త్రిబాణదారి బార్బరిక్ అంటూ ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీతో వానరా సెల్యూలాయిడ్ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఈ బ్యానర్ మీద పలు ప్రాజెక్టులు ఇప్పుడు సెట్స్ మీదున్నాయి. ఈ క్రమంలోనే వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘బ్యూటీ’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహించిన ‘బ్యూటీ’ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు. ఈ సినిమాకు బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటించారు.
తాజాగా ‘బ్యూటీ’ అనే టైటిల్‌ను ప్రకటించడంతోపాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. మోషన్ పోస్టర్‌లో చూపించిన బీచ్, రోడ్డు, ఇళ్లు..ఆ తరువాత చివర్లో హీరో హీరోయిన్లను రొమాంటిక్‌గా చూపిస్తూ టైటిల్‌ను చూపించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ మోషన్ పోస్టర్‌ను చేస్తుంటేనే విజువల్స్, ఆర్ఆర్ ఎలా ఉండబోతున్నాయో అర్థం అవుతోంది. యూత్ ఆడియెన్స్‌కు కిక్కిచ్చేలా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేయడం ఖాయం.
ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం వంటి హిట్ చిత్రాల్లో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న అంకిత్ కొయ్య, బ్యూటీలో సోలో లీడ్‌గా అందరినీ మెప్పించేలా ఉన్నారు. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా పని చేస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్: బేబీ సురేష్ భీమగాని, ఎడిటింగ్: ఎస్‌బి ఉద్ధవ్. ఈ ఏడాదిలో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘బ్యూటీ’ కూడా ఒకటి కానుంది.
తారాగణం: అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా తదితరలు
సాంకేతిక సిబ్బంది
రచయిత , దర్శకుడు: వర్ధన్
నిర్మాతలు: అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్
బ్యానర్లు: వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎస్. రావు
DOP: శ్రీ సాయి కుమార్ దారా
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: SB ఉద్ధవ్
ఆర్ట్ : బేబీ సురేష్ భీమగాని
PRO: సాయి సతీష్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…