HIT The 3rd Case లో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి-

Must Read

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ HIT: The 3rd Caseలో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్న యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది.

ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వైజాగ్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో శ్రీనిధి శెట్టి షూట్‌లో జాయిన్ అయింది. ప్రస్తుతం, టీమ్ లీడ్ పెయిర్- నాని, శ్రీనిధి శెట్టికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.

హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ ని పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నాని మేకోవర్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.

మే 1, 2025న వేసవిలో HIT 3 థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
బ్యానర్లు: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్
డీవోపీ: సాను జాన్ వర్గీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
సౌండ్ మిక్స్: సురేన్ జి
లైన్ ప్రొడ్యూసర్: అభిలాష్ మాంధపు
చీఫ్ కో-డైరెక్టర్: వెంకట్ మద్దిరాల
కాస్ట్యూమ్ డిజైనర్: నాని కమరుసు
SFX: సింక్ సినిమా
VFX సూపర్‌వైజర్: VFX DTM
DI: B2h స్టూడియోస్
కలర్స్: S రఘునాథ్ వర్మ
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Latest News

‘విశ్వం’ హిలేరియస్ ఎంటర్ టైనర్ :  దర్శకుడు శ్రీను వైట్ల

గోపీచంద్ విశ్వం చిత్రంలో ఎంటర్ టైన్ మెంట్ లో సాగే  ప్రతి పాత్ర హైలైట్ గా నిలుస్తుంది : దర్శకుడు శ్రీను వైట్ల గోపీచంద్  విశ్వం మేకింగ్...

More News