24 గంటల్లో రికార్డ్ వ్యూస్ సాధించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్.. జనవరి 7న జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సందడి చేయనున్న మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మెషీన్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం నాడు రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్ సాధించింది. 24 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ ఇప్పటికీ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. చిరంజీవి గత చిత్రాల నుంచి వచ్చిన ట్రైలర్లలో ఓ రేంజ్ రికార్డ్ వ్యూస్‌ను సాధించి టాప్‌లో దూసుకుపోతోంది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్.
ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. జనవరి 7న హైదరాబాద్‌లో జరగనున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సందడి చేయనున్నారు. మొదటి నుంచీ డిఫరెంట్ ప్రమోషన్స్‌తో టీం ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమోషన్స్‌లో మొదటి సారిగా చిరంజీవి, వెంకటేష్ కనిపించబోతోన్నారు. ఇది ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో ఒకటిగా నిలిచింది. ఈ లెజెండరీ స్టార్స్ చేసే సందడి, వారిద్దరి బంధాన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్రైలర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. కావాల్సినంత వినోదం, హాస్యం, మాస్ అప్పీల్‌తో నిండిన ఈ సినిమాలో చిరంజీవి, వెంకటేష్ కాంబో సీన్స్ హైలెట్ కానున్నాయని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. వీరి కాంబో గురించి ఇప్పటికే అందరూ మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.

