యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అహాన్ పాండే, అనీత్ పద్దా జంటగా మోహిత్ సూరి తెరకెక్కించిన ‘సైయారా’ టీజర్ విడుదల
యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించిన చిత్రం ‘సైయారా’. YRF బ్యానర్ నుంచి వచ్చే ప్రేమ కథా చిత్రాలకు ఉండే ఫాలోయింగ్, క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ ‘సైయారా’ చిత్రాన్ని రూపొందించారు. అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతోనే హీరోగా పరిచయం చేయనున్నారు.
ఈ క్రమంలో అహాన్ పాండే, అనీత్ జంట ఎలా ఉండబోతోంది? అసలు వారిద్దరి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియజేసేందుకు టీజర్‌ను విడుదల చేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ ‘సైయారా’ టీజర్‌ను రిలీజ్ చేశారు. సైయారా చిత్రాన్ని కంపెనీ CEO అక్షయ్ విధాని నిర్మించారు. ఇక ఈ మూవీ టీజర్‌ను గమనిస్తే.. ఇదొక ఇంటెన్స్ లవ్ డ్రామా అని అర్థం అవుతోంది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ ప్రేమ కథను అంతే అందంగా తెరకెక్కించారు.
హీరో హీరోయిన్ల పరిచయం, ప్రేమ, బ్రేకప్ వంటి సీన్లతో టీజర్‌ను అందంగా మలిచారు. ఇద్దరి నటన ఈ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇక విజువల్స్, మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ అస్సెట్ కానున్నాయి. సైయారా అంటే ఆకాశంలోని ఒంటరి తార అని టీజర్ చూస్తే అర్థం తెలుస్తోంది.
50 సంవత్సరాల YRF చరిత్రలో ఎన్నో కల్ట్ రొమాంటిక్, ప్రేమ కథా చిత్రాలను అందించారు. ఇక మోహిత్ సూరి సైతం ఇది వరకు ఆషికి 2, మలంగ్, ఏక్ విలన్ వంటి అద్భుతమైన రొమాంటిక్ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ ‘సైయారా’ జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…