కె.జి.యఫ్‌తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రాక్ స్టార్ యష్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా భారీ బడ్జెట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో నటించనున్నారు. ఆయన, నిర్మాత వెంకట్ కె.నారాయణ, కుటుంబ సభ్యులతో తో కలిసి కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు శ్రీసదాశివ రుద్ర సూర్య ఆలయం, ధర్మస్థలలోని శ్రీ మంజునాథేశ్వర ఆలయం, సుబ్రమణ్యలోని కుక్కే సుబ్రమణ్య ఆలయంను సందర్శించారు.
ఏదైనా కొత్త సినిమాను ప్రారంభించే ముందు ఇలా ఆలయాలను సందర్శించటం యష్‌కున్న అలవాటు అని ఆయన అభిమానులు అంటున్నారు. ఆయనకు ఫ్యాన్స్ నుంచి చక్కటి స్వాగతం లభించింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ బెంగళూరులో ఆగస్ట్ 8 నుంచి ప్రారంభం కానుంది (8-8-8)
ఇలా 8-8-8 అనే నెంబర్ వచ్చే రోజున యష్ తన కొత్త సినిమాను ప్రారంభించటం విశేషం. నెంబర్ 8తో రాకింగ్ స్టార్ యష్‌కు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన పుట్టిన తేదితో ఈ తేది సరిపోతుంది. అలాంటి ఓ తేదీన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…