‘ఆయ్’ నుంచి ‘అమ్మ లాలో రామ్ భజన..’ పాట విడుదల

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ‘ఆయ్’ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ రూపంలో తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఆయ్ సినిమాను స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మ లాలో రామ్ భజన..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.

‘‘పేరు లేదు ఊరు లేదు ప్రేమించేసిందండోయ్
ఆహా.. అమ్మ లాలో రామ్ భ‌జ‌న‌
మాట లేదు.. మ‌నువు లేదు.. మ‌న‌సిచ్చేసిందండోయ్
అమ్మ లాలో రామ్ భ‌జ‌న‌..’’

అంటూ అమ్మాయి మనసులో ప్రేమను తెలియజేసేలా ‘ఆయ్’  సినిమా నుంచి ‘అమ్మ లాలో రామ్ భ‌జ‌న‌..’ పాటను మేకర్స్ విడుదల చేశారు. శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారి మధ్య ప్రేమను తెలియజేసేలా సాగుతోన్న ఈ పాట‌ను మ‌న బుర్ర‌క‌థ పంథాలో చిత్రీక‌రించటం వైవిధ్యంగా అనిపిస్తోంది.  మన గొప్ప సంప్రదాయం, సంస్కృతికి హృదయపూర్వక నివాళిగా నిలుస్తుంది. అది పాట‌లో స్పష్టంగా చిత్రీకరించబడింది.

అజ‌య్ అర‌సాడ సంగీతం అందించిన  ‘అమ్మ లాలో రామ్ భ‌జ‌న‌..’ పాట‌ను దర్శకుడు అంజి కె.మణిపుత్ర  చాలా చ‌క్క‌గా రాశారు. పెంచ‌ల్ దాస్ పాట‌ను పాడిన తీరు చాలా స‌హ‌జ సిద్ధంగా ఉంది.

ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆయ్‌’ నుంచి రెగ్యుల‌ర్‌గా మూవీ అప్‌డేట్స్‌ను ఇస్తున్నారు. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌తో ఆయ్ సినిమా రూపొందింది. ఈ ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో నార్నే నితిన్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ  సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.  

GA2 పిక్చర్స్:

 ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.

నటీనటులు:  

నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ – GA2 పిక్చర్స్, సమర్పణ – అల్లు అరవింద్, నిర్మాతలు – బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, డైరెక్టర్ – అంజి కె.మ‌ణిపుత్ర‌, సహ నిర్మాతలు – భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, సినిమాటోగ్రఫీ – సమీర్ కళ్యాణి, సంగీతం – రామ్ మిర్యాల, ఎడిటర్ – కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్ – సుష్మిత, శిల్ప, కో డైరెక్టర్ – రామ నరేష్ నున్న, పి.ఆర్.ఒ – వంశీ కాకా, మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్ట, పోస్టర్స్ – అనిల్, భాను.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago