మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్,…
‘మీటర్’ లో మాస్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బలమైన ఎమోషన్స్ వుంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో తెలుగులో లాంచ్ కావడం నా అదృష్టం: అతుల్య రవి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన మీటర్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అతుల్య రవి విలేఖరుల సమావేశంలో 'మీటర్' విశేషాలని పంచుకున్నారు. 'మీటర్'తో తెలుగు పరిశ్రమలోకి రావడం ఎలా అనిపిస్తోంది ? తెలుగు పరిశ్రమలోకి రావాలని బలంగా కోరుకున్నారు. దేవుడి దయ వలన మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి ప్రముఖ సంస్థ నిర్మిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాలో అవకాశం రావాడం చాలా ఆనందంగా వుంది. కథ చెప్పినప్పుడే చాలా నచ్చింది. అంతకుమందే కిరణ్ అబ్బవరం గారి ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా కూడా చూశాను. చాలా నచ్చింది. కథలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమిటి ? మీటర్ పక్కా కమర్షియల్ మూవీ. ఇందులో అద్భుతమైన ఎమోషన్స్ కూడా వున్నాయి. ఒక కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ వున్నపుడు అందరూ కనెక్ట్ అవుతారు. పాటలు కూడా చాలా బావుంటాయి. భారీ సెట్ లో ఒక సాంగ్ చేశాం. డ్యాన్సులు కూడా బావుంటాయి. మాస్ ఫైట్స్ రోమాన్స్ లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో పాటు ఫాదర్ సెంటిమెంట్ కీలకంగా వుంటుంది. తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు ? మీటర్ చేస్తున్నప్పుడే (నవ్వుతూ). సినిమాలు చూస్తూ.. టీంతో మాట్లాడుతున్నపుడు అలా వచ్చేసింది. ఇంకా చక్కగా నేర్చుకోవాలి. మీటర్ లో మీ పాత్రలో ఎలా వుంటుంది ? ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుంది. అబ్బాయిలు అంటే ఇష్టం లేని పాత్రలో కనిపిస్తాయి. నా పాత్ర సీరియస్ గా వుంటుంది. కానీ అందులో నుంచే కామెడీ జనరేట్ అవుతుంది. నా పాత్ర ఫస్ట్ హాఫ్ లో చాలా కామెడీ వుంటుంది. చమ్మక్ చమ్మక్ పోరి పాటలో డ్యాన్స్ చాలా బాగా చేశారు కదా ? నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళు నేర్పించలేదు. అయితే డ్యాన్స్ అంటే చాలా ఆసక్తి. ఎవరైన నేర్పితే మాత్రం ఎలాంటి మూమెంట్స్ అయిన చాలా త్వరగా నేర్చుకుంటాను. ఈ పాత్ర మీ నిజ జీవితానికి దగ్గరగా వుంటుందా ? లేదండీ. ఇది పూర్తిగా భిన్నం. ఇది మీకు కొత్త పరిశ్రమ కదా.. దీనికి అలవాటు పడటానికి ఎంత సమయం పట్టింది ? నాకు అలాంటి ఫీలే లేదండీ. కథ విన్నప్పుడే చాలా కంఫర్ట్ బుల్ అనిపించింది. లుక్ టెస్ట్ అయిన తర్వాత నేరుగా షూటింగ్ కి వెళ్ళాం. కిరణ్ గారు కూడా చాలా ఫ్రండ్లీ. తనలాగే నేను కూడా షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ మూవీ చేసే వచ్చాను. ఆ కామన్ కనెక్షన్ మొదటి నుంచి వుంది. మేము ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుకుంటాం. ఇందులో కిరణ్ – మీ పాత్ర కెమిస్ట్రీ ఎలా వుంటుంది? కిరణ్ – నాకు వున్న కాంబినేషన్ సీన్స్ చాలా సరదాగా వుంటాయి. హీరోయిన్ ఫాలో చేసి టీజ్ చేయడం, ప్రేమించడం.. ఇలా హిలేరియస్ గా ఉంటుంది. మరో కోణంలో ఎమోషన్స్ ఫైట్స్ మాస్ వుంటుంది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న ఈ సినిమాని కిరణ్ అద్భుతంగా చేశారు. ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి.…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం RC15కి `గేమ్ చేంజర్` అనే టైటిల్‌ను…
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ చిత్రం #BoyapatiRAPO శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అన్ని…
అల్లరి నరేష్ , విజయ్ కనకమేడల టీమ్ వర్క్ తెలుగులో క్రేజీ కాంబినేషన్‌లో ఒకటిగా మారుతోంది. వీరిద్దరు కలిసి చేసిన మొదటి చిత్రం ‘నాంది’ విమర్శకుల ప్రశంసలతో…
రష్మిక మందన ప్రధాన పాత్రలో బ్రీజీ రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్ 'రెయిన్‌బో' చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు…
నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న దసరా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సందర్భంగా హీరో నేచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో దసరా బ్లాక్ బస్టర్ విశేషాలని పంచుకున్నారు. దసరా విజయం ఎలా అనిపించిది ? సినిమా చూసిన వారంతా గొప్పగా స్పందిస్తున్నారు. విడుదలైనప్పటి నుంచి నా ఫోన్ మ్రోగుతూనే వుంది. మాట్లాడి చాలా కాలం అయిన వారు కూడా ఎమోషనల్ గా మెసేజ్ లు పెడుతుంటే.. దీని కోసమే సినిమా తీశాం కదా అనిపించిది. చాలా ఆనందంగా వుంది. దసరా లో చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్లు ఏవి ? దసరా లొకేషన్ లో ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ ఏదీ లేదు. అన్నీ చాలా కష్టపడి చేసిన సీన్లే. దుమ్ము, ధూళి, వేడి మధ్య పని చేశాం. అయితే బాగా వస్తున్నాయని ఫీలింగ్ మాత్రం అన్ని సీన్లకి వుంది. థియేటర్ లో ఎలా వుంటుందో అని ఎక్సయిటెడ్ గా అనిపించింది మాత్రం దసరా క్లైమాక్స్. ప్రేక్షకులతో కలసి థియేటర్ లో చూడటానికి చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూసాం. ఆన్ లైన్ ఎడిటింగ్ చూసినప్పుడే మేము షాక్ అయ్యాం. మీరు కంప్లీట్ రీరికార్డింగ్ తో చూసేసరికి ఆ ఇంపాక్ట్ ఇంకా పెరిగింది. రామ్ చరణ్ కు రంగస్థలం, అల్లు అర్జున్ కి పుష్ప.. మీకు దసరా అలా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు.. ఈ సినిమా మీలో నటుడికి తృప్తిని ఇచ్చిందా? నటుడిగా నేను ఆనందపడతాను. కానీ తృప్తి పడను. ఎప్పుడు తృప్తి పొందుతామో ఇంకా ప్రయత్నం చేయడంలో అలసత్వం వచ్చేస్తుంది. ఈ సినిమాకే కాదు.. ఏ సినిమాకి తృప్తి పడను. ఆనందం మాత్రం వుంటుంది. దసరా తో టీం అందరికీ మంచి పేరు వచ్చింది. గ్రేట్ ఫీలింగ్. దసరా కథ విన్నప్పుడే దసరా కి ఇంత స్పాన్ వుందని అనుకున్నారా ? ఈ కథ విన్నప్పుడే ఇండస్ట్రీ లో బెస్ట్ టెక్నిషియన్స్ శ్రీకాంత్ కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. సినిమా చేస్తున్నపుడే శ్రీకాంత్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పాను. విడుదలకు ముందే చాలా ఈవెంట్స్ లో శ్రీకాంత్ పేరు గుర్తుపెట్టుకోండని చెప్పాను. మిగతా భాషలల్లో తీసుకురావాలని ఎప్పుడు నిర్ణయించారు ? కథ విన్నప్పుడే. ప్రేమ స్నేహం పగ యూనివర్శల్ గా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్. మన కల్చర్ ని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ఈ సినిమా చేస్తున్నపుడు బతుకమ్మ తో పాటు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి కథ వచ్చినపుడు ఇది మా కల్చర్ చెప్పడం మన బాధ్యత. దినిని అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాంతారతో భూత్ కొళా అనేది కర్ణాటకలో వుందని దేశంలో అందరికీ తెలిసింది. ఇలా మన కల్చర్ ని చెప్పే అవకాశం వచ్చినపుడు దానిని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మాస్ రస్టిక్ సినిమాలు నడుస్తున్నాయి కదా.. ఇలాంటి సినిమా కోసం ఇన్నాళ్ళు ఎదురుచూశారా ? నేను దేని కోసం ఎదురుచూడను. దసరా మాస్ సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా విడుదలకు ముందే దాని నుంచి బయటికి వచ్చేశాను. ఇప్పుడు ఆరేళ్ళ పాపకి తండ్రిగా ఓ సినిమా చేస్తున్న . నేను ఏ బ్రాకెట్ లో పడకూదని భావిస్తాను. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సినిమాలు చేయలనేది నా ఆలోచన. జెర్సీ ఫ్యాన్స్ వున్నారు.. ఇప్పుడు దసరా ఫ్యాన్స్ వున్నారు.. వాళ్లకి సినిమా వుండాలి, వీళ్ళకి సినిమా వుండాలి. నటుడిగా ఈ వైవిధ్యం వుండాలి. దసరా కి నార్త్ నుంచి రెస్పాన్స్ ఎలా వుంది ? చాలా అద్భుతంగా వుంది. చాలా గొప్ప రివ్యూలు వచ్చాయి. చూసిన వారంతా ఈ ఏడాది మా ఫేవరేట్ ఫిల్మ్ దసరా అని చెబుతున్నారు. మేము ఊహించినదాని కంటే అక్కడ ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. మేము ఊహించిన ఓపెనింగ్ వచ్చేసింది. దసరా కి వచ్చింది కొన్ని స్ట్రయిట్ హిందీ సినిమాలకి కూడా రాలేదు. రోజురోజుకి పెరుగుతోంది. మీ గత సినిమాల విజయాలకి మాస్ దసరా విజయానికి ఎలాంటి తేడా వుంది ? ఈ సినిమా విడుదలకు ముందు మీరు లవర్ బాయ్ కదా దసరా ఎలా వుంటుందని కొందరు అడిగారు. కానీ నా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ దసరా, ఎంసిఏ, నేను లోకల్. మూడు మాస్ సినిమాలు. నేను ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే వున్నాను. నేను ఏది జోనర్ వారిగా చూడను. నచ్చితే చేసేస్తాను. మీకు కంఫర్ట్ ఫుల్ జోనర్ ?…
‘రావణాసుర’ చాలా ఎక్సయిటింగ్ థ్రిల్లర్. రవితేజ గారిని, నన్ను చాలా కొత్తగా చూస్తారు: సుశాంత్ మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో సుశాంత్ రావణాసుర విశేషాలని విలేకరులు సమావేశంలో పంచుకున్నారు. ‘రావణాసుర’ మీరా రవితేజ గారా ? ‘సుశాంత్ యాజ్ రామ్’ని రావణాసుర పోస్టర్ రిలీజ్ చేశారు. రావణాసుర టైటిల్ రోల్ రవితేజ గారు చేస్తున్నారు. ట్రైలర్ చూస్తే గ్రే షేడ్స్ అందరికీ వున్నాయి. ‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్’ అనే ట్యాగ్ లైన్ వుంది. మరి ఇందులో రాముడు ఎవరో.. రావణాసురుడు ఎవరో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రావణాసుర చాలా ఎక్సయిటింగ్ థ్రిల్లర్. కొత్త ఎలిమెంట్స్ వున్నాయి. ట్రీట్ మెంట్ కొత్తగా వుంటుంది. మీరు థ్రిల్లర్ చేయడం ఇదే మొదటిసారి కదా ? అవును.. ‘ఇచట వాహనములు నిలుపరాదు’లో కొంత థ్రిల్లర్ వుంటుంది. కానీ కంప్లీట్ థ్రిల్లర్ మాత్రం రావణాసురనే. ఇందులో కొత్తగా కనిపించే అవకాశం వచ్చింది. ఈ సినిమా చేయడానికి కారణం అదే. వెర్సటైల్ యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా ఆలోచన. రావణాసురలో ఆ కొత్తదనం కనిపిస్తుంది. రావణాసుర కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ? అభిషేక్ గారు ఫోన్ చేసినపుడు.. ఒక కథ రెడీ చేసి సినిమా చేయాలనే ఆలోచనలో వున్నాను. అభిషేక్ గారికి కూడా అదే చెప్పాను. కానీ కథ విన్నపుడు మాత్రం చాలా ఎక్సయిటింగా అనిపించింది. రవితేజ గారిని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఒక ప్రేక్షకుడిగా నాకు చాలా కొత్తగా అనిపించింది. నా పాత్ర చాలా కీలకంగా వుంది. సినిమా అంతా వుంటుంది. దీనికి మరో డైమెన్షన్ తోడైతే బావుంటుదని చెప్పాను. సుధీర్ వర్మ గారికి కూడా అది నచ్చి చాలా ఫాస్ట్ గా వర్క్ చేసి నేను అనుకున్న దాని కంటే అద్భుతంగా ఆ డైమెన్షన్ ని తీసుకొచ్చారు. మరో లేయర్ యాడ్ అయ్యింది. రవితేజ గారికి కూడా ఇది చాలా నచ్చింది. నేను అనుకున్న దాని కంటే చాలా బాగా వచ్చింది. రవితేజ గారితో కాంబినేషన్ సీన్ల్ ఎలా వుంటాయి ? ఖచ్చితంగా థియేటర్లో చాలా ఆసక్తికరంగా వుంటాయి. రవితేజ గారిని కొత్తగా చూపించారు. నన్ను కొత్తగా చూపించారు. సీన్స్ అన్నీ ఇంట్రస్టింగా ఎక్సయిటింగ్ వుంటాయి. నిర్మాత అభిషేక్ గారి నిర్మాణంలో చేయడం ఎలా అనిపించింది ? అభిషేక్ గారితో గ్రేట్ జర్నీ. నిజానికి ఈ సినిమాలో ఈ పాత్రని నన్ను తీసుకోవాలనే ఆలోచన కూడా ఆయనిదే. ఈ సందర్భంగా అభిషేక్ గారి కృతజ్ఞతలు. ఇందులో మీ పాత్ర నుంచి ప్రేక్షకులు ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారాని భావిస్తున్నారు ? ఎక్స్ పెక్ట్ కంటే ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎక్సయిట్ మెంట్ వుంది. చాలా డిఫరెంట్ మూవీ. ఇలాంటి కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ వినలేదు చూడలేదు. అందుకే కథ వినగానే ఓకే చేశాను. ప్రేక్షకులు కూడా ఈ కొత్తదనం ఫీలౌతారు. మీరు ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవున్నాయి ? అయితే సినిమాలు మాత్రం చాలా సెలెక్టివ్ గా.. గ్యాప్ తీసుకొని చేస్తున్నారని అనిపిస్తుంది? అక్కినేని కుటుంబం నుంచి రావడం నా అదృష్టం. అయితే నేను మొదటి నుంచి కూడా నాకు వస్తున్న అవకాశాలతోనే ముందుకు వెళ్లాను. కొన్ని సినిమాలు ఆలస్యం కావడం, అనుకున్న సమయానికి రాకపోవడం ..ఇలా నా చేతుల్లో లేనివి కూడా కొన్ని జరిగాయి. ఇంత గ్యాప్ ఎందుకు వస్తుందని కొన్ని సార్లు నాకే తెలియలేదు. అయితే ఇంత గ్యాప్ వచ్చిన నా మైండ్ లో ఎప్పుడూ నెక్స్ట్ సినిమా చేస్తున్నామనే స్ఫూర్తి వుండేది. చిలసౌ తర్వాత ఇక గ్యాప్ తీసుకోకూడదని అని బలంగా నిర్ణయించుకున్న తర్వాత కోవిడ్ వచ్చింది. దీంతో మళ్ళీ గ్యాప్ వచ్చింది. అయితే గత ఆరు నెలలుగా చాలా బిజీగా వున్నాను. సోలో హీరోగా ఒక కథ ఓకే చేశాను. ఇంకొన్ని కథలు వింటున్నా. ‘అల వైకుంఠపురములో’ తర్వాత మీ కెరీర్ మరో మలుపు తీసుకుందని అనుకోవచ్చా ?…
ఆదివారం నాడు చంద్రబోస్ స్వస్థలం ఐన చల్లగరిక లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోశ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ తరపున నమస్తే సేట్ జీ హీరో డైరెక్టర్ తల్లాడ సాయి…
నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన... ఈ జోడీ పేర్లు వింటే 'లేడీస్ టైలర్' గుర్తుకు వస్తుంది. 'సుజాతా....మై మర్ జాతా' డైలాగును, ఆ సన్నివేశాన్ని,…