న్యూస్

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘ది ఘోస్ట్’  ఫస్ట్ సింగిల్ వేగం విడుదల

కింగ్ అక్కినేని నాగార్జున,  క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్' థియేట్రికల్ ట్రైలర్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన…

3 years ago

మహానటి కీర్తిసురేష్ గారిచే సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ నేడు పున:ప్రారంభోత్సవం

పాలమూరు ప్రజలకు గత 4 సంవత్సరములుగా ఎంతో సుపరిచితమైన సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు 5 అంతస్థులు 5 లక్షల వెరైటీలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని మహానటి…

3 years ago

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ చేతుల మీదుగా “నచ్చింది గర్ల్ ఫ్రెండూ” సినిమా నుంచి ‘ఎర్రతోలు పిల్లా..’ లిరికల్ సాంగ్ రిలీజ్

యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్…

3 years ago

‘జీ తెలుగు’ లో రాబోతున్న మూడు సరికొత్త సీరియల్స్ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు-సితార స్పెషల్ మ్యూజికల్ కాన్సెప్ట్ ప్రోమో

హైదరాబాద్, 16 సెప్టెంబర్, 2022: ఊహకందని సర్ప్రైజెస్ తో వీక్షకులను ఆశ్చర్యపరచడంలో 'జీ తెలుగు' ఎల్లప్పుడూ ముందుంటుంది! దీన్ని మరోసారి నిరూపిస్తూ చేస్తూ, 'జీ తెలుగు' త్వరలో…

3 years ago

కృష్ణ వ్రింద విహారి’ టైటిల్ సాంగ్ విడుదల

వెర్సటైల్ హీరో నాగశౌర్య , అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణ వ్రింద విహారి' చిత్రంలో రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. బ్రాహ్మణ కుర్రాడిగా, ఉద్యోగం మీద నగరానికి వచ్చిన తర్వాత  అర్బన్ కుర్రాడిగా అలరించనున్నాడు. ట్రైలర్‌ లో తన నటనతో అదరగొట్టాడు నాగశౌర్య. ఈరోజు చిత్ర బృందం టైటిల్ సాంగ్‌ని లాంచ్ చేసింది. ఈ పాటలో నాగ శౌర్య ఒక ఇరకాట పరిస్థితిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అతని ప్రేమలో సమస్య తో పాటు కుటుంబంతో కూడా చిక్కొచ్చింది. అంతేకాకుండా వెన్నెల కిషోర్ కోమా నుండి మేల్కొలపడానికి ఎదురు చూస్తున్నాడు నాగ శౌర్య . దర్శకుడు అనీష్ కృష్ణ అండ్ టీమ్ ఈ సాంగ్‌ని హిలేరియస్ గా ప్రజంట్ చేశారు. మహతి స్వర సాగర్ క్యాచి నెంబర్ ని స్కోర్ చేయగా, రామ్ మిరియాల  ఎనర్జిటిక్ గా పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శౌర్య తల్లిగా అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటర్. ‘కృష్ణ వ్రింద విహారి' సెప్టెంబర్ 23న విడుదల కానుంది. తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు సాంకేతిక విభాగం: దర్శకత్వం:  అనీష్ ఆర్. కృష్ణ నిర్మాత: ఉషా ముల్పూరి సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి బ్యానర్: ఐరా క్రియేషన్స్ సంగీతం: మహతి స్వరసాగర్ డివోపీ: సాయిశ్రీరామ్ సహ నిర్మాత: బుజ్జి ఎడిటర్ - తమ్మిరాజు ఆర్ట్ డైరెక్టర్ - రామ్‌ కుమార్ డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్ పీఆర్వో: వంశీ, శేఖర్

3 years ago

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ప్రీరిలీజ్ ఈవెంట్

నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా…

3 years ago

గీతా ఆర్ట్స్ సమర్పణలో ధనుష్, సెల్వరాఘవన్ లా “నేనే వస్తున్నా” చిత్రం

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తన సోదరుడు మరియు  విలక్షన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో "నానే వరువేన్" చిత్రాన్ని చేసిన విషయం విదితమే. తాజాగా షూటింగ్…

3 years ago

దర్శకుడు శ్రీకార్తిక్ ఇంటర్వ్యూ

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీకార్తిక్ విలేఖరుల సమవేశంలో పాల్గొని సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు. మొదటి సినిమా సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? కథని రాయడానికి రెండేళ్ళు పట్టింది. సరైన హీరో కుదరడానికి మరో ఏడాదిన్నర పట్టింది. తర్వాత కోవిడ్ వలన రెండేళ్ళు... సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది. అయితే నా నిరీక్షణకి తగిన ఫలితం దక్కింది. సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. ఒక బరువు దిగిన భావన కలుగుతోంది. చాలా ఆనందంగా వుంది. ఈ కథ ఆలోచన రావడానికి కారణం మీ అమ్మగారేనా ? అవును. తను బెడ్ మీద వున్నపుడు నేను తీసిన షార్ట్ ఫిల్మ్ చూపించాలని అనుకున్నా. కానీ తను అప్పటికే అపస్మారక స్థితిలో వున్నారు. నేను ఫిల్మ్ మేకర్ అవుతానని కూడా తనకి తెలీదు. ఆ విషయంలో రిగ్రేట్ వుండేది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లాలనే ఆలోచన ఈ కథకు భీజం వేసింది. ఎమోషన్ ని సైన్స్ లో ఎలా బ్లండ్ చేశారు ? నాకు సైన్స్ చాలా ఇష్టం. ఇందులో సైన్స్ లేకపోతే మెలో డ్రామా అయ్యేది. ఆడియన్స్ కి ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ కథని సైన్స్ తో    ట్రీట్ చేశా. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది. మేము అనుకున్న విజయం సాధించింది. భవిష్యత్ లో మరిన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తాయని భావిస్తాను. శర్వానంద్ తో పని చేయడం ఎలా అనిపించింది ? శర్వానంద్ తో పని చేయడం గొప్ప అనుభవం. ఈ సినిమా నాకు, శర్వాకి ఇద్దరికీ ఒక ఎమోషనల్ రైడ్. శర్వాకి కూడా అమ్మ అంటే ప్రాణం. శర్వా లాంటి స్టార్ హీరో ఈ సినిమా చేయడమే పెద్ద సక్సెస్. శర్వాకి ఒక మంచి సినిమా, మంచి విజయం ఒకే ఒక జీవితం అవుతుందనినమ్మా. ఆ నమ్మకం నిజమైయింది. అమల గారిని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది ? అమల గారిని తీసుకోవాలనే ఆలోచన నాదే. కథ విన్న తర్వాత అమల గారికి చాలా నచ్చింది. వెంటనే సినిమా చేస్తానని చెప్పారు. మీలో ఒక డ్యాన్సర్, నటుడు, దర్శకుడు, నిర్మాత వున్నారు కదా.. ఈ కోణాలు గురించి చెప్పండి ? ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత డ్యాన్స్ స్కూల్ పెట్టాలని అనుకున్నా. అదికాకపొతే న్యూయార్క్ స్కూల్ లో డ్యాన్స్ లో మాస్టర్స్ చేయాలనీ అనుకున్నా. ఇదే సమయంలో ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నా. రాధిక, గౌతమి గారు ఆ షోకి న్యాయ నిర్ణేతలు. నా ఎక్స్ ప్రెషన్, యాక్టింగ్ బావుందని మెచ్చుకున్నారు. నాలో ఒక నమ్మకం వచ్చింది. నటుడ్ని కావాలని చాలా తిరిగా. రెండేళ్ళు అవకాశాలు రాలేదు. తర్వాత నేనే రాయాలి నేనే తీయాలి అనే నిర్ణయానికి వచ్చాను. షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ చేశా. ఒకే ఒక జీవితానికి ఐదేళ్ళు పట్టిందని చెప్పారు కదా.. మరి షూటింగ్ ఎన్ని రోజులు తీసుకున్నారు ?  షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కి ఏడాది పట్టింది. షూటింగ్ ని త్వరగానే పూర్తి చేశాం. రెండు భాషల్లో కలిపి 78 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేశాం. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనుకోవచ్చా(నవ్వుతూ)…

3 years ago

రెబల్ స్టార్ కృష్ణంరాజుకు నివాళిగామౌనం పాటించిన చిత్ర బృందం ‘శాకిని డాకిని’

'శాకిని డాకిని' యూనిక్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్.. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు:  'శాకిని డాకిని' ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శాకిని డాకిని'. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 'శాకిని డాకిని' సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరో అడవి శేష్, దర్శకులు నందిని రెడ్డి, అనుదీప్, విమల్ కృష్ణ ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో సీనియర్‌ కథానాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజుకు నివాళిగా చిత్ర బృందం మౌనం పాటించి అంజలి ఘటించింది. అడవి శేష్ మాట్లాడుతూ.. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ వండర్ ఫుల్ యాక్టర్స్. రెజీనాతో 'ఎవరు'లో కలసి పని చేశా. మొన్ననే రెజీనా రాకెట్ బాయ్స్ చూశాను. చాలా నచ్చింది. నివేదా చేసిన నిన్ను కోరి, బ్రోచేవారెవరురా నాకు చాలా ఇష్టం. తను ఏ పాత్ర చేసిన అద్భుతంగా వుంటుంది. ఈ ఈవెంట్ కి రావడానికి కారణం సునీత గారు. మా కోరిక మేరకు సునీత గారు మేజర్ లో హీరోయిన్ మదర్ గా చేశారు. అయితే లెంత్ కారణంగా సినిమాలో సీన్లు వుంచడం కుదరలేదు. ఈ ఈవెంట్ వేదికగా సునీత గారికి క్షమాపణలు చెబుతున్నా.  'మిడ్‌నైట్ రన్నర్స్' ఇద్దరు అబ్బాయిలు చేసిన సినిమా. ఇందులో ఇద్దరు అమ్మాయిలు చేయడం చాలా క్యూరియాసిటీని పెంచుతోంది. సెప్టెంబర్ 16న  'శాకిని డాకిని'  థియేటర్లోకి వస్తుంది. నేను థియేటర్ లో ఉంటా. థియేటర్ లో కలుద్దాం'' అన్నారు. నందిని రెడ్డి మాట్లాడుతూ.. హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ కామెడీ గా 'శాకిని డాకిని' రావడం చాలా ఆనందంగా వుంది. ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేస్తే అదిరిపోతుంది. నాకు థియేటర్ కి వెళ్లి చూడాలని వుంది.  రెజీనా కసాండ్రా, నివేదా థామస్ కెమిస్ట్రీ చాలా యూనిక్ గా వుంది.  'శాకిని డాకిని' ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ అవుతుంది. మన తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ వుంటే ఖచ్చితంగా చూస్తారు.  ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. నాకు ఓ బేబీ సినిమా ఇచ్చిన  సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కి థాంక్స్. ఓ బేబీ కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. రెజీనా చాలా మంచి మనసున్న నటి. రెజీనా, నివేదా ఈ సినిమాని చాలా ప్యాషన్ తో చేశారు.  సెప్టెంబర్ 16న సినిమాని తప్పకుండా థియేటర్లలో చూడండి'' అని కోరారు. రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. శాకిని డాకిని తో చాలా  ట్రావెల్ చేశాం. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ కి కృతజ్ఞతలు. ఇలాంటి చిత్రాలని ఇలాంటి నిర్మాణ సంస్థలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బావుంటుంది. దర్శకుడు సుధీర్ వర్మ సినిమాని అద్భుతంగా తీశారు. రిచర్డ్ బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు. అక్షయ్ చాలా మంచి డైలాగ్స్ రాశారు. సంయుక్త కి బిగ్ థాంక్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కి థాంక్స్. యాక్షన్ మాస్టర్ వెంకట్ గారికి స్పెషల్ థాంక్స్. నాకు ఎప్పటి నుండో యాక్షన్ సినిమా చేయాలని వుంది. ఈ సినిమాతో కుదిరింది. నరేష్ చాలా మంచి పాటలు ఇచ్చారు. సునీత మేడంకి హ్యాపీ బర్త్ డే. ఆమెతో కలసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆమె నుండి చాలా నేర్చుకున్నాను. నివేదాతో కలసి నటించడం చాలా ఆనందంగా వుంది. ఒక నటిగా నివేదా అంటే నాకు చాలా ఇష్టం. సెప్టెంబర్ 16న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా థియేటర్ కి వెళ్లి చూడండి. ఈ సినిమా మాకు ఒక మైల్ స్టోన్ గా కాబోతుందనే నమ్మకం వుంది. నివేదా థామస్ మాట్లాడుతూ.. 'శాకిని డాకిని' తో చాలా నేర్చుకున్నాను. ఇందులో పని చేసిన ప్రతిఒక్కరూ నన్ను ముందుకు నడిపారు. నరేష్ బ్రిలియంట్ నేపధ్య సంగీతం అందించారు. ఇద్దరు హీరోయిన్స్ తో 'శాకిని డాకిని' చేయాలనే ఆలోచన సంయుక్తది. సుధీర్ వర్మ లాంటి ప్రతిభగల దర్శకుడిని ఇచ్చి ఇంత గొప్పగా సినిమా విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్ , సురేష్ బాబు, సునీత మేడం కి కృతజ్ఞతలు. సునీత మేడం నుండి చాలా నేర్చుకున్నాను. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితులని దాటుకొని చాలా విజయవంతంగా సినిమాని నిర్మించారు. రెజీనాతో కలసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. నందిని రెడ్డి, అడివి శేష్, అనుదీప్  ఈ ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. కొత్త కంటెంట్ ని ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుటారు. ఈ సినిమాని కూడా ఆదరిస్తారనే నమ్మకం వుంది'' అన్నారు. సునీత తాటి మాట్లాడుతూ.. ఇద్దరు  హీరోలతో ఈ సినిమా చేయాలని మొదలుపెట్టాం. ఇద్దరు హీరోయిన్స్ తో సినిమా చేస్తే ఎలా వుంటుందని సంయుక్త అన్నారు. ఈ విజన్ ని దర్శకుడు సుధీర్ వర్మ నమ్మారు. ఈ సినిమా టైటిల్ ఇచ్చింది కూడా సంయుక్తనే. కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులని దాటి సినిమాని చాలా విజయవంతంగా నిర్మించాం.  'శాకిని డాకిని' యూనిక్ ఫిల్మ్ .రెజీనా, నివేదా లేకుండా ఈ సినిమా వుండేది కాదు. యాక్షన్ కోసం చాలా కష్టపడ్డారు. నివేదాలో మంచి డైరెక్టర్  కూడా వున్నారు. ఆమె ఆ సవాల్ ని త్వరలోనే స్వీకరిస్తుందని భావిస్తున్నాను. రెజీనా అద్భుతమైన నటి. అన్ని భాషల్లో చాలా మంచి చిత్రాలు చేస్తోంది. ఈ వేడుకకి అడవి శేష్ రావడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో మాకు సహకరించిన మా బ్రదర్, డాక్టర్ శరత్ అద్దంకి కి కృతజ్ఞతలు. సతీష్, పృద్వీ గారు, అనుదీప్ కి థాంక్స్. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్, పవన్, పాటలు రాసిన రాకేందు మౌళి, డైలాగ్ రైటర్ అక్షయ్, నేపధ్య సంగీతం అందించిన నరేష్, నిహారిక, ఎడిటర్  విప్లవ్ కి కృతజ్ఞతలు'' తెలిపారు. అనుదీప్ మాట్లాడుతూ..  నిర్మాతలు సురేష్ బాబు, సునీత తాటి, హీరోయిన్లు రెజీనా, నివేదాలకు ఈ సినిమా పెద్ద విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 16న ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు. విమల్ కృష్ణ మాట్లాడుతూ..  'మిడ్‌నైట్ రన్నర్స్'  చూశాను. ఇది తెలుగులో ఎలా వుంటుందో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ చూసిననప్పుడు చాలా క్యురియాసిటీ పెంచింది. రెజీనా, నివేదా అద్భుతంగా యాక్ట్ చేశారు. సురేష్ బాబు గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు. సతీష్ మాట్లాడుతూ .. ఈ సినిమా కథ గురించి నాకు తెలుసు. అద్భుతమైన కథ. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ బ్రిలియంట్ గా ఫెర్ ఫార్మ్ చేశారు. సెప్టెంబర్ 16న ఈ సినిమా తప్పకుండా చూడండి'' అన్నారు రాకేందుమౌళి మాట్లాడుతూ.. ఇందులో రెండు పాటలు రాశాను. రెండు పాటలు చాలా వైవిధ్యంగా వుంటాయి. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సురేష్ బాబు, సునీత తాటి గారికి థాంక్స్. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ఇద్దరూ అద్భుతంగా చేశారు. సెప్టెంబర్ 16న సినిమా వస్తోంది. తప్పకుండా చూడండి'' అన్నారు…

3 years ago

సకల గుణాభి రామ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల

బిగ్ బాస్ ఫేమ్ వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ.…

3 years ago