న్యూస్

క్రైమ్-థ్రిల్లర్ ఆర్యన్  ఫస్ట్ లుక్ విడుదల

హీరో విష్ణు విశాల్ కథానాయకుడిగా, ప్రవీణ్ కె దర్శకత్వంలో, దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్యన్ (A.A.R.Y.A.N ). శ్రద్ధా శ్రీనాథ్‌, వాణీ భోజన్‌ కథానాయికలు. విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మిస్తుండగా, శుభ్ర, ఆర్యన్ రమేష్ సమర్పిస్తున్నారు. రేసీ మూమెంట్స్, ట్విస్ట్‌లు, టర్న్‌లతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైయింది,. విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో విష్ణు విశాల్ ఖాకీ యూనిఫాంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సీరియస్ లుక్ తో చిన్న గడ్డం, మీసాలతో కనిపించాడు.  ఈ చిత్రంలో సాయి రోనక్, తారక్ పొన్నప్ప, అభిషేక్ జోసెఫ్ జార్జ్, మాలా పార్వతి, ఇతర ప్రముఖ నటీనటులు కూడా ఉన్నారు. విష్ణు సుభాష్ కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత దర్శకుడు.  ఆర్యన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల అవుతుంది. నటీనటులు: విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, వాణీ భోజన్, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, అభిషేక్ జోసెఫ్ జార్జ్, మాలా పార్వతి, తదితరులు. సాంకేతిక విభాగం : నిర్మాత : విష్ణు విశాల్ (విష్ణు విశాల్ స్టూడియోస్)  రచన, దర్శకత్వం : ప్రవీణ్ కె డీవోపీ - విష్ణు సుభాష్ సంగీతం - సామ్ సిఎస్ ఎడిటర్ - శాన్ లోకేష్ స్టంట్ - స్టంట్ సిల్వా సహ రచయిత - మను ఆనంద్ ఆర్ట్ డైరెక్టర్ - ఇందులాల్ కవీద్ కాస్ట్యూమ్ డిజైనర్,  స్టైలిస్ట్ - వినోద్ సుందర్ సౌండ్ ఎడిటింగ్ - సింక్ సినిమా వీఎఫ్ ఎక్స్- హరిహరసుతన్, ప్రథూల్ ఎన్ టి సూపర్వైజింగ్  ప్రొడ్యూసర్ - ఎకెవి దురై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సీతారాం…

3 years ago

‘బ్ర‌హ్మాస్త్రం’ సినిమా ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఓ బ్ర‌హ్మాస్త్రం :  ఎన్టీఆర్‌

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్రం’ మొద‌టి…

3 years ago

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ ‘మెగా154’ భారీ షెడ్యూల్ హైదరాబాద్‌ లో ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154.  మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబధించిన కీలకమైన భారీ షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీమ్ మొత్తం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారు. కీలకమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్‌ లో చిత్రీకరిస్తున్నారు. మెగా154  ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో దర్శకుడు బాబీ కల నిజమైనట్లయింది. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్-అప్పీలింగ్ , పవర్- ప్యాకెడ్ పాత్రలో మెగాస్టార్ ని చూపించబోతున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి…

3 years ago

శర్వానంద్, శ్రీ కార్తీక్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ‘ఒకే ఒక జీవితం’  థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన అనిరుధ్ రవిచందర్

ప్రామెసింగ్ హీరో శర్వానంద్ డిఫరెంట్ జోనర్‌ల సినిమాలు చేయడంలో తన వైవిధ్యాన్ని చాటుతున్నారు. శర్వానంద్ కెరీర్ లో 30వ చిత్రంగా తెరకెక్కిన వైవిధ్యమైన చిత్రం ‘ఒకే ఒక…

3 years ago

‘దాస్ కా ధమ్కీ’ నా పాన్ ఇండియా మూవీ : విశ్వక్ సేన్

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్‌తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద…

3 years ago

భారతదేశం మూలాల్లో కథలు చెప్పడానికి చేతులు కలిపిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కలిసి ఈ ఏడాది 'కాశ్మీర్ ఫైల్స్' భారీ బ్లాక్బస్టర్ను అందించారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో  అభిషేక్…

3 years ago

మీసం తిప్పి బరిలోకి దిగిన ‘వీరమల్లు’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి.…

3 years ago

‘ప్రిన్స్’ ఫస్ట్ సింగల్  ”బింబిలిక్కి పిలాపి” విడుదల

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్‌లను ఫస్ట్ సింగల్ ''బింబిలిక్కి పిలాపి''డ్యాన్స్ నెంబర్ తో గ్రాండ్ గా ప్రారంభించింది చిత్ర యూనిట్. సంగీత సంచలనం ఎస్ తమన్ ఈ పాటని తనదైన స్టయిల్ లో మాస్ బీట్ డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్ చేయగా.. శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ఈ పాటని చూస్తుంటే థియేటర్లో ఫ్యాన్స్ విజల్స్ వేయడం ఖాయమనిపిస్తోంది. రామ్ మిరియాల, రమ్య బెహరా, సాహితీ చాగంటి త్రయం ఈ పాటని డైనమిక్ గా ఆలపించగా.. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో శివకార్తికేయన్ డ్యాన్స్ మూమెంట్స్ అలరించగా, మారియా కూడా శివకార్తికేయన్ యొక్క ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ప్రయత్నించింది. మారియా తన సూపర్ కూల్ లుక్స్, స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత. తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు. సాంకేతిక విభాగం రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి సంగీతం: ఎస్ థమన్ నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ సమర్పణ: సోనాలి నారంగ్ సంగీతం: ఎస్ థమన్ డీవోపీ: మనోజ్ పరమహంస సహ నిర్మాత:  అరుణ్ విశ్వ ఎడిటర్: ప్రవీణ్ కెఎల్ ఆర్ట్ : నారాయణ రెడ్డి పీఆర్వో : వంశీ-శేఖర్

3 years ago

శివకార్తికేయన్, అనుదీప్ కె.వి’ప్రిన్స్’ ఫస్ట్ సింగల్ సెప్టెంబర్ 1న విడుదల

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ 'ప్రిన్స్'.…

3 years ago

మహారాజా రవితేజ, శ్రీలీల”ధమాకా” గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్ లిమిటెడ్ ఎంటర్‌టైనర్ "ధమాకా''. ఎనర్జీకి మారుపేరైన రవితేజ, కమర్షియల్ సబ్జెక్ట్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోన్న ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన మొదటి పాట 'జింతాక్'కు అద్భుతమైన  స్పందన వచ్చింది. తాజాగా ధమాకా చిత్ర యూనిట్ అదిరిపోయే కొత్త అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రం గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల వినాయక చవితి సందర్భంగా సాయంత్రం 5:01 గంటలకు విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ కలర్‌ ఫుల్‌ గా, రొమాంటిక్‌ గా కనిపిస్తోంది. రవితేజ శ్రీలీలని తన దగ్గరికి తీసుకొని, ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తుండగా శ్రీలీల కాస్త  టెన్షన్ పడుతూ అయోమయంగా చూడటం ఆకట్టుకుంది, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తారాగణం: రవితేజ, శ్రీలీల సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఫైట్స్: రామ్-లక్ష్మణ్ ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల పీఆర్వో: వంశీ శేఖర్

3 years ago