త్రీ(3) సినిమా రీ రిలీజ్ కొత్త ట్రెండ్ కు నాంది అవుతుంది మీడియా రంగంలోకి వస్తున్నాను: ఫిలిం ఛాంబర్ ఎన్నికలలో పోటీ చేస్తా: నట్టి కుమార్ తన…
హైదరాబాద్, సెప్టెంబర్ 7, 2022: అద్భుతమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలతో మరియు స్పెషల్ ఈవెంట్స్, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ తో 'జీ తెలుగు' ఇరు రాష్ట్రాల ప్రేక్షకులను…
దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరోహీయిన్లుగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అద్భుతమైన ప్రశంసలు తో పాటు, బాక్స్…
*దసరా శుభాకాంక్షలతో అక్టోబర్ 5 న విడుదల ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ…
ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కెప్టెన్'. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. శక్తి సౌందర్…
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్కామెడీ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శాకిని డాకిని' విడుదలకు సిద్ధమౌతోంది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 'శాకిని డాకిని' సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకుంది. రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. 'శాకిని డాకిని' కొరియన్ ఫిల్మ్ రీమేక్. తెలుగు నేటివిటీ తగ్గట్టు అద్భుతంగా మలిచాం. ఈ సినిమా నా కెరియర్ లో ఒక మైలు రాయి. 'శాకిని డాకిని' లో యాక్షన్ కామెడీ తో పాటు సమాజానికి మంచి సందేశం వుంటుంది. కథానాయకులు గా ఇద్దరు హీరోయిన్స్ వుండటం ఖచ్చితంగా కొత్తగా వుంది. మాపై నమ్మకంతో ఈ సినిమా చేసిన సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ కి కృతజ్ఞతలు. కదిలే కదిలే పాట ఈ సినిమా కథకి అద్దం పడుతుంది. ఈ పాట చూసిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మహిళలు ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తారనే నమ్మకం వుంది. సెప్టెంబర్ 16న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ థియేటర్లో సినిమా చూడాలి'' అని కోరారు. నివేదా థామస్ మాట్లాడుతూ.. బ్రోచేవారెవరు సినిమా సమయంలో సురేష్ బాబు గారు పరిచమయ్యారు. సినిమా గురించి చాలా చక్కని విషయాలు చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ యూనిక్ సినిమాలకు పెట్టింది పేరు. 'శాకిని డాకిని' కథాచర్చల్లో పాల్గొన్నప్పుడే సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. అలాగే థీమ్ సాంగ్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'శాకిని డాకిని' కెమిస్ట్రీ ఈ థీమ్ సాంగ్ లో చూశారు. ఇందులో నేను రెజీనా చాలా డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నాం. చిరాకుతో కూడిన ఫన్ రిలేషన్స్ అది. టీజర్, థీమ్ సాంగ్ లో మా కెమిస్ట్రీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా లో అది ఇంకా బావుంటుంది. సెప్టెంబర్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ లో చూడాలి'' అని కోరారు. సునీత తాటి మాట్లాడుతూ.. ఏ సినిమా అయినా చేయడానికి నాకు మూడు ముఖ్యమైన ఎలిమెంట్స్ అనిపిస్తాయి. కథ, కథానాయకులు, కథని ఎందుకు చేస్తున్నామనే స్ఫూర్తి. 'శాకిని డాకిని'లో ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక క్రైమ్ ని డీల్ చేస్తారనేది కథ. ఈ కథ మొదటి నుండి మాకు చాలా నచ్చింది. ఈ కథ విషయంలో మాకు చాలా నమ్మకం వుంది.ఒక ఆడ పిల్ల పుడితే ఆమె మొదటి పాత్ర కూతురు. అలాంటి ఒక కూతురిని దగ్గర పెట్టుకొని కొన్ని సినిమాలు చూడలేకపోతున్నాం. కానీ ఈ సినిమాలో అలాంటి కూతురు దగ్గర వున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. సురేష్ బాబు గారి సహకారంతో ఈ సినిమాని చేశాం. సినిమాలో నివేదా పంచ్ లు, రెజీనా కిక్కులు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. సినిమాని ఇంటర్ నేషనల్ స్థాయిలో ఎక్కడా రాజీపడకుండా తీశాం. రెజీనా, నివేదా చాలా హార్డ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 16న సినిమాని విడుదల చేస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది'' అన్నారు అనంతరం మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కొరియన్ సినిమాలు ఎక్కువగా తీయడానికి కారణం ? సునీత తాటి : కథ పరంగా ఒక స్పేస్ లో వున్నాం. కొత్త కథలు ఎక్కడ వున్నాయని అడుగుతుంటారు. అయితే అడాప్ట్ చేయడం కూడా అంత తేలిక కాదు. ఒక ఎమోషన్ ని తీసుకొని కల్చర్ యాడ్ చేయడం కూడా ఒక ప్రయాణం. ఈ కథని యువకుడైన అక్షయ్ అద్భుతంగా స్క్రీన్ ప్లే చేశాడు. ఈ కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ? నివేదా థామస్ : తెలుగులో చేస్తున్నామని తెలిసిన తర్వాత మిడ్ నైట్ రన్నర్స్ చూశాను. అందులో పాత్ర నాలానే వుంది. నాకు తెలియకుండా నా పాత్రతో స్క్రీన్ ప్లే చేసి సినిమా తీశారా అనిపించింది. ఈ పాత్ర మీరే చేస్తున్నారని చెప్పారు. పెద్దగా కష్టపడటం అవసరం లేదనిపించింది. కొంచెం తెలంగాణ యాస చక్కగా నేర్చుకొని నాలాగ వుంటే సరిపొతుందనిపించింది. అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది ? రెజీనా: నా మొదటి సినిమా నుండి యాక్షన్ చేయడం నాకు చాలా ఇష్టం. మొత్తానికి ఈ సినిమాతో ఆ అవకాశం వచ్చింది. వెంకట్ మాస్టర్ అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారు. యాక్షన్ సీన్స్ ని చాలా ఎంజాయ్ చేశాను. యాక్షన్ విషయంలో విజయశాంతి లాంటి హీరోయిన్స్ స్ఫూర్తి ఎప్పుడూ వుంటుంది. ఇలాంటి యాక్షన్ పాత్రలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటింగా ఎదురుచూస్తున్నాను. నివేదా: యాక్షన్ సీన్స్ చేయడం సవాల్ తో కూడుకున్నదే. యాక్షన్ సీన్ చేసినప్పుడు శరీరం రియాక్ట్ అవ్వాలి. ఈ సినిమాలో యాక్షన్ కథతో బ్లండై వుంటుంది. యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాం. ఇలాంటి మరిన్ని యాక్షన్ సినిమాలు చేయాలని వుంది. ఇద్దరు హీరోయిన్స్ తో సినిమా చేయాలనే ఆలోచన ఎవరిదీ ?…
వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. కృష్ణ వ్రింద విహారి లోని తార నా తార పాట విడుదల అయింది. నాగ శౌర్య , షిర్లీ సెటియాల అందమైన కెమిస్ట్రీ ని చూపించే మెస్మెరిజింగ్ నెంబర్ స్వరపరిచారు మహతి. లీడ్ పెయిర్ బైక్ రైడ్ కివెళ్ళడం, షిర్లీ కౌగలించుకున్నపుడు శౌర్య మదురమైన అనుభూతిని పొందడం, ప్రేమికులిద్దరూ వెచ్చని రాత్రిలో హాయిగా విహరించడం లవ్లీగా వుంది. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం యూత్‌ఫుల్ గా ఉంది. నకాష్ అజీజ్ పాటని బ్రిలియంట్ గా పాడారు. అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. ‘కృష్ణ వ్రింద విహారి' సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది. తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు సాంకేతిక విభాగం: దర్శకత్వం: అనీష్ ఆర్. కృష్ణ నిర్మాత: ఉషా ముల్పూరి సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి బ్యానర్: ఐరా క్రియేషన్స్ సంగీతం: మహతి స్వరసాగర్ డివోపీ: సాయిశ్రీరామ్ సహ నిర్మాత: బుజ్జి ఎడిటర్ - తమ్మిరాజు ఆర్ట్ డైరెక్టర్ - రామ్ కుమార్ డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్ పీఆర్వో: వంశీ, శేఖర్
ఒక మంచం నుండి స్టార్ట్ అయిన మనం పుట్టుక చివరికి మన చావుతో ఒక మంచం పైనే ముగుస్తుంది. ఇలా ప్రతి మనిషి జీవితంలో మంచం అనేది…
అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం…
కర్ణాటక శాసనసభకు నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికైన జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్…