వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు మా బ్రదర్ లా వున్నారు. నేను, ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునే చిత్రమిది: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాల్తేరు వీరయ్య గొప్ప గౌరవాన్ని ఇచ్చింది : దర్శకుడు బాబీ కొల్లి వాల్తేరు వీరయ్య ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ : నిర్మాత నవీన్ యెర్నేని మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) మెగా మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ‘వాల్తేరు వీరయ్య’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ‘వీరయ్య విజయ విహారం’’ సక్సెస్ సెలబ్రేషన్స్ ని వరంగల్ హన్మకొండలో గ్రాండ్ గా నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. భారీ ఎత్తున ప్రేక్షకులు, అభిమానులు హాజరైన వీరయ్య విజయ విహారం’’వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా చిత్ర యూనిట్ కు షీల్డ్స్ ప్రధాన కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నాం కానీ నాన్ బాహుబలి, నాన్ ఆర్ఆర్ఆర్ స్థాయి సినిమా అవుతుందని మేము ఊహించలేదు. నాన్ ఎస్ఎస్ఆర్ సినిమాల రికార్డ్స్ కి వచ్చిందంటే.. ఇంత గొప్ప విజయానికి అగ్ర తాంబూలం ఇవ్వాల్సింది ప్రేక్షకులకే. ప్రేక్షకుల హృదయపూర్వక కృతజ్ఞతలు. వాల్తేరు వీరయ్య 250 కోట్ల గ్రాస్ కి చేరబోతుందంటే అది ఆషామాషీ విషయం కాదు. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలని అనుకున్నారో అలా మళ్ళీ తెరపై చూస్తూ ఒక ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ ఇలాంటి సినిమాలని గుర్తు చేసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి ఫీలింగ్ మీకు నాకు కలిగించడానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ. నాపై అభిమానంతో బాబీ ఇండస్ట్రీకి రావడం, ఎప్పటికైనా నాతొ సినిమా చేయాలనీ కోరుకోవడం... అది మామూలు సినిమా కాలేదు. ఖైదీ సినిమా నాకు ఎలాంటి స్టార్ డమ్ తీసుకొచ్చిందో .. దర్శకుడిగా బాబీని వాల్తేరు వీరయ్య ఒక స్టార్ డైరెక్టర్ ని చేసింది. బాబీ ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం బాబీ పని చేసిన తీరుకు నేను అభిమాని అయిపోయాను. ఎక్కడ్డా వృధా లేకుండా బాబీ సినిమా చేశాడు. ఈ విషయంలో బాబీని యువ దర్శకులు స్ఫూర్తిగా తీసుకోవాలి. రవితేజ ని చూస్తే నాకు మరో పవన్ కళ్యాణ్ గా అనిపిస్తాడు. రవితేజతో ఇందులో కీలకమైన సన్నివేశం చేస్తున్నపుడు నాకు పవన్ కళ్యాణ్ నే గుర్తుకు వచ్చాడు. పవన్ అని ఊహించుకొని ఆ సీన్ చేశాను. అందుకే అది అంత అద్భుతంగా పండింది. అలాగే వాల్ పోస్టర్ సీన్ లో కూడా నా తమ్ముడిలానే చేశాను. షూటింగ్ చేస్తున్నపుడే థియేటర్ లో ప్రేక్షకుల స్పందన ఎలా వుంటుందో ఊహించుకుంటాను. విజల్స్ చప్పట్లు నాకు చెవిలో మ్రోగుతూనే వుంటాయి. అభిమానుల అందించే ప్రోత్సాహం వలనే ఇంత ఉత్సాహంగా వుండగలుగుతున్నాను.ఇలాంటి వీరయ్యలు ఎన్నైనా చేసే సత్తా ప్రేక్షకులు అభిమానులు ఇస్తున్నారు. దీనికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియస్తున్నాను. రంగస్థలం చేస్తున్నపుడు మైత్రీ మూవీ మేకర్స్ గురించి చరణ్ చెప్పేవాడు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలని చెప్పేవాడు. నేను మళ్ళీ సినిమాలు చేస్తే మాతో సినిమా చేసే అవాశం ఇవ్వండని మైత్రీ నిర్మాతలు కోరారు. అప్పుడే మాట ఇచ్చాను. ఇప్పుడు వాల్తేరు వీరయ్యతో ఓ అద్భుతమైన విజయంతో ఇది జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు నిజమైన నిర్వచనంగా నిలబడ్డారు. వారికి సినిమా అంటే ప్రేమ. ఖర్చు గురించి ఎక్కడా అలోచించరు. ఈ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో వచ్చాయి అంటే దానికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలే. డీవోపీ ఆర్ధర్విల్సన్ చాలా అందంగా చూపించాడు. దేవిశ్రీ ప్రసాద్ మాస్, మెలోడీ, ఊరమాస్ నెంబర్స్ ఇచ్చాడు. రామ్ లక్ష్మణ్ పీటర్ హెయిన్స్ శేఖర్ మాస్టర్ అందరూ అద్భుతంగా చేశారు. శ్రుతి హాసన్ అద్భుతంగా చేసింది. అలాగే ప్రకాష్ రాజ్, నాజర్ , సత్యరాజ్.. కోన వెంకట్, రైటర్ టీం, జి కే మోహన్ .. మిగతా సాంకేతిక నిపుణులు అందరూ చాలా ప్రేమతో ఈ సినిమా చేశారు. ఈ వేడుకకు వచ్చిన మంత్రి దయాకర్ రావు గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు’’ తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. బ్లాక్ బస్టర్ నిర్మాతలు నవీన్ గారు, రవి గారికి అభినందనలు. నాకు రంగస్థలం లాంటి మైల్ స్టోన్ మూవీ ఇచ్చారు. నాకే కాదు వారితో పని చేసిన ప్రతి హీరోకి బ్లాక్ బస్టర్ ఇచ్చే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. సినిమా అంటే అంకితభావం వున్న నిర్మాతలు. నిజంగా దమ్మున్న నిర్మాతలు. బాబీ గారికి బిగ్ కంగ్రాట్స్. వాల్తేరు వీరయ్య చూశాను ప్రతి ఫ్రేం ని అద్భుతంగా మలిచారు బాబీ.. చిరంజీవి గారు మా నాన్న గారి లాలేరు.. మా బ్రదర్ లా వున్నారు. నేను ఇక్కడికి ఒక అభిమానిగా వచ్చాను. ఈ సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేశానో మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. రవితేజ గారి తో ఒక డీప్ సీరియస్ క్యారెక్టర్ చేయించి దానిని కూడా మేము ఎంజాయ్ చేసేలా చేశాడు బాబీ. నిజంగా పూనకాలు లోడింగ్. నాతో పాటు అభిమానులందరికీ వాల్తేరు వీరయ్య గుర్తుండిపోయే చిత్రం. దేవిశ్రీ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. చిరంజీవి గారి కుటుంబంతో మాకు ఎంతో మంచి అనుబంధం వుంది. అలాగే చిత్ర నిర్మాత నవీన్ కూడా మాకు మంచి స్నేహితులు. నవీన్ చిత్ర పరిశ్రమలో మంచి విజయాలు అందుకోవడం ఆనందంగా వుంది. చిరంజీవి గారు రామ్ చరణ్ గారు వరంగల్ లో స్టూడియో పెట్టె ఏర్పాటు చేయాలని కోరుతన్నాను. ప్రభుత్వం తరపున సాయం చేయడానికి మేము సిద్ధంగా వున్నాం’’ అన్నారు. బాబీ కొల్లి మాట్లాడుతూ.. 'వాల్తేరు వీరయ్య' పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చిరంజీవి అన్నయ్య జడ్జ్ మెంట్ తో ముందే నమ్మకం వచ్చింది. మా నాన్న గారు చిరంజీవి గారికి పెద్ద అభిమాని. నాన్న కాలం చేసిన తర్వాత వెంటనే షూటింగ్ కి రాగలిగానంటే దీనికి కారణం చిరంజీవి గారు. నాన్న గారికి నాలుగు నెలలు ముందే ఈ సినిమా రిజల్ట్ ని చెప్పి, మీ అబ్బాయి పెద్ద డైరెక్టర్ కాబోతున్నాడని ఆయనకి సంతృప్తిని ఇచ్చి పంపించిన చిరంజీవి గారికి జీవితాంతం రుణపడి వుంటాను. ప్రతి క్షణం ఈ సినిమాని ప్రేమించి ఈ సినిమా చేశాను. మా చిరంజీవి ని మాకు ఇచ్చావు అనే మాట అన్నయ్య అభిమానుల నుండి వింటూనే వున్నాను. వీరయ్య ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇదంతా అన్నయ్య వలనే సాధ్యమైయింది. అన్నయ్య పై అభిమానంతో హైదరాబాద్ కి వచ్చి అన్నయ్య కెరీర్ లో నిలిచిపోయే వాల్తేరు వీరయ్యకి దర్శకుడు కావడం నా అదృష్టం. రవితేజ లేకుండా వాల్తేరు వీరయ్య లేదని అన్నయ్య అన్నారు. అది నిజం. అన్నయ్య పై ప్రేమతో రవితేజ గారు ఈ సినిమానిచేశారు. దేవి శ్రీ ప్రసాద్ కి కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ఎంతో ప్రేమించి తీశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. పీఆర్వో వంశీ శేఖర్ కి థాంక్స్. ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే .. ఈ రోజుల్లో సినిమా డిస్ట్రిబ్యుటర్స్ కి బ్రేక్ ఈవెన్ అయితే హిట్ అంటున్నారు. 20 శాతం కమీషన్ వస్తే బ్లాక్ బస్టర్ అంటున్నారు. 20 శాతంకంటే ఓవర్ ఫ్లో వస్తే దీనిని ఏమనాలి ?! ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనాలి. 13 నుండి వాల్తేరు వీరయ్య సర్ప్రైజ్ రిజల్ట్ ఇస్తూనే వుంది. మా అంచనాలకు మించి కలెక్ట్ చేస్తోంది. నా కెరీర్ ఇలాంటి రిజల్ట్ ఎప్పుడూ చూడలేదు. సినిమా విడుదలైనప్పటి నుండి ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకి చిరంజీవి గారికి కాల్ చేయడం, అద్భుతమైన రిజల్ట్ గురించి మాట్లాడుకోవడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. చిరంజీవి గారు ఈ సినిమా ‘ఖైదీ’ అంత విజయం అవుతుందని ఒకసారి మెసేజ్ పెట్టారు. నిజంగా అంత పెద్ద విజయం అవుతుందా అనే చిన్న అనుమానం వుండేది. కానీ నిజంగానే ఖైదీ తర్వాత అంత పెద్ద విజయం వాల్తేరు వీరయ్య అందుకుంది. చాలా ఆనందంగా వుంది. మాకు ఇంత విజయాన్ని ఇచ్చిన చిరంజీవి గారికి, బాబీకి, రవితేజ గారికి.. అందరికీ కృతజ్ఞతలు. ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిధిగా వచ్చిన రామ్ చరణ్ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు బివిఎస్ రవి మాట్లాడుతూ.. చిరంజీవి గారిని చూస్తూనే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎన్ని విజయాలు, ఇండస్ట్రీ హిట్లు కొట్టినా నేల పైనే వుండే వ్యక్తిత్వం ఆయనది. దర్శకులకు ఆయన గొప్ప గైడెన్స్. ఆయన ఏం చెప్పిన వినాల్సిన బాధ్యత మనది. వాల్తేరు వీరయ్యది మాస్ అమ్మా మొగుడు లాంటి విజయం’’అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య 250 కోట్లకు చేరుకుంటుంది. ఇంత గొప్ప విజయానికి వన్ అండ్ ఓన్లీ మెగా స్టార్ చిరంజీవి గారు. దర్శకుడు బాబీ చిరంజీవి గారిపై వున్న ప్రేమతో ఈ సినిమాని ప్రాణం పెట్టి తీశాడు. ఇందులో పని చేసిన అందరూ చిరంజీవి గారిని ప్రేమించి చేశాం. అందుకే ఇంత గొప్ప విజయం సాధ్యమైయింది. మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు. కెచక్రవర్తిరెడ్డి మాట్లాడుతూ.. వీరయ్య స్క్రీన్ ప్లే ని ఒక కేస్ స్టడీ గా తీసుకోవాలని చిరంజీవి గారు చెప్పడం బిగ్గెస్ట్ కాంప్లీమెంట్. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక స్క్రీన్ ప్లే రైటర్ గా రవితేజ గారితో హ్యాట్రిక్ కొట్టాను. మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్స్’’ అన్నారు. రోల్ రిడ, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సమీర్, శకల శంకర్, రచ్చరవి, ప్రవీణ్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
అరవింద్ కృష్ణ రజత్ రాఘవ్ హీరోలుగా నటాషాదోషి ప్రధాన పాత్ర పోషించిన కొత్త చిత్రం "యస్. ఐ. టి. "(S.I.T... ) ఫస్ట్ లుక్ విడుదల ఎస్ఎన్ఆర్…
మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌తో కలిసి…
కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో.ప్రస్తుతం శివ రాజ్‌కుమార్ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్‌కుమార్ కి చాలా ప్రత్యేకమైన…
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘కబ్జా’. శాండిల్‌వుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కోసం అందరూ ఎంతో…
*జాతీయ అవార్డ్ గ్రహీత, గీత రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన గీతం. శ్రీశ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు గీత రచయిత…
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోలా శంకర్” షూటింగ్ ఈరోజు పునఃప్రారంభమైంది. మెగా బ్లాక్‌బస్టర్…
"శుక్ర", "మాటరాని మౌనమిది" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న సుకు పూర్వాజ్. కమర్షియల్ గా రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈ యంగ్ టాలెంటెడ్…
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం 'హను-మాన్'. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్ర…
HIT2తో డబుల్ హ్యాట్రిక్ హిట్ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవలే తన తదుపరి ప్రాజెక్ట్ గా గూఢచారి సీక్వెల్ అయిన G2ని అనౌన్స్ చేశారు. గూఢాచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు. “మేజర్”ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముంబైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాట “ప్రీ విజన్” వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఫార్మల్ అవుట్ ఫిట్ లో స్లిక్ అండ్ స్టైలిష్ లుక్ లో ఉన్న శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అడివి శేష్ మేకోవర్ అయ్యారు. ప్రీ-విజన్ విషయానికి వస్తే, శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో అతని ఫస్ట్ లుక్ ని ప్రజంట్ చేశారు. 2023లో షూటింగ్ ప్రారంభమవుతుందని అనౌన్స్ చేశారు. కథ, మేకింగ్, సాంకేతిక ప్రమాణాలు, ఇంటర్నేషనల్ టీం పరంగా G2 అద్భుతంగా ఉంటుంది. పోస్టర్, ప్రీ-విజన్ లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. తారాగణం: అడివి శేష్ సాంకేతిక సిబ్బంది: దర్శకుడు: వినయ్ కుమార్ సిరిగినీడి కథ: అడివి శేష్ నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పీఆర్వో: వంశీ-శేఖర్ మార్కెటింగ్: ఫస్ట్ షో