శింబు-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో‘ది లైఫ్ ఆఫ్ ముత్తు' : తెలుగులో ' శ్రీ స్రవంతి మూవీస్' ద్వారా ఈ నెల 15న విడుదల తమిళ…
విజయ నిర్మల గారి మనవుడు శరణ్ కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం…
'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దక్షిణ'. ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో విజయవంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు…
ఆర్. విజయ్ కుమార్ సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై అరుణ్ విజయ్, పల్లక్ లల్వాని, కాళీ వెంకట్, ఆర్.ఎన్.ఆర్. మనోహర్, కె.ఎస్.జి. వెంకటేష్, మరుమలార్చి భారతి…
స్టార్స్‌తో పాటు నూతన నటీనటులతో బ్లాక్‌బస్టర్‌లను అందించగల సామర్థ్యం దర్శకుడు తేజ సొంతం. ఆయన తన చిత్రాలతో చాలా మంది నటులను పరిచయం చేశారు. వారిలో కొందరు…
ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్…
అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు), సిద్ధికా శర్మ హీరోహీరోయిన్లుగా అంబికా ఆర్ట్స్, ఈశ్వరీ ఆర్ట్స్ పతాకాలపై వైకుంఠ్ బోను దర్శకత్వంలో రమ్య రాజశేఖర్, శ్రీధర్ బాబు…
ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ బేనర్‌పై కె. అచ్యుతరావు సమర్పణలో ఉపేంద్ర హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘కంచర్ల. ఈ చిత్రానికి రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి…
నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి వాతియర్ గా, సూరి హీరోగా తెరకెక్కనున్న చిత్రం "విడుతలై". ఆర్.ఏస్ ఇన్ఫో్టైన్మెంట్ మరియు…
హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రెండో చిత్రంగా 'ఉగ్రం' తెరకెక్కుతోంది. ఇటివల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ క్యూరియాసిటీ పెంచింది. ఫస్ట్ లుక్ లో అల్లరి నరేష్ శరీరం నిండా గాయాలతో ఫెరోషియస్ గా కనిపించాడు, లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో కథానాయికగా మిర్నా మీనన్ ని ఎంపిక చేశారు. మిర్నా ఇంతకుముందు మోహన్ లాల్ బిగ్ బ్రదర్ తో పాటు తమిళం, మలయాళ సినిమాలలో నటించింది. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా. తన తొలి చిత్రాన్ని విలక్షణమైన కథతో తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కనకమేడల ఉగ్రం కోసం పవర్ ఫుల్ కథను సిద్దం చేశారు. ఇందులో నరేష్ ని చాలా డిఫరెంట్ రోల్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. తారాగణం: అల్లరి నరేష్, మిర్నా మీనన్ సాంకేతిక విభాగం : రచన, దర్శకత్వం: విజయ్ కనకమేడల నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది బ్యానర్: షైన్ స్క్రీన్స్ కథ: తూము వెంకట్ డైలాగ్స్: అబ్బూరి రవి డీవోపీ: సిద్ సంగీతం: శ్రీచరణ్ పాకాల ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి పీఆర్వో: వంశీ-శేఖర్