ఏవం’ ట్రైలర్: ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా

హీరోయిన్ చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు.
ఈ సినిమా ట్రైలర్ ని డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా.
చాందిని చౌదరి మాట్లాడుతూ: ముందుగా మీడియా కి థాంక్స్, ట్రైలర్ చూపించగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు చాలా excite అయ్యి లాంచ్ చేసినందుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను,  ‘యేవమ్’ అనేది మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా. జూన్ 14న రిలీజ్ అవుతుంది.  నేను మొదటి సారి పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను, సైకలాజికల్ ఎమోషన్స్ చాలా ఉంటాయి. ఏ సినిమా అయినా ప్రేక్షకులు చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ ప్రీడిక్ట్ చేస్తారు. కాని ఈ సినిమాలో వాళ్ళు ఏం అనుకున్నా దానికి పూర్తి బిన్నంగా అవుతుంది. అవ్వన్నీ ప్రేక్షకులకి చాలా హై ఇస్తాయి, కథ వికారాబాద్ లో జరుగుతుంది, తెలంగాణ కల్చర్ కి సంబంధించిన ఎలెమెంట్స్ కూడా ఉంటాయి.

 డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి మాట్లాడుతూ: ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి క్యారెక్టర్ పోస్టర్స్ ని రిలీజ్ చేశాం, ప్రతి క్యారెక్టర్ కి ఒక్కో ట్యాగ్ లైన్ క్యారెక్టర్ కి సరిపడా ఇచ్చాం, ఈ 4 విభిన్నమైన క్యారెక్టర్స్ , వారి వ్యక్తిత్వాలు ఒక అనుకోని పరిస్థితిలో కలుసుకుని అక్కడి నుండి ప్రయాణం మొదలు పెడితే ఎమవుతుంది అనే థ్రిల్లింగ్ పాయింట్ తో నడిచే కథ. నర్రేషన్ చాలా యునిక్ గా ఉంటుంది. చాలా మంది అడిగారు ఈ కథ పేరు ‘యేవమ్’ అంటే ఏంటి? ఇది తెలుగా? హిందీ ఆ? సంస్కృతమా అని. ‘యేవమ్’ అంటే “ఇది ఇలాజరిగింది” అని. ఈ నాలుగు క్యారెక్టర్స్ జర్నీ లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. ఏది మంచి ఏదో చెడు? ఎవరు మంచి ఎవరు చెడ్డ? అనే నోటుని మేము ప్రేక్షకులకే క్లైమాక్స్ అప్పుడు వదిలేస్తున్నాం.  జూన్ 14న రిలీజ్ అవుతుంది.

హీరో భరత్ రాజ్ మాట్లాడుతూ: నేను అభిరామ్ అనే పాత్ర పోషించాను. మా ట్రైలర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి చాలా థాంక్స్. మాది థ్రిల్లర్ కాబట్టి ఏ చిన్న విషయం భయటకి చెప్పినా కూడా కథ తెలిసే ఛాన్స్ ఉంది, అందుకని నేను ఏం చెప్పలేను ఇప్పుడు. కాని చాలా ఈ థ్రిల్లర్ లో చాలా హై వస్తుంది, ఇంటెలిజెంట్ గా ఉంటుంది, మా రొలెస్ తో మీరు తెలియకుండా ఇంటరాక్ట్ అవుతారు. అని అన్నారు.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago