత్ర నగరమైన నెమావార్‌లో మాసీవ్ ప్రొజెక్షన్ ద్వారా లాంచ్ చేశారు. అభిమానులు, స్థానికులు, మీడియా నుండి అపారమైన ప్రేమ, అద్భుతమైన స్పందన లభించింది.

అమితాబ్ బచ్చన్ పాత్ర లాంచ్ కు లొకేషన్‌గా నెమావర్‌ను ఎంచుకోవడం దాని ప్రాముఖ్యతను మరింత గొప్పగా చాటింది. ఎందుకంటే అశ్వత్థామ ఇప్పటికీ నెమవార్‌లో నడుస్తున్నాడని నమ్ముతారు.

అమితాబ్ బచ్చన్ తన పాత్ర గ్లింప్స్ ని సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ “ అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ చిత్రం మరెవ్వరికీ లేని అనుభవాన్ని తనకు పంచింది’అంటూ ట్వీట్‌ చేశారు.

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కల్కి 2898 AD’ గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌లో గ్లింప్స్ ని లాంచ్ చేసి ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న  బహుభాషా చిత్రం ‘కల్కి 2898 AD’ మైథాలజీ ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago