శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో…
'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్.. ఆద్యంతం ఒక ఫన్ రైడ్ లా వుంటుంది ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఎ ఎం బీ మాల్ లో ప్రమోషన్ ప్లాన్ ఎవరిది ? ఎ ఎం బీలో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని షూట్ చేయడానికి వెళ్లాం. అయితే సినిమా వస్తుందని ఎంతమందికి తెలుసనే ఒక ఆలోచన వచ్చి షూట్ చేయమని చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్టొరీ ఐడియా ఎప్పుడు వచ్చింది ? లాక్ డౌన్ సమయంలో అందరికీ తీరిక దొరికింది. అప్పుడే చాలా మంచి యూట్యూబ్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఆ సమయంలో ఎలాగూ బయటికి వెళ్ళలేం కాబట్టి కనీసం ట్రావెల్ వీడియోస్ చూస్తే బయటికి వెళ్ళిన ఫీలింగ్ వుంటుందని ఎక్కువగా ట్రావెల్ వ్లాగ్ వీడియోస్ చూశాను. అది చాలా నచ్చింది. ప్రదేశాలు గురించి, వాటి చరిత్ర గురించి చెప్పడం చాలా ఇంట్రస్టింగా అనిపించింది. ఒక యూట్యుబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన మొదలైయింది. ట్రావెల్ వ్లాగర్ కి వున్న కష్టాలు, ప్రమాదాలు, సవాళ్ళు బ్యాక్ డ్రాప్ లో సినిమాని ప్లాన్ చేశాం. ట్రావెల్ వ్లాగ్, యూట్యుబర్ లైఫ్ తో లిమిటెడ్ ఆడియన్స్ రిలేట్ చేసుకుంటారు కదా ? కామన్ ఆడియన్స్ కి ఈ కథ ఎంత రిలేటెడ్ గా వుంటుంది ? లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ చాలా హిలేరియస్ గా వుంటుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్ . వీరి మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ట్రావెల్ వీడియోలు షూట్ చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదం ఎదురుకున్నారనేది కూడా చాలా ఇంటరెస్టింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకూ ఒక లాఫ్ రైడ్ లా వుంటుంది. అండర్ కరెంట్ గా ఒక సమస్య రన్ అవుతూనే .. ఆ పరిస్థితి నుండి వచ్చే సిట్యువేషనల్ కామెడీ అద్భుతంగా వుంటుంది. మీ సినిమాల్లో స్క్రీన్ ప్లే స్పెషల్ ఎట్రాక్షన్ కదా.. మరి ఇందులో ఎలా వుంటుంది ? లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా వుంటుంది. ప్రతి పదిహేను నిమిషాలకు కథలో ఒక చేంజ్ ఓవర్, మలుపు వుంటుంది. సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా వుంటుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో ఎలా చేశారు ? సంతోష్ శోభన్ తో ఏక్ మినీ కథ చేశాను. అందులో తన నటన బాగా నచ్చింది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో ఒక యూట్యుబర్ గా యంగ్ యాక్టర్ కావాలని సంతోష్ తో కథ చెప్పడం జరిగింది. తనకి చాలా నచ్చింది. అలాగే జాతిరత్నాలు తర్వాత ఫారియా ఈ సినిమా చేసింది. తను సహజంగా ఎలా వుంటుందో సినిమాలో కూడా అలానే కనిపించింది. ఇద్దరూ పర్ఫెక్ట్ గా సరిపోయారు. సుదర్శన్, బ్రహ్మాజీ పాత్రల గురించి ? సుదర్శన్ ట్రావెల్ వ్లాగ్ షూట్ చేసే డివోపీ గా దాదాపు సినిమా అంతా ఉంటాడు. ఈ పాత్ర లో…
జాన్వీ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మిలి’. మాతుకుట్టి గ్జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. నవంబర్ 4న సినిమా రిలీజ్…
యంగ్ హీరో నవీన్ చంద్ర కథానాయకుడిగా భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాణంలో ‘దండు పాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. నవంబర్…
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం చేస్తూ హీరో గా నటిస్తున్న చిత్రం "నమస్తే సేట్ జీ".స్వప్న చౌదరి, సాయి కృష్ణ,…
శ్రీ లక్ష్మి పిక్చర్స్ పతాకంపై, తాన్యా, గిరీష్ మరియు కే కే, ముఖ్య తారాగణం తో ఉదయ్ కుమార్ సి హెహ్ దర్శకత్వంలో బి బాపిరాజు నిర్మిస్తున్న…
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్' తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు జయతీర్థ విలేఖరుల సమా'వేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. 'బనారస్' సినిమా ఎలా మొదలైయింది ? నా గత చిత్రం బెల్ బాటమ్ 2019 ఫిబ్రవరి లో విడుదలైయింది. మార్చ్ నెలలో ఎన్ కె ప్రొడక్షన్స్ హౌస్ జైద్ ఖాన్ ని లాంచ్ చేయమని నన్ను సంప్రదించింది. జైద్ ఖాన్ కు పొలిటికల్ గా ఒక స్టార్ ఇమేజ్ వుంది. జైద్ నాన్నగారు జమీర్ అహ్మద్ ప్రముఖ రాజకీయ నేత. జైద్ ని లాంచ్ చేయడం అంటే ఒక ఒత్తిడి వుంటుంది. అయితే ఒక దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛకావాలి, ఎలాంటి ఒత్తిళ్ళు వుండకూడదని వారిని కోరాను. నా కోరికని అంగీకరించారు. నాకు పూర్తి స్వేఛ్చని ఇచ్చారు. ఒక ప్రేమకథని వైవిధ్యంగా ప్రజంట్ చేయాలని భావించాను. నేను చెప్పిన కథ జైద్ కిచాలా నచ్చింది. మూడు నెలలు స్క్రీన్ ప్లే రాశాను. నేను నాటకరంగం నుండి సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి రాకముందు నటనలో శిక్షణ ఇచ్చేవాడిని. ఇది కొత్త వారితో సినిమాలు చేసినప్పుడు ఉపయోగపడింది. ఈ సినిమాలో పాత్రకి తగ్గట్టు జైద్ కి శిక్షణ ఇచ్చాను. అలాగే ఈ సినిమా కోసం కాశీ, బనారస్ పర్యటించిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాను. 'బనారస్' ట్రైలర్ చూసిన తర్వాత టైం ట్రావెల్ సినిమా అనిపించింది. మరి ఇందులో ఫ్రెష్ ఎలిమెంట్ ఏమిటి ? 'బనారస్' కేవలం టైం ట్రావెల్ సినిమా కాదు. ఒక ఒక ప్రేమకథ. రొమాంటిక్ స్టొరీ. అలాగే థ్రిల్లర్. వీటిలో టైం ట్రావెల్, టైం లూప్, పునర్జన్మ ఎలిమెంట్స్ కూడా వుంటాయి. స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా వుంటుంది. చాలా మిస్టికల్ డివైన్ అంశాలు వుంటాయి. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. జైద్ ఖాన్ లాంటి కొత్త నటుడితో సినిమా చేయడం ఎలా అనిపించింది ? బెల్ బాటమ్ చేసినపుడు రిషబ్ శెట్టి కూడా కొత్తే. రిషబ్ శెట్టి మంచి దర్శకుడు. అయితే హీరోగా అదే అతనికి తొలి సినిమా. ఆ పాత్రకి తగ్గట్టు అతన్ని మలచుకున్నా. ఇప్పటి వరకూ ఏడు సినిమాలు చేస్తే నాలుగు సినిమాల్లో కొత్తవారితోనే చేశాను. నేను యాక్టింగ్ టీచర్ కావడం వలన కొత్త వారితో చేయడం సులువు. నా పాత్రలకు తగ్గట్టు మలుచుకోగలను. ఇప్పటివరకూ నేను శిక్షణ ఇచ్చి, లాంచ్ చేసిన నటీనటులు లంతా మంచి స్థాయిలో వున్నారు. జైద్ కూడా తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను. 'బనారస్' షూటింగ్ ఎదుర్కున్న సవాళ్లు ఏంటి ? 90 శాతం షూటింగ్ బనారస్ లోనే చేశాం. 2019 సెప్టెంబర్ లో షూటింగ్ వెళ్లినపుడు వరదలు వచ్చాయి. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో షూటింగ్ చేశాం. అయితే 2,3 డిగ్రీల ఉష్ట్నోగత వద్ద షూట్ చేయడం ఒక సవాల్. అయితే స్థానికులు చాలా సహకరించారు. లాక్ డౌన్ కి ముందే రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ ఎత్తిన తర్వాత పాటలు షూట్ చేశాం. సెన్సార్ పూర్తయిన తర్వాత మా నిర్మాతలు సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. నిజానికి బనారస్ యూనివర్సల్ అప్పీల్ వున్న కంటెంట్. భారీ నిర్మాణ , సాంకేతిక విలువలతో తెరకెక్కించారు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో మరికొన్ని మార్పులు చేశాం. ఫైనల్ ప్రాజెక్ట్ అద్భుతంగా వచ్చింది. ట్రైలర్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. వైజాగ్, హైదరాబాద్ వెళ్ళినపుడు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కదా ? అవును.. తెలుగు ప్రేక్షకుల గొప్పదనం ఇది. కంటెంట్ నచ్చితే భాషలకు అతీతంగా ఆదరిస్తారు. బనారస్ ట్రైలర్ పాటలు వారికి నచ్చాయి. నా బెల్ బాటమ్ సినిమాని కూడా ఓటీటీలో పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు జైద్ లాంచింగ్ కి ముందే గొప్ప ప్రేమని పంచారు. సినిమా చూసిన తర్వాత మరింతగా ప్రేమిస్తారు. సినిమాని చూసిన తర్వాత మంచి పాజిటివ్ కంటెంట్ ని చుశామనే ఆనందం ప్రేక్షకుల్లో కలుగుతుందనే నమ్మకం వుంది. కెజియఫ్, కాంతార.. చిత్రాలతో కన్నడ పరిశ్రమ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది ? చాలా ఆనందంగా వుంది. కెజియఫ్, కాంతార, 777 చార్లీ, విక్రాంత్ రోణ చిత్రాలు దేశవ్యాప్తంగా మంచి పేరుతెచ్చుకున్నాయి. కన్నడ నుండి వచ్చే సినిమాలని ప్రేక్షకులు ఇప్పుడు నోటీస్ చేస్తున్నారు. 'బనారస్' కూడా మంచి కంటెంట్ వున్న చిత్రం. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే ఎక్సయిమెంట్ వుంది.…
మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగానిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ'. ఆర్ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు రవితేజ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్‌లో విష్ణు విశాల్ స్టార్ రెజ్లర్‌గా రింగ్‌లో బిగ్ ఫైట్ కి రెడీ అవుతున్నట్లుగా కనిపించారు. రెజ్లింగ్ డ్రెస్ లో, కండలు తిరిగిన శరీరంతో ఆకట్టుకున్నాడు విష్ణు విశాల్. మట్టి కుస్తీ కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు. మట్టి కుస్తీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తారాగణం: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: చెల్లా అయ్యావు నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్ బ్యానర్లు: ఆర్ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ డీవోపీ: రిచర్డ్ ఎం నాథన్ సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ ఎడిటర్: ప్రసన్న జికె ఆర్ట్ డైరెక్టర్: ఉమేష్ జే కుమార్ లిరిక్స్: వివేక్ పీఆర్వో వంశీ-శేఖర్
యంగ్ టాలెంట్ సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లైక్ షేర్ సబ్స్క్రైబ్ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. వైవిధ్యమైన ప్రచారంతో ఈసినిమా మీద…
ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలోసిహెచ్ క్రాంతి కిరణ్ సహకారం తో అదిరే అభి ( అభినవ కృష్ణ ) ఆమీక్షా పవార్,ప్రగ్య నాయన్, సోనాక్షి…