యంగ్ హీరో కౌశిక్ బాబు, శాన్వి మేఘన జంటగా శ్రీమాన్ గువ్వడవెల్లి దర్శకత్వంలో ఎస్ 3 క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై రచయిత డా. సదానంద్ శారద…
సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్చేస్తోంది 'రుద్రంగి'. ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, కవి, గాయకుడు, రాజకీయవేత్త శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్…
వెర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్న చిత్రం ‘జిగర్‌తండా 2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.…
బెల్లంకొండ గణేష్, రాఖీ ఉప్పలపాటి,‘నాంది’ సతీష్ వర్మ, ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్స్ 'స్వాతిముత్యం' ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమా ''నేను స్టూడెంట్ సార్!' తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఎస్వీ2 ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని 'నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ''నేను స్టూడెంట్ సర్!' టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు, మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మాయే మాయే లిరికల్ వీడియోను లాంచ్ చేశారు. క్యాచి ట్యూన్ తో ఆకట్టుకునే మెలోడీ గా ఈ పాటని స్వరపరిచారు మహతి స్వర సాగర్. మహతితో పాటు కపిల్ కపిలన్ ఈ పాటని మ్యాజికల్ గా ఆలపించారు. కృష్ణ చైతన్య సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథానాయకుడు గణేష్ కి అవంతిక దస్సానిపై ఉన్న ప్రేమను ఈ పాట వర్ణిస్తుంది. శ్రోతలను ఆకట్టుకోవడానికి కావాల్సిన అన్ని అంశాలు మాయే మాయే పాటలో వున్నాయి. మహతి మొదటి పాటతోనే చార్ట్ బస్టర్ నెంబర్ ని అందించారు. గణేష్, అవంతిక ఇద్దరూ తెరపై కూల్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథను కృష్ణ చైతన్య అందించారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు. సాంకేతిక విభాగం దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి నిర్మాత: ‘నాంది’ సతీష్ వర్మ సంగీతం: మహతి స్వర సాగర్ డీవోపీ: అనిత్ మధాడి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ కథ: కృష్ణ చైతన్య డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి కొరియోగ్రఫీ: రఘు మాస్టర్ ఫైట్స్: రామకృష్ణన్…
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' ను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో…
అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో.. సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మనోజ్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘14 డేస్ లవ్’. నాగరాజ్ బొడెమ్ దర్శకత్వంలో డి.…
పదిహేనేళ్లకు పైగా పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూటర్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు మిక్కిలినేని సుధాకర్. ఇప్పుడు ఆయన భారీ బడ్జెట్…
హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ రెండవ రోజు నీరుస్ న్యూ వెడ్డింగ్ కలెక్షన్స్ లో బాలీవుడ్ నటి చిత్రన్గదా సింగ్ మరియు విక్రమ్ ఫండింస్(Vikram Phadins) కలెక్షన్స్…
హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది.'ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో 'మట్టి కుస్తీ' ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రవితేజ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దర్శకులు సుధీర్ వర్మ, వంశీ, జ్వాలా గుత్తా తదితరులు వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రవితేజ, విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జ్వాలా గుత్తా చిత్రంలోని చల్ చక్కని చిలక పాటకు వేదికపై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనంతరం మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ..'మట్టి కుస్తీ'కి పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జస్టిన్ ప్రభాకరన్ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. తనతో సినిమా కూడా చేయాలని విష్ణుతో చెప్పాను. రిచర్డ్స్ వండర్ ఫుల్ కెమరామెన్. దర్శకుడు చెల్లా అయ్యావు కథ చెప్పినపుడు చాలా ఎంజాయ్ చేశాను. తన సెన్స్ ఆఫ్ హ్యుమర్ బావుంటుంది. తనతో ఓ సినిమా మాత్రం చేయాలి. అందం, ప్రతిభ కలిపితే ఐశ్వర్య లక్ష్మీ. ఇందులో ఆమె పాత్రని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విశాల్, ఐశ్వర్య కెమిస్ట్రీ స్టన్నింగా వుంటుంది. ఇది కేవలం స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు. ఎమోషన్, ఫ్యామిలీ, లవ్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ వున్నాయి. ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ ఈ రెండు టీములు సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధులు అభిమానులే. హీరోగా ఎంతో సపోర్ట్ చేశారు. నిర్మాతగా కూడా సపోర్ట్ చేసేయండి. విష్ణు విశాల్ పాజిటివ్ పర్శన్. ఫస్ట్ మీటింగ్ లోనే విశాల్ నాకు ఎప్పటి నుండో తెలుసనే ఫీలింగ్ కలిగింది. అన్నీ సింగిల్ సిట్టింగ్ లోనే మొదలైపోయాయి. సినిమా చాలా బావొచ్చింది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 2న థియేటర్లో కలుద్దాం'' అన్నారు విష్ణు విశాల్ మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ' డిసెంబర్ 2 థియేటర్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. చాలా ఆనందంగా వుంది. రవితేజ గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయనది చాలా మంచి మనసు. ఒక్క మీటింగ్ లోనే నాపై పూర్తి నమ్మకం ఉంచారు. జ్వాలా నన్ను తెలుగు సినిమాలు చేయాలనీ చెప్పేది. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ని ప్రేమిస్తారు. రవితేజ గారి లాంటి గొప్ప వ్యక్తి సపోర్ట్ తో మీ ముందుకు వస్తున్నాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఆడ మగ సమానమనే సందేశాన్ని చాటే సినిమా ఇది. మహిళా ప్రేక్షకులు సినిమాని చాలా ఇష్టపడతారు. డిసెంబర్ 2న అందరూ థియేటర్ కి వెళ్లి 'మట్టి కుస్తీ' చూడాలి'' అని కోరారు. ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ'చక్కని సినిమాని నిర్మించిన రవితేజ గారు, విష్ణు విశాల్ గారికి కృతజ్ఞతలు. డిసెంబర్ 2న మీ ఫ్యామిలీ అందరికీతో కలసి థియేటర్లో 'మట్టి కుస్తీ' ని చూసి ఎంజాయ్ చేయండి'' అని కోరారు దర్శకుడు చెల్లా అయ్యావు మాట్లాడుతూ.. రవితేజ గారు 'మట్టి కుస్తీ' ని నిర్మించడం చాలా ఎక్సయిటింగా వుంది. రవితేజ గారి కి తమిళనాడులో కూడా భారీ ఎత్తున అభిమానులు వున్నారు. క్రాక్ సినిమా హౌస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఆ సినిమాని చాలా మంది రీమేక్ చేయాలని భావించారు. అయితే రవితేజ గారు బాడీ లాంగ్వేజ్, స్టయిల్ రిప్లేస్ చేయడం చాలా కష్టం. రవితేజ గారు త్వరగా తమిళ్ లో సినిమా చేయాలి. విష్ణు విశాల్, ఐశ్వర్య అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. ఫ్యామిలీ తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. డిసెంబర్ 2న అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు. జ్వాలా గుత్తా మాట్లాడుతూ.. విష్ణుని తెలుగులో రమ్మని మూడేళ్ళుగా అగుడుతున్నాను. తన చిత్రాల కంటెంట్ బావుటుంది. రవితేజ గారికి ని నేను పెద్ద అభిమానిని. విశాల్ పై రవితేజ గారు మొదటి మీటింగ్ లోనే ఎంతో నమ్మకం ఉంచారు. ఇది చాలా గ్రేట్. 'మట్టి కుస్తీ' కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అవుట్ పుట్ పై చాలా హ్యాపీగా వున్నాం. టీం అందరికీ గుడ్ లక్'' తెలిపారు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ'' సినిమా గురించి నాకు తెలుసు. ఈ సినిమా ఖచ్చితంగా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. 'ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్, టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు వంశీ మాట్లాడుతూ .. 'మట్టి కుస్తీ'' ట్రైలర్ ప్రామెసింగా వుంది. విష్ణు విశాల్ గారు మంచి కంటెంట్ వున్న సినిమాలు చేస్తుంటారు. రవితేజ గారు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఖచ్చితంగా సినిమా ప్రత్యేకంగా వుంటుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు. అజయ్ మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ'లో నెగిటివ్ రోల్ లో కనిపిస్తా, కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. రవితేజ గారు నిర్మించారు మరింత ఎక్సయిటింగా అనిపించింది. విష్ణు విశాల్ విలక్షణమైన కథలు ఎంచుకొని విజయాలు సాధిస్తుంటారు. 'మట్టి కుస్తీ'కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది'' అన్నారు.…
1995లో `తపస్సు` అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి మళ్లీ 27 సంవత్సరాల తరువాత ప్రముఖ పాత్రలో ఒక రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో…